వారెన్ బఫెట్

వారెన్ బఫెట్ (అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి, బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ ఛైర్మన్. ప్రపంచలో అత్యంత ధనికుల్లో ఒకరు.

వారిన్ బఫెట్

చరిత్రసవరించు

నెబ్రాస్కాలోని ఒమాహాలో 1930లో జన్మించిన బఫెట్ ఎల్లప్పుడూ ధనవ౦తుడుగా ఉ౦డాలని అనే మనస్తత్వంతో ఉండేవాడని టైమ్ ఆర్టికల్ పేర్కొన్నది. అతని తండ్రి హోవార్డ్ స్టాక్ మార్కెట్లో బ్రోకర్ గా ఉండేవాడు. వారెన్ బఫెట్ తొమ్మిది సంవత్సరాల వయస్సు లోనే తండ్రి కార్యాలయంకు వెళ్ళి అక్కడి పనులను చేసి, వ్యాపారంలో మెలుకువలు గ్రహించేవాడు. 1942 సంవత్సరంలో బఫెట్ తండ్రి యు.ఎస్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యాడు. కుటుంబం వర్జీనియాలోని ఫ్రెడ్రిక్స్ బర్గ్ కు వెళ్లింది. 16 ఏళ్ల వయసులో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లో ప్రావీణ్యం సంపాదించి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అతను రెండు సంవత్సరాలు ఉండి, తన డిగ్రీని పూర్తి చేయడానికి నెబ్రాస్కా విశ్వవిద్యాలయానికి మారాడు, తన చిన్ననాటి వ్యాపారాల నుండి $9,800 నగదుతో 20 సంవత్సరాల వయస్సులో కళాశాల నుండి వచ్చాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అతని దరఖాస్తును తిరస్కరించింది, కానీ కొలంబియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అతని దరఖాస్తును అంగీకరించింది.[1]

వారెన్ బఫెట్ . బఫెట్ నెబ్రాస్కాలోని ఒమాహ అనే నగరంలో జన్మించాడు. బఫెట్ కి చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఆసక్తి. అలా అతనికి ఏడేళ్ల వయస్సుండగా చదివిన, వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు( వన్ థౌసండ్ వేస్ టు మేక్ తౌసండ్ డాలర్స్ ) అనే పుస్తకం అతని ఊరిలో ఉన్న గ్రంథాలయం నుండి తీసుకొని, చదివాడు అదే అతనికి డబ్బు సంపాదనపై ఇష్టాన్నిపెంచింది. ఇప్పటికి కూడా తనకు పుస్తక పఠనం తన వ్యాపారాలకు విజయాన్ని ఇచ్చిందని చెపుతాడు[2]. అలా డబ్బు సంపాదించడం కోసం కోకా-కోలా బాటిల్స్ అమ్మడం,చూయింగ్ గమ్స్ అమ్మడం,న్యూస్ మాగజైన్ వేయడం వంటివి చేసేవాడు. అంతే కాకుండా తన తాత గారి నగల దుకాణంలో కూడా పని చేసేవాడు. అలా తన పదకొండేళ్ల వయసులో తన సోదరి డోరిస్ బఫెట్ తో కలిసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఉన్న సిటీస్ సర్వీస్ లో షేర్స్ కొన్నాడు. బఫెట్ కొన్ని రోజులకు తను దాచుకున్న డబ్బుతో పొలాన్ని కొన్నాడు. అలా అతను 14 ఏళ్ళ వయసుకే తన మొదటి ఇన్ కమ్ టాక్స్ కట్టాడు. బఫెట్ కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ లో డిగ్రీని సాధించాడు.

బెంజిమెన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' అనే బుక్ ద్వారా వేల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకున్నాడు. అలా తన చదువు పూర్తయిన తర్వాత బెంజిమెన్ గ్రాహం కంపెనీలో చేరడానికి ప్రయత్నిచాడు. కాని, గ్రాహం ఒప్పుకోలేదు. ఆ తర్వాత బఫెట్ 1951 నుండి 1954 వరకు ఫాల్క్ కంపెనీలో పెట్టుబడుల సేల్స్ మాన్ గా పని చేశాడు. తర్వాత 1954 నుండి 1956 వరకు గ్రాహం న్యూమాన్ కార్పొరేషన్ లో సెక్యూరిటీస్ అనలిస్ట్ గా చేశాడు. అటు తర్వాత 1956 నుండి 1969 వరకు తను స్థాపించిన బఫెట్ పార్టనర్ షిప్ కి జనరల్ పార్టనర్ గా వ్యవహరించాడు. అలా 1970లో బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీని స్థాపించి దానికి ఛైర్మన్,వ్యవహారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అలా తన పార్టనర్ షిప్ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతో మిలినీర్ గా మారాడు.

బఫెట్ బిజినెస్ ని ఎప్పుడు అప్పుచేసి చేయకూడదు అని అంటాడు. బఫెట్ ఇన్వెస్టుమెంట్ విషయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే సూత్రాన్ని పాటిస్తాడు. అందుకే స్టాక్ మార్కెట్లో రేట్లు ఎక్కువగా ఉంటే బఫెట్ తక్కువ స్టాక్స్ కొంటాడు. తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్స్ కొంటాడు. అంతే కాకుండా బఫెట్ ఏదైనా కొత్త వ్యాపారం చెయ్యాలనుకుంటే ఒకటి నుండి రెండు పుస్తకాలు చదివిన తర్వాతే తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. అలా అమెరికాలో మూతపడే కంపెనీలను కొని వాటిని పెద్ద కంపెనీలుగా మార్చేశాడు. అలా తను తన పార్టనర్ చార్లీ మంగర్ తో కలిసి కొన్న A గ్రేడ్ షేర్స్ ద్వారా బఫెట్ బిలియనీర్ గా ఎదిగాడు.

1988లో కోకా-కోలా కంపెనీ 7 శాతం వాటాను 1.02 బిలియన్లకు కొనడం ద్వారా బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ అతిపెద్ద కంపెనీల జాబితాలో చేరింది. ఇప్పటికి కూడా కోకా-కోలా కంపెనీలో బెర్క్‌షైర్‌ హాత్‌వే షేర్ హోల్డర్ గా కొనసాగుతోంది. అంతే కాకుండా ఆపిల్,ఐబీఎం లాంటి టెక్నాలజీ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా తన ముందు చూపును ప్రదర్శించాడు. 2020 నాటికీ బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ క్రాఫ్ట్ హెయిన్జ్ కంపెనీలో 26.7 శాతం,అమెరికన్ ఎక్సప్రెస్స్ కంపెనీలో 17.6 శాతం,వెల్స్ ఫోర్గ్ కంపెనీలో 9.9 శాతం,కోకా-కోలా కంపెనీలో 9.32 శాతం,బ్యాంక్ అఫ్ అమెరికా కంపెనీలో 11.5 శాతం,ఆపిల్ కంపెనీలో 5.4 శాతం వాటాలను కలిగి ఉంది.

బఫెట్ 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో 62 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచాడు. 2010లో గివింగ్ ప్లెడ్జ్ ద్వారా బఫెట్,బిల్ గేట్స్,మార్క్ జుకస్ బర్గ్ తమ ఆదాయంలో 50 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగింస్తామని ప్రమాణం చేసారు.

మూలాలుసవరించు

  1. "Warren Buffett". biography.yourdictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-01.
  2. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2022-06-01.