అనాథ పేజీ అంటే "ప్రధాన పేరుబరి లోని పేజీల నుండి ఒక్క లింకైనా లేని పేజీ". వికీపీడియా అన్వేషణలో ఈ పేజీలు దొరుకుతాయి. కానీ ఈ పేజీలు సంబంధిత పేజీల నుండి ఈ పేజీలను చేరుకోగలగడం వంఛనీయం. అందుచేత్ సంబంధిత సమాచారం కలిగిన పేజీల నుండి ఈ పేజీకి లింకులివ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. అనాథలను తొలగించడం జాలనిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం.

అనాథ అంటే ఏమిటి? పరిగణించడం ఎలా?సవరించు

ఓ పేజీకి మరే ఇతర పేజీ నుండీ లింకు లేకపోతే దాన్ని అనాథ పేజీగా పరిగణిస్తారు. ఏ పేజీకైనా ఇన్‌కమింగు లింకులు అస్సలేమీ లేకపోతేనే {{Orphan}} మూసను ఉంచండి. అనాథల జాబితా నుండి తీసెయ్యడానికి ఒక్క లింకు ఉన్నా సరిపోతుంది. కానీ రెండు కంటే ఎక్కువ లింకులుంటే మంచిది.

కింది పేజీల నుండి వచ్చే లింకులు ఇన్‌కమింగు లింకులుగా పరిగణింపబడవు:

  1. అయోమయ నివృత్తి పేజీలు
  2. దారిమార్పులు సాఫ్టు దారిమార్పులు
        ...దారిమార్పులకు వచ్చే ఇన్‌కమింగు లింకులు పరిగణనలోకి వస్తాయి
  3. చర్చా పేజీలు
  4. Wikipedia pages outside of article space

కింది లింకులు పరిగణన లోకి వస్తాయి:

  1. ప్రధాన పేరుబరి లోని ఏ పేజీ అయినా -పైన చూపిన జాబితాలోనివి కాకపోతే.
  2. జాబితా వ్యాసాలు
  3. సెట్ ఇండెక్సులు

అనాథగా గుర్తించడంసవరించు

ఏదైనా పేజీకి వెళ్ళి, పరికరాల పెట్టె లోని ఇక్కడికి లింకున్న పేజీలు అనే లింకును నొక్కి, సదరు పేజీకి ఎక్కడెక్కడి నుండి లింకులున్నాయో చూడవచ్చు. పైన చూపిన పరిగణన లోకి వస్తే, {Tl|Orphan}} అనే మూసను పేజీలో పైన చేర్చండి.

ముందే అనాథలను తయారుచెయ్యకుండా ఉండడంసవరించు

కొత్త వ్యాసాన్ని తయారుచేసేటపుడే దాన్ని అనాథ కాకుండా చూడాలి. సంబంధిత లింకులను పట్టుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ పట్టుకోవచ్చు. సమయం పడితే పట్టనీండి, పనులన్నీ ఒకే రోజులో అయ్యేవి కాదుగదా! ఈ పని మీ మనసులో ఉంటే చాలు, ఇవ్వాళ కాకపోతే రేపవుతుంది.

మూసలుసవరించు

  • {{Orphan}} - అనాథగా గుర్తించేందుకు

మూలాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు