వాడుకరి చర్చ:Katta Srinivasa Rao/గ్రామవ్యాసాల నాణ్యత

బెంగళూరు ట్రైనింగ్ కార్యక్రమం తర్వాత ఎదురు చూస్తున్న గ్రామాల సమాచారం అనువాద కార్యక్రమం ఒక కొలిక్కి వస్తున్నందుకు చాలా సంతోషం వేసింది. నేనుంటున్న ఖమ్మం జిల్లాలో గ్రామాలకు సంభందించిన సమాచారం అత్యంత ప్రాధమికమైన నమ్మదగిన మూలం అయిన జాతీయ గణాంకాల నుండి గ్రామం గురించి ఏ అంకలయితే వున్నాయో వాటిద్వారా పూర్తి స్థాయి వ్యాస రూపం రావడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం. నేనుంటున్న సత్తుపల్లికి దగ్గరలోనే వున్న గ్రామం అడసర్ల పాడు గతంలో ఈ ఊరిగురించి నేను పరిశీలించిన కొన్ని విషయాలు ఆన్ లైన్లో రాసాను . https://www.facebook.com/nivas.katta74/posts/1055052797852571 మారుమూల వుండే గ్రామాల గురించి ఇప్పటి వరకూ వికీపిడియాలో కేవలం అస్థిపంజర నిర్మాణం లాగా చిన్ని బద్దెలతడికె లాంటింది కట్టివుంచేస్తున్నాం. వేల కొద్ది గ్రామాలగురించిన సమాచారం ఎప్పటికి పూర్తి కావాలి అనే ఆందోళన వుండేది. ఈ పద్దతిలో భారతప్రభుత్వం కోట్లాది రూపాయిలు వెచ్చించి, విద్యావంతులైన ఉద్యోగుల సహకారంతో తీసుకుని క్రోడీకరించిన సమాచారాన్ని మన వికీపిడియా వ్యాసాలుగా వాడుకునే వీలున్న టూల్ రూపొందించి అమలు చేస్తున్నందుకు గర్వంగా వుంది. చిన్ని చిన్న సవరణలను, అనువాద దోషాలనూ పరిహరించ గలిగితే ఈ వ్యాసాలు బాగా ఉపయోగపడతాయని గ్రామవ్యాసాల నాణ్యత పేరుతో చేసిన నాకు బాగా తెలిసిన ఈ గ్రామంపై చేసి ప్రయోగశాల పరిక్షలో నాకు తోస్తున్నది.

సవరణలు కావాలనుకుంటున్న వాటికి మచ్చు ఉదాహరణలు

  1. 1) దేశం అనే పేరు తెలుగులో రావడం లేదు.
  2. 2) ఇంకా చాలా పేర్లు ఆంగ్లంలోనే వున్నాయి
  3. 3) మాకిప్పుడు తాలూకా వ్యవస్థ లేదు, మండల వ్యవస్థ నడుస్తోంది కదా వెంసూరు తాలూకా అని రాసాం వెంసూరు మండలం అని రావాలేమో

బాగున్న విషయాలు, మరింకా చేర్చాల్సినవి

  • 1) గ్రామానికి సంభందించిన అక్షాంశ,రేఖాంశాలతో కూడిన టేబుల్ రావడం
  • 2) ప్రామాణిక మూలంనుంచి సమాచారం కేవలం పట్టికలుగా కాక సాధారణ విద్యావంతులైనా సులభంగా చదివి అర్ధంచేసుకునే భాషలో రావడం.
  • 3) అక్షాంశ రేఖాంశాలు, జియో ట్యాగ్ మ్యాప్, గ్రామ సదుపాయాల వివరాలు వంటివి జతచేయాల్సివుంది

వాడుకరి:Katta Srinivasa Rao/గ్రామవ్యాసాల నాణ్యత గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to the user page of "Katta Srinivasa Rao/గ్రామవ్యాసాల నాణ్యత".