వాదీ అల్ సలాం
నజాఫ్, ఇరాక్ యొక్క షియా పవిత్ర నగరంలో ఉన్న ఒక ఇస్లామిక్ శ్మశానవాటిక పేరు వాదీ అల్ సలాం. ఇది ప్రపంచంలో అతిపెద్ద శ్మశానం. ఈ శ్మశానంలో యుద్ధం జరగక ముందు ప్రతిరోజు 200 నుంచి 250 శవాల ఖననం జరిగేదని ఒక అంచనా, అయితే 2010 లో ఈ సంఖ్య వంద కిందకు పడిపోయింది. దీనిని 1400 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇప్పటివరకు ఇక్కడ ఖననం అయిన శవాల సంఖ్య 50 లక్షల పైనే ఉంటుంది. 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ శ్మశానంలో కనుచూపు మేరా సమాధులే కనిపిస్తాయి. ఇది "ఇమాం అలీ తాలిబ్" ప్రార్థన మందిరం సమీపంలో ఉంది. ఇమాం అలీ తొలి షియా ఇమాం. అందువలన షియాలందరూ మరణానంతరం తమను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారు. ఈ శ్మశానంలో ఏటా 5 లక్షల సమాధుల చొప్పున అదనంగా కూడుతాయని అంచనా. ప్రస్తుతం 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ శ్మశానవాటిక విస్తీర్ణ పరిధి ఏటేటా పెరుగుతూనే ఉంది.
మూలాలు
మార్చు- సాక్షి దినపత్ర్రిక - 20-07-2014 - 16వ పేజీ (ఊరంత శ్మశానం..)