మరుగుజ్జు వృక్షాలు

(వామన వృక్షాలు నుండి దారిమార్పు చెందింది)
జర్మనీలోని బోన్సాయి చెట్టు.

పరిచయం

మార్చు

చైనాలో పెన్జింగ్ (Penzing) అనబడే బోన్సాయ్ (Bonsai) కళ హన్ (Hun) సామ్రాజ్య హయంలో మొదలైందని చారిత్రకారుల నమ్మకం. జపాన్కు బోన్సాయ్ కళ మొదటి సంపన్నులకే పరిమితమైంది. 14 వ శతాబ్దంలో చైనా వారు జపాన్ను ముట్టడించడంతో బోన్సాయ్ కళ అన్ని వర్గాలవారికి పాకింది. ప్యారిస్లో 1878 లో మొట్టమొదటిసారిగా థర్డ్ యూనివర్సల్ ఎగ్జిబిషన్ లో బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత 1889, 1900 లో జరిగిన ప్రదర్శనల వల్ల పశ్చిమ దేశాల్లో బోన్సాయ్ కళ పట్ల ఆదరణ పెరిగింది. 1909 లో లండన్ సిటీలో మొదటి మెగా బోన్సాయ్ ప్రదర్శన జరిగింది. కాలక్రమేణా బోన్సాయ్ కళ జపాన్ దేశమంతటా ప్రసిద్ధి గాంచింది. 18, 19 శతాబ్దాలలో భారతదేశంతో సహా ప్రపంచమంతటా ఈ కళ విస్తరించింది.

మొక్కలు సేకరించే ప్రదేశాలు

మార్చు
  • శిథిలావస్థలో ఉండే ఇటుక గోడలు
  • పొలాల్లో, చేలల్లో, రోడ్ల వెంబడి తాడి చెట్లు
  • నర్సరీలు

బోన్సాయ్ సాగు పద్దతి

మార్చు

ముందుగా చిన్న మొక్కగా నర్సరీ ప్యాకెట్లలో పెంచుతూ దాన్ని సుమారు 4 నుండి 10 సంవత్సరాలవరకూ కొమ్మల కత్తిరింపులద్వారా వృక్ష ఆకారం తీసుకురావాలి. ఆ తర్వాత దాన్ని లోతు తక్కువగా ఉన్న ట్రే (Tray) లలో నాటాలి. బోన్సాయ్ మొక్కలను, ఎండాకాలంలో తప్ప, ఇతర కాలాల్లో నేరుగా ఎండలో ఉంచితే మంచిది. మట్టి తడి 90% ఆరినప్పుడు మాత్రమే నీరు పోయాలి. సంవత్సరానికి ఒకసారి మట్టిని వానపాముల ఎరువు (Earthworm waste) తో సారం చేసుకోవాలి, వర్షాకాలంలో అతిగా పెరిగిన వేళ్ళను కత్తిరించుకోవాలి. మట్టిలో కొబ్బరి పొట్టు (Coconut choir), వానపాముల ఎరువు సమపాళ్ళలో ఉండేటట్టు చూసుకోవాలి. వృక్ష ఆకారం తీసుకురావడానికి అవసరమైతే కొమ్మలను రాగితీగ (Copper wire) తో కావలసిన దిశలో వంచుకోవాలి. సృష్టిలో ఏ మొక్కకైనా తల్లివేరు (Mother root), పిల్లవేర్లు (Side roots) ఉంటాయి. తల్లివేరు మొక్కను భూమ్మీద నిలబడేలా చేస్తే, దాని చుట్టూరా ఉన్న పిల్లవేర్లు మొక్కకు ఆహారాన్ని చేరవేస్తాయి. బోన్సాయ్ మొక్కల పెంపకంలో ఈ తల్లి వేరు అవసరం లేదు కనుక, పిల్లవేర్లను మాత్రమే ఉంచి దాన్ని గార్డెన్ కటర్ తో తొలగించాలి. సాధారణంగా కొమ్మలు సూర్యకాంతి వచ్చే దిశగా ఆరోగ్యంగా ఎదుగుతాయి.

బోన్సాయ్ గా పెంచుకోదగ్గ జాతులు

మార్చు

రావి (Ficus Religiosa), మర్రి (Ficus Bengalensis), జువ్వి (Ficus Salisifolia), చింత (Tamarindus Indica), సపోట (Chikoo), మామిడి (Mangifera Indica), జీడి మామిడి (Anacardium Occidentale), జామ (Psidium Guava), సీమ చింత (Pithacelobium Dulse), నిద్రగన్నేరు (Enterolobium Dulse), తురాయి (Delonix Regia), ద్రాక్ష (Grape), చెర్రీ (Cherry), జునిపర్ (Juniper), సైప్రస్ (Cypress), బత్తాయి (Sweet lemon), మారేడు (Angel Marmelos), నేరేడు (Syzegium Cumini), తుమ్మ (Acacia Arabica)

ఇతరవిషయాలు

మార్చు
  • బోన్సాయ్ కళ చాలా అరుదైన, ఖరీదైన కళ
  • బోన్సాయ్ కళాకారుల్లో క్రియేటివ్ మైండ్ ఉంటుంది.
  • బోన్సాయ్ మొక్కలను తరతరాలకు జ్ఞాపకార్ధ బహుమతులుగా అందివ్వొచ్చు
  • బోన్సాయ్ ప్రేమికులు సాధారణంగా ప్రకృతి ప్రేమికులై వుంటారు
  • ఇతరులను ప్రేమించే మనస్తత్వం బోన్సాయ్ ప్రేమికులకు వుంటుంది.
  • బోన్సాయ్ ప్రేమికులు తమలో తాము కలివిడిగా ఉంటారు.
  • బోన్సాయ్ ప్రేమికులు సున్నిత మనస్కులై వుంటారు.
  • మొక్కల పెంపకం పై ఆసక్తిలేని వ్యక్తులనుండి బోన్సాయ్ ప్రేమికులు నిరంతరం అభ్యంతరాలు, విమర్శలు ఎదుర్కుంటూవుంటారు.
  • బోన్సాయ్ మొక్కలకు ప్రధాన శత్రువులు - పురుగులు, అల్లరి పిల్లలు, మొక్కలను దొంగిలించేవారు, శాడిజం ఉన్నవారు

కళ పై విమర్శలు

మార్చు

ప్రకృతిలో చక్కగా ఎత్తు ఎదిగే చెట్లను సేకరించి వాటిని అతితక్కువ మట్టిలో మరుగుజ్జు వృక్షాల్లా మార్చడం మహా పాపమని, మరుగుజ్జు వృక్షాలను పెంచేవాళ్ళు కఠిన రాతి హృదయం కలిగినవారని, జాలి-దయ లేనివారని బోన్సాయ్ ప్రేమికులను విమర్శించే వాళ్ళు లేకపోలేదు.

వాణిజ్యం

మార్చు

బోన్సాయ్ మొక్కల పెంపకం మహా నగరాల్లో ఎక్కువగా వుంటుంది. అందువలన మహానగరాల్లో బోన్సాయ్ మొక్కల కొనుగోలు ధర వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకూ ఉంటున్నది. బోన్సాయ్ మొక్కలను ఎక్కువగా కోటీశ్వరులు, పెద్ద పెద్ద రెస్టారెంట్ల వారు, ఐదు నక్షత్రాల హోటల్స్ వారు కొనుగోలు చేస్తారు.