వికీపీడియా:కాపీ ఎడిట్ చేయటం

కాపీ ఎడిటింగ్ అనేది అందరికీ సాధ్యపడేది కాదన్న అపోహ నుంచి మనం ముందుగా బయటపడితే కచ్చితంగా ఆ పనిని నిర్వర్తించవచ్చు. మనం ఏదైనా పని చేయాలంటే తొలుత ఆ పనిపై చిత్తశుద్ధి అవసరం అన్నది గ్రహించండి. వికీపీడియా లాంటి విజ్ఞాన సర్వస్వాలు ఉన్నాయి కాబట్టే మనలాంటి వారికి రోజూ అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇది కాదనలేని నిజం. మీరూ వికీ అక్షర యజ్ఞానికి మీ వంతు సహకారం అందిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

కాపీ ఎడిటింగ్ ప్రక్రియ గురించి తెలుసుకునే ముందు తప్పులు లేకుండా తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలన్నది గుర్తించండి. మీకు కాపీ ఎడిటింగ్ చేయాలన్న ఉత్సాహం ఉన్నా అక్షర తప్పులను చదువరులకు చేర్చలేము కదా?