వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 40వ వారం
ఈ వారపు బొమ్మ/2016 40వ వారం
తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ,అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షం గా పేరు పొందిన ఈ మర్రి చెట్టు దాదాపు 5 ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.
ఫోటో సౌజన్యం: Abdulkaleem md