వాడుకరి:YVSREDDY/పెద్దలకు మాత్రమే

ఒక విషయం గురించి చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోలేని వయసులో ఉన్నవారు వాటిని అనుసరించి చెడు మార్గం వైపు వెళ్తారని భావించిన వాటిని ఇవి పెద్దలకు మాత్రమే అని ఒక సూచనను ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరముల వయసు పైబడినవారు, కొన్ని దేశాలలో 21 సంవత్సరాలు దాటినవారు పెద్దవారు కింద లెక్క.

సినిమాలు

మార్చు

పిల్లలు చూడకూడదని నిర్ణయించిన శృంగార భరిత మరియు హర్రర్ చిత్రాలకు A అనే అక్షరాన్ని ఆ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్లపై ముద్రిస్తారు. కొన్ని సినిమాలలో అశ్లీలత లేదా బూతు మోతాదు ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి చిత్రాలకు పెద్దలకు మాత్రమే అని హెచ్చరిక ఉంటుంది, ఇటువంటి చిత్రాలకు యుక్తవయసు (18 లేదా 21 సంవత్సరముల వయసు) రాని వారిని అనుమతించరు.

నీలి చిత్రాలు

మార్చు

ఇంటర్నెట్ లోని కొన్ని వెబ్‌సైట్లు నీలి చిత్రాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ సైట్లలో అశ్లీలత లేదా బూతు మోతాదు అధికంగా ఉంటుంది, ఇటువంటి సైట్లను ఒపెన్ చేసినప్పుడు ఆ సైట్లలో హెచ్చరికగా "పెద్దలకు మాత్రమే" అని అర్థం వచ్చేలా "A" అక్షరాన్ని పెద్దగా ప్రదర్శిస్తారు. ఇక్కడ "A" అంటే Adults అని అర్థం. AO అంటే Adults Only అని అర్థం.

నీలి చిత్రాలకు సంబంధించిన సైట్ ఒపెన్ చేసినప్పుడు ఒక్కొసారి ఇటువంటి సందేశం ఉంటుంది:

  • దయచేసి మీకు ఒక సలహా ఇది ఒక అసభ్యకరమైన లైంగిక విషయం, మీరు 18 లేదా 21 ఏళ్లలోపు మైనర్లయితే ఇది మీరు చూడకూడదు. మీకు చట్టబద్దమైన వయస్సు లేకపోతే దయచేసి ఈ వీడియోను వెంటనే మూసివేయండి.

మద్యం

మార్చు

మద్యం ఉత్పత్తులైన సారాయి, బీరు, బ్రాంది, విస్కీ, వోడ్కా, రమ్ము, జిన్ను వంటి ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని పెద్దలకు మాత్రమే విక్రయిస్తారు.

పొగాకు ఉత్పతులు

మార్చు

పొగాకు ఉత్పతులైన బీడి, సిగరెట్ వంటి ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని పెద్దలకు మాత్రమే విక్రయిస్తారు.

గుట్కాలు

మార్చు

గుట్కాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి, వీటిపై ఇవి తింటే ఆరోగ్యం పాడవుతుంది అని వ్రాసి ఉంటది, ఇటువంటి వాటిని సాధారణంగా నిషేధిస్తారు లేదా పెద్దలకు మాత్రమే విక్రయిస్తారు.

1వర్గం:పదజాలం