వికీపీడియా:బొమ్మల నిర్వహణ/లైసెన్స్ లేని ఫైళ్ల శుద్ధి - 1

దాదాపు 1000 సంఖ్య వున్న లైసెన్స్ లేని ఫైళ్ల శుద్ధి పూర్తయ్యింది. సుమారు 500 తొలగించగా, మిగతావాటికి లైసెన్స్ లు చేర్చబడ్డాయి. ఆ పని సమీక్ష వివరాలు ఈ వ్యాసం ఉద్దేశం.

పని కాలం

మార్చు

2021-10-21 : 2021-12-29

పాల్గొన్న వారు

మార్చు
  1. User:Arjunaraoc
  2. User:Chaduvari
  1. User:MGA73

సమీక్ష

మార్చు

దాదాపు 1000 సంఖ్య వున్న లైసెన్స్ లేని ఫైళ్ల శుద్ధి పూర్తయ్యింది. సుమారు 500 తొలగించగా, మిగతావాటికి లైసెన్స్ లు చేర్చబడ్డాయి. డేనిష్ వికీపీడియా వాడుకరి MGA73 తెలుగువికీలో లైసెన్స్ లేని ఫైళ్లు పెద్ద మొత్తంలో ఉండడం గమనించి రచ్చబండలో వ్యాఖ్య, సూచనలు మార్చి 2021 లో చేశారు. ఆ తరువాత అక్టోబరులో అర్జున చర్చాపేజీలో మరల గుర్తు చేశారు. అర్జున ఎక్కువ మొత్తంలో అటువంటి ఫైళ్లగల వారితో సంప్రదింపులు ప్రారంభించారు. చదువరి, వాడని లైసెన్సు లేని ఫైళ్లకు వర్గం తయారు చేశారు. ఆ ఫైళ్ల ఎక్కింపుదారులకు హెచ్చరించి, వారం తరువాత తొలగించడం జరిగింది. అర్జున స్వరలాసిక, Ajaybanbi, JVRK Prasad లతో సంప్రదించితే స్వరలాసిక గారు తమ ఫైళ్లకు లైసెన్సులు సవరించారు. తరువాత రెండవ విడతగా 20, అంతకంటే ఎక్కువ ఫైళ్లు ఎక్కించినవారితో సంప్రదింపులు జరపడం జరిగింది. చివరిగా మిగిలిన ఎక్కింపు దారులను హెచ్చరించి, లైసెన్సులు సవరించని ఫైళ్లను 2021-12-29 నాడు తొలగించడం జరిగింది. ఈ ప్రక్రియలో చాలాకాలం క్రిందట ఎక్కింపులు జరిగిన ఫైళ్లను అర్జున వీలైనంతవరకు వాటిలో గల వివరాలను బట్టి లైసెన్సులు సవరించడం, సముచిత వినియోగ వివరాలు చేర్చడం చేశారు. హెచ్చరింపుకు స్పందించిన వారిలో YVS Reddy, T.sujatha, Veera.sj Pranayraj1985 వున్నారు. అర్జున గమనింపు ప్రకారం, వీటిలో ముఖ్యంగా సొంతకృతులైన నాణ్యత గల ఫైళ్లు వాడుకరి:Ramireddy గారి స్పందనలేకపోవటంతో తొలగింపునకు గురైన వాటిలో వున్నాయి.

బాగా జరిగినవి

మార్చు
  • ఆంగ్ల వికీనుండి దిగుమతి చేసిన ఫైళ్ల లైసెన్సులు పాతబడడంతో చాలా ఫైళ్లకు యాంత్రికంగా చదవలేని వివరాలు గల బొమ్మలు అనే వర్గాలు కనిపించేవి. అందుకొరకు తొలిగా లైసెన్సు వివరాలను ఆంగవికీనుండి తాజాపరచటం జరిగింది. అయినా చాలా ఫైళ్లకు {{Information}} వాడకపోవటంతో అవి అటువంటి వర్గాలలో కనబడతాయి.
  • దశలవారీగా ప్రక్రియ చేపట్టటంతో, లైసెన్సులపై అవగాహన పెరిగి అవసరమైన ఆంగ్లవికీలో కొత్త లైసెన్సులు దిగుమతి చేయడం జరిగింది
  • ఒక్క ఫైలుకు సమస్యవున్నా, సంబంధిత ఎక్కింపుదారుకి తన ఫైల్ సమస్యల పేర్లతో వ్యక్తిగత హెచ్చరిక చేర్చటానికి, క్వారీ క్వెరీని, mediawiki API ని వాడి PAWS తో ఫైథాన్ జూపిటర్ నోట్బుక్ కోడ్ తయారు చేసి ఉపయోగించడం జరిగింది. ఇదే విధంగా తొలగింపుకు గురైన ఫైళ్లకు, వ్యాస పేరుబరి, వికీపీడియా పేరుబరిలో గల వాడుకలను తొలగించడానికి కూడా కోడ్ వాడడం జరిగింది. ఈ ప్రక్రియలో బాట్ ఖాతాతో పొందిన వాడుకరిపేరు, సాంకేతిక పదాల టోకెన్ వాడినా, సాంకేతిక సమస్య వలన మార్పులు బాట్ గా నమోదవుటలేదు.

బాగా జరగనవి

మార్చు
  • హెచ్చరికలకు స్పందనలు చాలా తక్కువ. చివరిదశలో 69 మందికి హెచ్చరిక చేర్చితే ముగ్గురు మాత్రమే స్పందించారు.
  • కొంత సముచిత వినియోగ వివరణలు అసంపూర్తిగా వున్నాయి.

గమనింపులు, ముందు పనికి సూచనలు

మార్చు
  • ఫైళ్ల నిర్వహణపై ధ్యాస పెట్టిన నిర్వాహకులు చాలా కొద్దిమంది అనగా ఇద్దరు ముగ్గురు మాత్రమే. నిర్వాహకులు ఫైళ్ల నిర్వహణపై అవగాహన పెంచుకొని నిర్వహణలో పాలుపంచుకోవాలి.
  • గతంలో కొంతమంది లైసెన్స్ వివరాల పేర్ల వర్గాలను నేరుగా ఫైల్ పేరుబరిలో చేర్చారు. ఈ వర్గాలు ఆయా మూసల ద్వారా మాత్రమే చేరాలి.
  • ఈ సంవత్సరంలో వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టు భాగంగా కొంతమంది సముచిత వినియోగ ఫైళ్లు సరైన వివరాలు లేకుండా ఎక్కించటం లేక వాడటం చేశారు. ఇటువంటి పోటీలు కేవలం స్వేచ్ఛానకలుహక్కుల ఫైళ్లకే పరిమితం చేయాలి.
  • చాలా ఏళ్లనుండి వికీలో పనిచేస్తున్నా, మూసలు వాడడంపై అవగాహన తక్కువగా వుంది. వికీపీడియా శిక్షణ కార్యక్రమాలు జరిపేవారు దీనిని గమనించి చర్యలు చేపట్టితే బాగుంటుంది.
  • సముచిత వినియోగ ఎక్కింపులు చాలా ఉదారంగా జరుగుతున్నాయి. ఆంగ్లవికీలో లాగా, వ్యాసంలో గల విస్తృత విషయాన్ని అర్ధం చేసుకోటానికి సహాయపడితేనే సముచిత వినియోగ బొమ్మ WP:FUW వాడి ఎక్కించాలి. ఆంగ్లవికీలో లాగా జీవించివున్న వ్యక్తులకు సముచితవినియోగ ఫైళ్లను చేర్చటాన్ని నియంత్రించాలి.
  • ఫైళ్ల లైసెన్స్ వర్గాలపేర్లు కొంత తెలుగులో వున్నాయి. ఫైళ్ల నిర్వహణకు ఆంగ్లవికీలోని వర్గాల పేర్లు తెవికీలో కొనసాగించితే, ఆంగ్లవికీలో మార్పులను తెలుగువికీలో తాజాచేయటం, నిర్వహణ ఆంగ్లవికీని మాదిరిగా తెలుగులో చేయటం సులభమవుతుంది. సంబంధింత స్క్రిప్ట్లు, కోడ్లుకూడా పెద్దమార్పులేకుండా వాడుకునే వీలుంటుంది. కావున వర్గాలపేర్లు అవసరమైన చోట్ల ఆంగ్లపేరులకు మార్చడం జరిగింది. అలాగే లైసెన్స్ సంబంధిత మూసల పేర్లు కూడా ఆంగ్లవికీవి వాడడం ప్రోత్సహించాలి. తెలుగు పేర్లమూసల వాడుకని ఆంగ్లవికీపేర్లకి మార్చి తొలగించడం మంచిది.

ఇవీ చూడండి

మార్చు