వికీపీడియా:కాపీహక్కులు

(వికీపీడియా:కాపీ హక్కులు నుండి దారిమార్పు చెందింది)

ముఖ్యమైన గమనిక: వికీపీడియా వ్యాసాలు, బొమ్మలపై వికీమీడియా ఫౌండేషనుకు ఎటువంటి కాపీహక్కులూ లేవు. అంచేత వికీపీడియాలోని వ్యాసాల పునఃప్రచురణ కోరుతూ మా అడ్రసుకు ఈమెయిలు పంపడం వృధా ప్రయాసే. వికీపీడియా లైసెన్సు మరియు సాంకేతిక నియమాలకు లోబడి ప్రచురించుకోవచ్చు. ఈ నియమాలకు లోబడి ప్రచురించుకునేందుకు విజ్ఞప్తి చేసే అవసరం లేకుండా అనుమతులిచ్చేసాం.

స్వేచ్ఛా సాఫ్టువేరుకు ఎలాగైతే ఇచ్చారో అలాగే వికీపీడియాలో కూడా మా విషయ సంగ్రహానికి స్వేచ్ఛా లైసెన్సు ఇచ్చేసాం. ఈ పద్ధతిని ఇంగ్లీషులో en:copyleft అని అంటారు. ఎడాపెడా వాడే లైసెన్సు అని తెలుగులో అనుకోవచ్చు. ఈ లైసెన్సు ఏమి చెబుతున్నదంటే.. వికీపీడియా లోని విషయాన్ని కాపీ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, తిరిగి పంపిణీ చేసుకోవచ్చు. అయితే దీన్ని వాడి తయారు చేసే ఉత్పత్తిని కూడా ఇదే లైసెన్సుతో విడుదల చెయ్యాలి. అలాగే వికీపీడియా రచయితలకు శ్రేయస్సును ఇవ్వాలి (వ్యాసానికి లింకు ఇస్తూ దాన్ని మూలంగా ఉదహరిస్తే సరిపోతుంది.). ఈ విధంగా వికీపీడియా వ్యాసాలు శాశ్వతంగా ఉచితంగా ఉంటాయి, ఎవరైనా వాడుకునేలా ఉంటాయి.

పై లక్ష్యాలను సాధించేందుకు వికీపీడియా విషయానికి (బెర్న్ ఒడంబడిక (ఎన్వికీ లింకు) ప్రకారం) ఆటోమాటిగ్గా కాపీ హక్కులు లభిస్తాయి. దీన్ని en:GNU Free Documentation License (ఎన్వికీ లింకు) (GFDL) కింద ప్రజలకు విడుదల చేసాము. ఈ లైసెన్సు యొక్క పూర్తి పాఠం en:Wikipedia:Text of the GNU Free Documentation License (ఎన్వికీ లింకు) లో చూడవచ్చు. చట్ట పరమైన కారణాల వలన ఈ పాఠ్యాన్ని మార్చరాదు.

GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్, వెర్షన్ 1.2 లేదా తదనంతరం en:Free Software Foundation (ఎన్వికీ లింకు) ప్రచురించే ఏ ఇతర కూర్పు యొక్క నిబంధనలకైనా లోబడి ఈ పత్రాన్ని కాపీ చేసుకొనేందుకు, పునఃపంపిణీ చేసేందుకు, మార్చుకునేందుకు అనుమతి ఇవ్వబడింది; with no Invariant Sections, with no Front-Cover Texts, and with no Back-Cover Texts.
ఈ లైసెన్సు యొక్క ప్రతి "GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్" (ఎన్వికీ లింకు) అనే విభాగంలో ఉంది.
వికీపీడియాలోని విషయ సమాచారం అస్వీకారాలకు (ఎన్వికీ లింకు) లోబడి ఉంది.


GFDL యొక్క ఇంగ్లీషు అసలు ప్రతి మాత్రమే చట్టబద్ధమైనది. ఇక్కడ ఉన్నది, GFDL:వాడుకరులు, సమర్పకుల హక్కులు, బాధ్యతలకు సంబంధించి మా అనువాదము, తాత్పర్యము మాత్రమే


ముఖ్య గమనిక: వికీపీడియాలోని విషయాన్ని మీరు తిరిగి వాడుకోదలస్తే ముందు తిరిగి వాడుకునేవారిహక్కులు బాధ్యతలు విభాగం చూడండి. తరువాత GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్ (ఎన్వికీ లింకు) కూడా చదవండి.

సమర్పకుల హక్కులు, బాధ్యతలు

మార్చు

మీరు వికీపీడియాలో రచనలు చేస్తున్నారూ అంటే, వాటిని GFDL లైసెన్సు కింద విడుదల చేస్తున్నట్లే. వికీపీడియాలో రచనలను సమర్పించాలంటే, ఈ లైసెన్సును ఇవ్వగలిగి ఉండాలి. అంటే కిందివాటిలో ఏదో ఒక నియమాన్ని సంతృప్తి పరచేలా ఉండాలి.

  • మీరు ఆ రచనకు చెందిన కాపీహక్కును కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఆ కృతికర్త మీరే అయి ఉంటే. అంటే ఆ రచనను మీ సొంత వాక్యాలలో రాయాలి. లేదా,
  • మీరు ఆ కృతిని GFDL లైసెన్సు కింద విడుదల చేసిన వనరు నుండి తెచ్చి ఉండాలి.

మీరు వికీపీడియాలో చేర్చిన సమాచారాన్ని మీరే సొంతంగా సృష్టిస్తేగనక, ఆ సమాచారం యొక్క కాపీహక్కులన్నీ మీ వద్దే ఉంటాయి. అటువంటి సమాచారాన్ని ఇంకొక లైసెన్సుతో వేరొక చోట సమర్పించగలిగే హక్కు కూడా మీకు ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ మీరు సమర్పించిన రచనలపై ఉన్న GFDL లైసెన్సును వెనుకకు తీసుకునే అవకాశం మీకుండదు, అంటే మీరు చేసిన కూర్పు శాశ్వతంగా GFDL లైసెన్సు కిందే ఉంటుంది.

మీరు చేర్చిన సమాచారం ఇతర GFDL వనరుల నుండీ తెచ్చినట్లయితే, GFDL నిబంధనల ప్రకారం, ఆ కృతికర్త పేరును ఉదహరించాలి, ఆ కృతికి లింకు ఇవ్వాలి.

ఇతరులకు కాపీహక్కులున్న కృతులను వాడడం

మార్చు

సార్వజనికం అయిఉంటేనో లేక కాపీహక్కులను బహిరంగంగా వద్దని ప్రకటిస్తేనో తప్ప, ప్రతి కృతికీ కాపీహక్కులుంటాయి. "సదుపయోగం" కింద కాపీహక్కులు కలిగిన ఏదైనా కృతిలో కొంత భాగాన్ని వాడినపుడు గానీ, హక్కుదారు ప్రత్యేక అనుమతితో, వికీపీడియా నిబంధనలకు లోబడి ఏదైనా కృతిని వాడినపుడు గానీ ఆ విషయాన్ని పేర్లు, తేదీలతో సహా స్పష్టంగా చెప్పాలి. వికీపీడియాలోని సమాచారాన్ని సాధ్యమైనంత మేర స్వేచ్ఛగా పంపిణీ చెయ్యాలనేది మా ఆశయం కాబట్టి, కాపీహక్కులు ఉన్న లేదా సదుపయోగం కింద ఉన్నవాటి కంటే GFDL లైసెన్సు కింద విడుదల చేసినవి గానీ, సార్వజనికమైనవి గానీ అయిన బొమ్మలు, ధ్వని ఫైళ్ళకు ప్రాముఖ్యతనిస్తాము.

ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే కృతులను ఎప్పుడూ వాడకండి. దీనివలన చట్టపరమైన ఇబ్బందులు తలెత్తి, ప్రాజెక్టు మనుగడకు భంగం వాటిల్లవచ్చు. సందేహం ఉంటే, మీరే మీసొంత వాక్యాలలో రాయండి.

కాపీహక్కు చట్టాలు ఉపాయాలను, సమాచారాన్ని కాక వాటి సృజనాత్మక ప్రదర్శనను పరిరక్షిస్తాయి. అందుచేత, వేరే కృతులను చదివి, మీ స్వంత ధోరణిలో వాటిని రూపొందించి, మీ స్వంత పదాలతో రాసి వికీపీడియాలో సమర్పించడం కాపీహక్కుల ఉల్లంఘన కిందకు రాదు. అయితే, అలాంటి రచనలలో సదరు మూలాన్ని ఉదహరించక పోవడం చట్టవిరుద్ధం కాకున్నా, నైతికం మాత్రం కాదు, కాబట్టి మీకు మీసొంత పదాలలో రాయడానికి ప్రేరణ ఇచ్చిన మూలాలను తప్పనిసరిగా పేర్కొనండి.

కాపీహక్కులున్న కృతులకు లింకు ఇవ్వడం

మార్చు

ఇటీవలి రచనలన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి కాబట్టి, మూలాలను ఉదహరించే ప్రతీ వ్యాసమూ కాపీహక్కులున్న కృతులకు లింకులు ఇస్తుంది. ఇలా లింకు ఇవ్వడం కోసం కాపీహక్కుదారుని అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే, లింకులు GFDL వనరులకే ఇవ్వాలన్న నిబంధన కూడా వికీపీడియాలో లేదు.

కృతికర్త యొక్క కాపీహక్కులను ఉల్లంఘించి, ఏదైనా వెబ్ సైటు ఆ కృతిని వాడుకున్నట్లు గమనిస్తే, ఆ వెబ్ సైటుకు లింకు ఇవ్వకండి. అలాంటి వెబ్ సైట్లకు కావాలని లింకులు ఇవ్వడాన్ని కొన్ని దేశాలలో సహకార ఉల్లంఘనగా భావిస్తారు. అలా లింకు ఇస్తే వికీపీడియాపైన, వికీపీడియనుల పైనా దురభిప్రాయం కలిగే అవకాశముంది.

కాపీహక్కుల ఉల్లంఘనను గమనిస్తే..

మార్చు

కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని మీరు గమనిస్తే, కనీసం ఆ పేజీ యొక్క చర్చాపేజీలో ఆ విషయం తెలియబరచాలి. ఇతరులు దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. మూలం ఎక్కడుందో మీకు తెలిస్తే దాని URLను ఇవ్వండి, అది కాపీహక్కు ఉల్లంఘన అని తేల్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కొన్ని కేసులు టీకప్పులో తుపాను లాంటివి. ఉదాహరణకు, వికీపీడియాలో రాసిన రచయితే అసలు కృతిపై కాపీహక్కులు కలిగి ఉండవచ్చు. అలాగే, మీరు చూసిన అసలు కృతికి మూలం మళ్ళీ వికీపీడియానే అయి ఉండవచ్చు. అలాంటివి మీరు గమనించినపుడు ఆ పేజీ చర్చాపేజీలో ఆ సంగతి రాస్తే భవిష్యత్తులో సభ్యులు అలా పొరబడకుండా ఉంటారు.

కాపీహక్కు ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఆ పాఠ్యన్ని తొలగించాలి. ఆ విషయం మూలంతో సహా దాని చర్చాపేజీలో రాయాలి. కృతికర్త అనుమతి పొందితే ఆ పాఠ్యాన్ని తిరిగి పెట్టవచ్చు.

పేజీలోని మొత్తం పాఠ్యమంతా ఉల్లంఘనే అయితే ఆ పేజీని వికీపీడియా:కాపీహక్కు సమస్యలు పేజీలోని జాబితాలో చేర్చాలి. పేజీలోని పాఠ్యాన్ని పూర్తిగా తొలగించి ఉల్లంఘన పట్టిని తగిలించాలి. ఓ వారం తరువాత కూడా అది ఉల్లంఘనే అనిపిస్తే తొలగింపు పద్ధతిని పాటిస్తూ పేజీని తొలగించాలి.

పదే పదే కాపీహక్కుల ఉల్లంఘన చేసే సభ్యులను తగు హెచ్చరికల తరువాత నిషేధించాలి.

బొమ్మల మార్గదర్శకాలు

మార్చు

రచనల లాగానే బొమ్మలు, ఫోటోలకు కాపీహక్కులు ఉంటాయి. బొమ్మ వివరణ పేజీల్లో వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు పేజీలో చెప్పిన విధంగా బొమ్మ యొక్క చట్టపరమైన స్థితిని తెలియజేసే పట్టీ పెట్టాలి. సరైన పట్టిలు లేని బొమ్మలు, అసలే లేని బొమ్మలను తొలగిస్తారు.

అమెరికా ప్రభుత్వ ఫోటోలు

మార్చు

అమెరికా సమ్యుక్త రాష్ట్రాల ప్రభుత్వ పౌర, సైనిక ఉద్యోగులు తమ ఉద్యోగ రీత్యా ప్రచురించే ఏ కృతియైనా చట్టరీత్యా సార్వజనికమై ఉంటుంది. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రచురించే ప్రతిదీ ఈ వర్గంలోకి రాదు. ఇతరుల ద్వారా ప్రభుత్వానికి సంక్రమించే కాపీహక్కులు కూడా ఈ కోవలోకి రావు.

పైగా, .mil, .gov వెబ్ సైట్లలో వాడే బొమ్మలు, ఇతర మీడియా ఇతరులకు చెందిన కృతులను వాడుతూ ఉండి ఉండవచ్చు. వెబ్ సైటు గోప్యతా విధానం చదివితే ఈ విషయంలో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, వెబ్ మాస్టరుకు ఈమెయిలు పంపి కాపీహక్కు వివరాలు తెలుస్కోవడం అన్నిటికంటే ఉత్తమం.

ఇంగ్లాండు, భారతదేశం వంటి కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు తమ కృతులపై కాపీహక్కులను తమవద్దే ఉంచుకుంటాయి. అమెరికాలోని రాష్ట్రాలు కూడా చాలావరకు ఈ పద్ధతినే పాటిస్తాయి.

ప్రముఖుల ఫోటోలు

మార్చు

సరైన ఫోటోలు అనుమతులతో సహా దొరికే స్థలాలు మూడు.

  1. స్టూడియోలు, నిర్మాతలు, పత్రికా ప్రచురణకర్తలు మొదలైనవారు.
  2. ఆయా ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లకు చెందిన ఏజన్సీలు, లేదా స్వయానా ఆ ఫోటోగ్రాఫర్లే
  3. స్వయంగా సదరు ప్రముఖులే లేదా వారి ప్రతినిధులు

పునర్వినియోగదారుల హక్కులు, బాధ్యతలు

మార్చు

వికీపీడియాలోని వ్యాసాంశాలను మీ పుస్తకాలు/వ్యాసాలు/వెబ్ సైట్లు లేదా ఇతర ప్రచురణల్లో వాడదలచుకుంటే, వాడుకోవచ్చు; కానీ GFDL కు లోబడి. వికీపీడియా వ్యాసాన్ని యథాతథంగా వాడదలిస్తే, GFDL యొక్క విభాగం 2 లోని verbatim copying (మక్కికి మక్కి కాపీ) ని అనుసరించాలి.

మీరు వికీపీడియా వ్యాసాంశాలను వాడి తద్భవాలను తయారుచేసేటపుడు, కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి:

  • మీ ఉత్పత్తులను తిరిగి GFDL కు అనుగుణంగా లైసెన్సు చెయ్యాలి
  • వ్యాసపు కర్తను ఉదహరించాలి
  • వ్యాసాల పారదర్శక ప్రతులకు లింకులివ్వాలి. (పారదర్శక ప్రతి అంటే మా వద్ద లభించే ఎన్ని రకాలైన ఫార్మాటులైనా అని - వికీటెక్స్టు, html వెబ్ పేజీలు, xml ఫీడు మొదలైనవి)


"సదుపయోగ" వస్తువులు, ప్రత్యేక నియమాలు

మార్చు

వికీపీడియా స్వంత పాఠ్యమంతా GFDL లైసెన్సు కింద విడుదల చేసాం. అప్పుడప్పుడు, వికీపీడియా వ్యాసాల్లో "సదుపయోగం" కిందకు వచ్చే బొమ్మలు, ధ్వనులు, పాఠ్యాంతరాలు ఉండే అవకాశం ఉంది. ఇలా బయటి నుండి తెచ్చే కృతులను వీలైనంత స్వేచ్ఛా లైసెన్సుకు అనుగుణంగా తెస్తే బాగుంటుంది - GFDL లేదా సార్వజనికం వంటివి). అలాంటి కంటెంటు దొరకనపుడు "సదుపయోగం" కిందకు వచ్చే బొమ్మలు/ధ్వనును వాడవచ్చు.

అనుమతి లేకుండా వికీపీడియాలో ప్రచురించిన ఏదైనా విషయానికి స్వంతదారు మీరే ఐతే..

మార్చు

మీ అనుమతి లేకుండా మీ స్వంత కృతిని వికీపీడియాలో ప్రచురించి ఉంటే, వెంటనే ఆ పేజీని వికీపీడియా నుండి తీసివెయ్యమని అడగవచ్చు; కాపీహక్కుల ఉల్లంఘనకు గాను త్వరిత తొలగింపు అభ్యర్ధన చూడండి. మీరు మా అధీకృత ఏజంటును కూడా సంప్రదించవచ్చు; అయితే ఆ పద్ధతిలో తొలగించడానికి ఒక వారం దాకా పట్టవచ్చు. (మీరు ఆ పేజీని పూర్తిగా ఖాళీ చేసి {{copyvio|మీ కృతి యొక్క URL గానీ, లేక ప్రచురణ స్థలం పేరు గానీ}} అనే ట్యాగు పెట్టవచ్చు. కానీ పూర్తి పాఠ్యం చరితంలో ఉంటుంది). ఏ పద్ధతిలోనైనప్పటికీ, మీరు స్వంతదారు అని అనడానికి రుజువు చూపించవలసి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

మార్చు