వారిస్ పఠాన్
వారిస్ పఠాన్ (జననం 29 నవంబర్ 1968) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బైకుల్లా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
వారిస్ పఠాన్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 అక్టోబర్ 25 | |||
ముందు | అసదుద్దీన్ ఒవైసీ | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 అక్టోబర్ 16 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | మధుకర్ చవాన్ | ||
తరువాత | యామిని జాదవ్ | ||
నియోజకవర్గం | బైకుల్లా | ||
మహారాష్ట్ర శాసనసభలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఫ్లోర్ లీడర్
| |||
పదవీ కాలం 2014 అక్టోబర్ 16 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | స్థానం స్థాపించబడింది | ||
తరువాత | మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై , మహారాష్ట్ర , భారతదేశం | 1968 నవంబరు 29||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువారిస్ పఠాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బైకుల్లా శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మధు చవాన్‌పై 1,357 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 25,314 ఓట్లతో విజేతగా నిలవగా, మధు చవాన్ కి 23,957 ఓట్లు వచ్చాయి.[3][4]
వారిస్ పఠాన్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి యామిని జాదవ్ చేతిలో 20,023 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5] ఆయన జనవరి 2020లో ఎంఐఎం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[6]
మూలాలు
మార్చు- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Waris Pathan: The accidental politician" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 18 March 2016. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Byculla Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
- ↑ "Waris Pathan named AIMIM national spokesman" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 3 January 2020. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.