వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు
నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చేసే సభ్యులకు ఉండదగిన అర్హతలు, ప్రమాణాల విషయమై కొన్ని మార్గనిర్దేశకాలు. ముఖ్యంగా ఇవి శిలాశాసనాలు కావని గుర్తించాలి. సమయానుగుణంగా, ఒక్కో ఆభ్యర్ధిత్వాన్ని బట్టి, సముదాయము యొక్క విచక్షణను బట్టి పట్టువిడుపులు ఉండవచ్చు.
- అభ్యర్ధికి తెలుగు వికీపీడియాలో ఖాతా ఉండాలి.
- అభ్యర్ధికి సభ్యుల పేజీ ఉండి ఉండాలి. ఆ సభ్యుల పేజీలో వ్యక్తిగత విషయాలు బయల్పరచవలసిన అవసరము లేదు కానీ తన వికీ ఇష్టాఇష్టాలు, పరిజ్ఞానము, వికీలో ఇంతవరకు చేసిన కృషి గురించి కొంతైనా సమాచారం ఇవ్వదగినది. ఈ విధముగా అభ్యర్ధి యొక్క ఇష్టాఇష్టాలు మరియు కృషిని సభ్యులందరూ తెలుసుకోగలరు.
- తెలుగు వికీపీడియాలో కనీసం ఒక మూడు నెలలైనా పనిచేసిన అనుభవం ఉండాలి.
- అభ్యర్ధి కనీసం ఒక వెయ్యి దిద్దుబాట్లైనా చేసి ఉండాలి (ఈ దిద్దుబాట్లు అన్ని నేంస్పేసులలోను విస్తరించి ఉంటే మరింత సానుకూలంగా ఉంటుంది).
- అభ్యర్ధి యొక్క దిద్దుబాట్ల రాసితో పాటు వాసిని కూడా పరిగణలోకి తీసుకుంటారు (ఉదా: ఎన్ని విశేష వ్యాసాలను రాశారు/లేదా మంచి వ్యాసాలపై పని చేశారు అనే సంఖ్య)
- అవగాహన
- వికీ పద్ధతులు, మరియు విధానాలను (పాలసీలను) అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉండాలి. (ఉదాహరణకు, దిద్దుబాటు సారాంశం రాయడం - వికీ దీన్ని చాలా మంచి అలవాటుగా పరిగణిస్తుంది, చిన్న మార్పులను గుర్తించడం, వ్యాసాల్లో వ్యక్తుల పేర్లు ఎలా రాయాలి, ఏకవచన సంబోధన వంటి శైలికి సంబధించిన విషయాలు మొదలైనవి)
- మూస, వర్గం, పట్టిక వంటి వికీపీడియా అంశాలను ఎంత బాగా అర్థం చేసుకుని ఉండాలి.
- ఆసక్తి
- నిర్వహణా వ్యవహారాలలో ఆసక్తి.
- వికీ విధానాలపై చర్చలో పాల్గొని చక్కటి అభిప్రాయాలను వెల్లడించేవారు నిర్వాహకత్వానికి మెరుగైన అభ్యర్ధులౌతారని తెవికీ సముదాయము యొక్క ఉద్దేశ్యం.
- మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారు (సూచనలు, సలహాలు ఇవ్వగలిగిన వారు తప్పక వికీ గురించి ఎక్కువగానే తెలిసి ఉండి ఉంటారు)
- ఇతరసభ్యుల అభిప్రాయాలను గౌరవించేవారు
- తోటి సభ్యులతో సఖ్యతతో వ్యవహరించాలి.
- కొత్త ఆలోచనలతో మార్పులు చేయువారు.
- నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేసుకున్నవారు.