వికీకోట్ అనగా వికీవ్యాఖ్య .వికీమీడియా ఫౌండేషను ఆధ్వర్యములో మీడియావికీ సాఫ్టువేరుతో నడిచే వికీ ఆధారిత ప్రాజెక్టు కుటుంబములో ఒక ప్రాజెక్టు. డేనియల్ ఆల్స్టన్ యొక్క ఆలోచనను బ్రయన్ విబ్బర్ కార్యాచరణలో పెట్టగా రూపొందిన ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం సమిష్టి సమన్వయ కృషితో వివిధ ప్రముఖ వ్యక్తులు, పుస్తకాలు, సామెతలనుండి సేకరించిన వ్యాఖ్యల యొక్క విస్తృత వనరును తయారుచేసి వాటికి సంబంధించిన వివరాలు పొందుపరచడం. అనేక అన్లైన్ వ్యాఖ్యల సేకరణలు ఉన్నప్పటికీ సందర్శకులను సేకరణ ప్రక్రియలో పాలుపంచుకొనే అవకాశము ఇస్తున్న అతికొద్ది వాటిల్లో వికీవ్యాఖ్య ఒకటిగా విశిష్ఠత సంపాదించుకొన్నది.

ఆంగ్ల వికీవ్యాఖ్య (వికీకోట్) యొక్క లఘుచిత్రము
"https://te.wikipedia.org/w/index.php?title=వికీకోట్&oldid=2953806" నుండి వెలికితీశారు