వికీపీడియా:పోలింగు, చర్చకు ప్రత్యామ్నాయం కాదు

వికీపీడియా ఏకాభిప్రాయాన్ని నిర్మించడం ద్వారా పనిచేస్తుంది. విభేదాలు తలెత్తినప్పుడు, చర్చ, వాదనలు, సహకారం ద్వారా వాటిని పరిష్కరించుకుంటారు. పోల్స్‌పై నిషేధమేమీ లేనప్పటికీ, వాటిని జాగ్రత్తగా వాడాలి. పోల్స్ ఉపయోగించినప్పుడు, అవి సాధారణంగా ఏకాభిప్రాయాన్ని నిర్ణయించడంలో సహాయపడే సాధనంగానే పరిగణించాలి తప్ప, వాటిని మీ ఏకైక నిర్ణయాత్మక కారకంగా మార్చవద్దు. అనేక ప్రక్రియలలో ( వికీపీడియా: తొలగింపు కోసం వ్యాసాలు వంటివి) పోలింగు అంతర్భాగంగా ఉన్నప్పటికీ, వ్యాసాల అభివృద్ధికి మాత్రం దాన్ని సాధారణంగా వాడరు. వికీపీడియా ప్రజాస్వామ్యం కాదని గుర్తుంచుకోండి; పోల్స్ అనేవి "ఓట్లు" లాగానే కనిపించినప్పటికీ, వికీపీడియాలో ఏకాభిప్రాయం పైననే చాలా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, ఓటు లెక్కింపు ద్వారా గానీ, మెజారిటీ నియమం ద్వారా గానీ కాదు. క్లుప్తంగా చెప్పాలంటే, పోలింగు చర్చకు ప్రత్యామ్నాయం కాదు.

స్టీవార్డులను ఎన్నుకోవడం వంటి విస్తృత క్రాస్-ప్రాజెక్ట్ కార్యకలాపాలు ఈ పద్ధతికి మినహాయింపులు. ఇటువంటి ప్రక్రియలు వాటిలోపాల్గొనేవారి నుండి వివరణాత్మక హేతువును రాబట్టకుండానే పూర్తి చేస్తారు. అలాగే, కొన్ని సంఘాలు (మధ్యవర్తిత్వ కమిటీ, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు లేదా జిమ్మీ వేల్స్ వంటివి) ఏకాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిర్ణయాలు చేయవచ్చు.

ఎన్నికల పట్ల ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?

మార్చు

ఎన్నికల పట్ల అప్రమత్తంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి:

  1. వోటింగులో పెట్టిన వికల్పాల్లో ఉత్తమ పరిష్కారం (లేదా ఉత్తమ రాజీ పరిష్కారం) లేనట్లైతే వాడుకరులు దాన్ని కోల్పోతారు. సమస్యలు సంక్లిష్టంగా గానీ, బహువిధాలుగా గానీ ఉంటే ఇది మరీ సమస్యాత్మక మౌతుంది. ఏకాభిప్రాయాన్ని నెలకొల్పడమనే ప్రక్రియలో, వివిధ వికల్పాల్లో ఒకదాన్ని ఎంచుకోవడం లాగా కాకుండా, అందరూ పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చేవరకు అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, దాని వెనుక ఉన్న తార్కికతను విస్తరించడం, ఇతరులు స్పృశించని అంశాలను వెలికితీయడం వంటివి జరుగుతాయి. అసలు చర్చలోకే రాని అభ్యంతరాలను లేదా అంశాలను పరిష్కరించడమనేదే ఉండదు.
  2. పోలింగు, విభజనలకూ కక్షసాధింపులకూ దారి తీయవచ్చు. పోలింగు అప్పుడప్పుడూ పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో ఉపయోగపడుతుందేమో గానీ ఇతర సందర్భాల్లో ఇది చర్చల మూలాలనే బలహీనపరుస్తుంది. కనీస స్థాయిలో, పోలింగు వలన ఓటర్ల మధ్య మర్యాద, మన్ననలు మృగ్యమై, వివిధ శిబిరాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. వాడుకరుల్లో విభజన తేవడం, పంతాలు పెరగడం వంటి వాటి కారణంగా మర్యాద మన్ననలు నశిస్తాయి. వివాదాస్పద విషయాలపై చర్చ పరుషంగా మారుతుంది. పాల్గొనేవారిలో ఎదటివారు సదుద్దేశం తోనే ఉన్నారనే భావన ఏర్పడదు. చాలా సందర్భాల్లో, అన్ని పక్షాల వాదనలను జాగ్రత్తగా పరిశీలించడం, విశ్లేషించడం, చివరికి సంశ్లేషణను ప్రోత్సహించడంలో పోల్ కంటే సాధారణ చర్చలే మెరుగైనవి.
  3. మెజారిటీ ఆటోమాటిగ్గా వాదనను గెలుచుకుంటుందనో లేదా అందులో వచ్చే నిర్ణయానికి శాశ్వతంగా కట్టుబడి ఉంటారనో పోల్స్ గురించి వాడుకరులు అనుకోవచ్చు. కానీ ఇది ఏది వికీపీడియా కాదు (ప్రజాస్వామ్యం), ఏది వికీపీడియా (ఏకాభిప్రాయం) అనే వికీపీడియా విధానానికి విరుద్ధం.
  4. వికీపీడియాలో ఓటు వేయడం ద్వారా సమస్యలను పరిష్కరించడం మొదలైతే, ఎడిటర్లు వ్యాసాల్లోని కంటెంట్‌కు సంబంధించి కూడా ఓటింగ్‌ను ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. ఇది వికీపీడియా మౌలిక విధానాలైన నిర్ధారత్వాన్ని, విషయ ప్రాముఖ్యతను, తటస్థ దృక్పథాన్నీ సమూలంగా బలహీనపరచవచ్చు.

వికీపీడియా వ్యాసాలను చర్చించేటప్పుడు పోల్స్ వాడకం

మార్చు

వికీపీడియాలో అసలు చర్చ జరపకుండా, ఓటింగులో పాల్గొని వోటెయ్యడానికి లైన్లో నిలబడరు. వ్యాసాలలో ఏయే అంశాలను చేర్చవచ్చు అనే దానిపై చర్చించే సమయంలో కొన్ని సందర్భాల్లో, తాత్కాలిక, అనధికారిక, సూచనాత్మక పోల్స్ జరుపుతూంటారు. ఇటువంటి పోల్స్ అప్పుడప్పుడు వాడినప్పటికీ, కొన్నిసార్లు అవి పనికొచ్చినప్పటికీ, వాటి ఉపయోగం మాత్రం తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఆ వోటింగుల్లో వచ్చే ఫలితాన్ని అనుసరించాల్సిందే అనే నిబంధన వికీలో లేదు. ఒకవేళ ఈ పోల్స్‌ను జరిపినా, ఒక వ్యతిరేక అభిప్రాయపు నోరు నొక్కేసేందుకు కాకుండా, ఏకాభిప్రాయానికి చేరుకోవడానికి సహాయపడే విధంగా వీటిని రూపొందించాలి.

వాడుకరుల ప్రవర్తనలను కొలిచేందుకు గతంలో క్విక్‌పోల్స్ అనే వ్యవస్థను వాడేవారు. ఈ పద్ధతిని చాలా సంవత్సరాల క్రితమే మానేసారు. ఎందుకంటే దీనివలన వచ్చే ప్రయోజనం కంటే దుష్ప్రయోజనాలే ఎక్కువగా ఉండేవి. వెలుతురు కంటే వేడిని ఎక్కువగా ఇచ్చే దీపం లాగా ఇవి ఉండేవి. కంటెంటు సమస్యలైతే పోలింగుకు లోబడి ఉండనే ఉండవు. ఏదేమైనప్పటికీ, వ్యాసపు చర్చ పేజీలలో పాల్గొనేవారు, తాము ఎదుర్కొంటున్న ఒక నిర్దుష్టమైన ప్రశ్నపైన గాని, సుదీర్ఘమైన చర్చపైన గానీ కొన్నిసార్లు అభిప్రాయాన్ని అంచనా వేయడానికి పోల్స్ ప్రారంభిస్తారు. పోలింగుపై సంపూర్ణ నిషేధమేమీ లేదు. వాటిని వికీలో వాడకూడదనే వాదనను ఉపయోగించి పోల్‌ను ముగించేసినపుడు, అభ్యంతరాలు ఎదురైన సందర్భాలు కూడా ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్నాయి. పోల్ తగదని భావించే వాడుకరులు, దానికి బదులుగా, సమస్య పట్ల మరింత వ్యాఖ్యానం అవసరమని చెబుతూ స్వేచ్ఛా-రూప సంభాషణకు తిరిగి వెళ్లడానికి ప్రోత్సహించవచ్చు.

స్ట్రా పోల్ మార్గదర్శకాలు

మార్చు

ఆర్టికల్ కంటెంట్‌కు సంబంధించి జరిపే స్ట్రా పోల్స్ (సూచనాత్మక పోల్స్) తరచుగా అస్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు చాలా వివాదాస్పదంగానూ ఉంటాయి. స్ట్రా పోల్స్ ఉత్పాదకంగా ఉండటానికి, పోల్స్‌ను జాగ్రత్తగా (పైన) పరిగణించాల్సిన కారణాలను వాడుకరులు గుర్తుంచుకోవాలి. ఎన్నికలు ఉపయోగించినప్పుడు, వాడుకరులు క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి:

  1. ఏదైనా వ్యాసంపై జరిగే చర్చ యొక్క లక్ష్యం ఏకాభిప్రాయం. వ్యాసాల సందర్భంలో, స్ట్రా పోల్‌లు ఎడిటర్‌లకు నిజంగా నిజమైన ఏకాభిప్రాయాన్ని చేరుకోవడంలో, ఏకాభిప్రాయం ఉందా లేదా అనేది మూల్యాంకనం చేయడంలో లేదా వ్యాసం పేరు కోసం రెండు వికల్పాల వంటి కొన్ని వివిక్త ఎంపికల మధ్య ఎడిటర్ల అభిప్రాయాన్ని "పరీక్షించడం"లో మాత్రమే సహాయకారిగా ఉంటాయి. పోల్స్ వాటంతట అవే ఏకాభిప్రాయాన్ని సృష్టించవని గుర్తుంచుకోవడం ముఖ్యం. అవి పరస్పర ఏకాభిప్రాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఏకాభిప్రాయం ఉందో లేదో అంచనా వేయడానికీ ఉపయోగపడే ఒక సాధనం మాత్రమేనని గుర్తుంచుకోవాలి.
  2. స్ట్రా పోల్ ఉద్దేశ్యం ఏకాభిప్రాయం దిశగా చర్చను ప్రేరేపించడం. స్ట్రా పోల్‌లో పాల్గొనేవారు అందించే వివరణలను ఎడిటర్‌లు మూల్యాంకనం చేయాలి. ఆ వివరణలు వారి స్వంత అభిప్రాయాలను పెంపొందించడానికి గాని లేదా రాజీని సూచించడానికి గానీ సహాయపడతాయేమో చూడాలి. చక్కగా సహేతుకంగా వెలిబుచ్చిన కొద్దిపాటి అభిప్రాయాలు ఏ వివరణా లేణి అనేక ఓట్ల కంటే చర్చను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు.
  3. పోల్‌లు ఏకాభిప్రాయానికి రావడానికి, ఏకాభిప్రాయం ఉన్నప్పుడు మూల్యాంకనం చేయడంలోనూ సహాయకారిగా ఉండవచ్చు. అయితే కాలక్రమేణా ఏకాభిప్రాయం మారవచ్చు. ఏకాభిప్రాయంతో ఏకీభవించని సంపాదకులు సంఘ ఏకాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నంలో మర్యాద గానే విభేదిస్తూనే ఉండవచ్చు. మెజారిటీగా కనిపించే సంపాదకులు చర్చలు కొనసాగించి, వికీపీడియా విధానాలు మార్గదర్శకాలలో సాధ్యమైనంత విస్తృతమైన ఒడంబడికను చేరుకోవడానికి ప్రయత్నించాలి.
  4. స్ట్రా పోల్ నిర్ణయాత్మకంగా లేకపోతే లేదా సమర్థకులు, వ్యతిరేకుల అంతరం తక్కువగా ఉంటే, లేదా ప్రశ్న న్యాయమైనదేనా అనే విషయంలో గణనీయమైన భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే, పోల్ నుండి ఏకాభిప్రాయ ఫలితాలు రావు. దానికి పరిష్కారం విస్తృత ఇన్‌పుట్‌ను కోరడం లేదా చర్చలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించడం.
  5. ఇతరులను స్ట్రా పోల్‌లో పాల్గొనమని అభ్యర్థించడంలో ఎడిటర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రచారం గురించి వివరించేవికీపీడియా:ప్రచారం చూడండి. ఇది కాన్వాసింగ్‌పై విధానాన్ని వివరిస్తుంది ("వోట్‌స్టాకింగ్", ప్రాపగాండా వంటి ఇతర రూపాలను కూడా వివరిస్తుంది).
  6. స్ట్రా పోల్‌కు ప్రతిస్పందనలు ప్రారంభమైన తర్వాత, పోల్ యొక్క పదజాలం లేదా ఎంపికలలో చిన్నపాటి మార్పులు చేసినా కూడా ఈ మార్పులు న్యాయమైనవేనా, "గోల్‌పోస్ట్‌లను జరిపినట్లా" అనే దానిపై భిన్నాభిప్రాయాలకు దారితీయవచ్చు. దీని కారణంగా, పోల్‌ను ప్రారంభించడానికి ముందు అడిగే నిర్దుష్టమైన ప్రశ్నలపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఖచ్చితమైన ప్రయత్నం చేయాలి.
  7. వ్యాసం కంటెంట్ గురించిన చర్చలు తటస్థ దృక్కోణం లేదా ధృవీకరించదగిన మూలాలపై వికీపీడియా మౌలిక విధానాలను అతిక్రమించలేవు. వాస్తవాన్ని గుర్తించడానికి స్ట్రా పోల్స్ ఉపయోగించరాదు; అటువంటి పోల్ అంతిమంగా అర్థరహిత మౌతుంది.
  8. స్ట్రా పోల్‌లను మరీ ముందుగా గానీ, లేదా అతిగా గానీ ఉపయోగించకూడదు. కొనసాగుతున్న చర్చలను బట్టి ఏకాభిప్రాయం కుదరలేదని స్పష్టమైతే, ఇక స్ట్రా పోల్ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడంలో సహాయపడదు. దని వలన అభిప్రాయాల ననుసరించి వైరుధ్యాలు ఏర్పడవచ్చు, ఏకాభిప్రాయం ఏర్పడకుండా నిరోధించనూవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. ఏదైనా సమస్యపై ఇటీవలి కాలంలో ఒక స్ట్రా పోల్‌ను నిర్వహించి ఉంటే, ఏకాభిప్రాయం మారిందనో లేదా మొదటి పోల్ అన్యాయంగా నిర్వహించబడిందనో మీరు భావించినప్పటికీ, మరొక పోల్‌ని నిర్వహించడానికి సాధారణంగా హేతువు ఉండదు. "మెజారిటీ" అభిప్రాయంతో విభేదించే పనైతే, పైనున్న #3వ పాయింటును గుర్తుంచుకోండి, చర్చలను కొనసాగించండి.

ఇవి కూడా చూడండి

మార్చు