మొదటి కార్యక్రమం ప్రారంభించబడిన తేదిని ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంవత్సరం అదే తేదిన జరుపుకునే ఉత్సవమును వార్షికోత్సవం అంటారు. (ఏకవచనం : వార్షికోత్సవం, బహువచనం : వార్షికోత్సవాలు) వార్షికోత్సవమును ఆంగ్లంలో యానివర్సరీ అంటారు. సెయింట్స్ జ్ఞాపకార్ధం కాథలిక్ విందులు ఏర్పాటు చేసిన సందర్భంగా మొదటిసారి యానివర్సరీ పదాన్ని ఉపయోగించారు.

వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా కేకు

వార్షికోత్సవ పేర్లు మార్చు

  • పుట్టిన రోజులు సాధారణంగా వ్యక్తులు తాము పుట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం పుట్టిన తేది నాడు జరుపుకునే వార్షికోత్సవాలు.
  • వివాహ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం వ్యక్తులు తమ వివాహం జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వివాహం జరిగిన తేది నాడు జరుపుకునే వార్షికోత్సవాలు.
  • వర్థంతులు - మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ జరుపుకునేవి వర్థంతులు వీటిని సంవత్సరికాలు అని కూడా అంటారు, ఇవి కూడా ప్రతి సంవత్సరం వ్యక్తి మరణించిన తేది నాడు జరుపుకుంటారు.