వికీపీడియా:మొబైల్ పరికరాలపై దిద్దుబాటు చెయ్యడం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ గతంలో చేసే పనులే కొత్త విధానాల్లో చెయ్యడం మొదలైంది. కంప్యూటరు స్థానే స్మార్ట్‌ఫోన్‌ను వాడడం వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో మొబైలుపై వికీపీడియాను చూడడం బాగా పెరిగిపోయింది. 2017 జనవరిలో డెస్క్‌టాప్, మొబైల్ వాడుక కచ్చితంగా చెరిసగం ఉండేవి. అది 2021 జనవరి నాటికి మొబైలు 90% గాను, డెస్క్‌టాపు 10% గానూ మారిపోయింది. కొత్తగా వికీలో చేరే వాడుకరుల్లో ఎక్కువమంది మొబైలుపైననే దిద్దుబాటు చేసేందుకు సుముఖంగా ఉండే వాడుకరుల సౌకర్యార్థం ఈ పేజీని సృష్టించాం.
స్మార్ట్‌ఫోన్లో వికీపీడియాను మొబైలు సైటు గానే కాకుండా, డెస్క్‌టాపు సైటును కూడా చూడవచ్చు. స్మార్ట్‌ఫోనులో వికీపీడియాను రెండు విధాలుగా చూడవచ్చు: మొబైల్ సైటు ఒకటి కాగా, వికీపీడియా యాప్ ద్వారా చూడడం రెండో విధానం. ఈ పేజీ లోని సమాచారం డిఫాల్టుగా మొబైలు సైటు గురించి మాత్రమే వివరిస్తుంది. యాప్ గురించి మాట్లాడే సందర్భంలో ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది.
- వికీపీడియా యొక్క మొబైల్ వెర్షన్: మొబైల్ పరికరాల్లో ఎడిటింగ్
- వికీపీడియా యొక్క డెస్క్‌టాప్ వెర్షన్: మొబైల్ పరికరాల్లో ఎడిటింగ్
వికీపీడియా యొక్క మొబైల్ వెర్షన్: మొబైల్ పరికరాల్లో ఎడిటింగ్
మార్చుమొబైల్లో అనుకూలత పరిమితం. మొబైల్ వీక్షణలోని వికీపీడియా వర్గాలను లేదా చాలా టెంప్లేట్‌లను చూపదు. మొబైల్ సైట్‌లోని విజువల్ ఎడిటర్ ఐప్యాడ్ యొక్క డిఫాల్ట్ బ్రౌజర్‌తో పనిచేయదు. విండోస్ RT ఫోన్లు మరియు టాబ్లెట్లలో చూసినప్పుడు చాలా వికీపీడియా వీడియోలు కదలవు.
కొత్త వ్యాసాన్ని మొబైల్ లో రాయడం
మార్చు- search bar లో రాయాలి అనుకున్న పేరును టైప్ చేయండి.
- మీరు టైప్ చేసిన పేరుతో వ్యాసం ఉన్నట్లైతే మీకు నీలం రంగులో ఆ పేరుతో ఉన్న వ్యాసాల పేర్లు కనిపిస్తాయి .
- ఒకవేళ మీరు టైప్ చేసిన పేరుతో వ్యాసం లేనట్లయితే ఎరుపు రంగులో కనిపిస్తుంది . అలా ఎరుపు రంగులో కనిపించిన దాని పై కిక్ చేస్తే కొత్త పేజీ క్రియేట్ అవుతుంది .
- అలా కొత్త పేజీ క్రియేట్ అయినట్లయితే ఇక మీరు వ్యాసాన్ని రాయడం మొదలు పెట్టొచ్చు అని అర్థం.
- ముందుగా మీరు రాయదల్చుకున్న వ్యాసాన్ని మీ మొబైల్ లో నోట్స్ అనే appలో సులభంగా Gboard లో ఉన్న లిప్యంతీకరణ సహాయంతో కానీ , వాయిస్ టైపింగ్ టూల్ సహాయంతో కానీ రాసి , ఆ తరువాత ఆ వ్యాసాన్ని copy చేసుకుని మీరు కొత్త వ్యాసం పేరుతో క్రియేట్ చేసిన పేజీలో paste చేసి ప్రచురించవచ్చు .
- మీరు రాసిన వ్యాసానికి తప్పనిసరిగా మూలాలు ఇవ్వాలి .
ఇక్కడ ఒక్కోసారి వికీలో లేని వ్యాసం ఎరుపు రంగులో కనపడక పోవచ్చు అప్పుడు పేజీ కింద ఉన్న మొబైల్ వీక్షణ నుండి డెస్కుటాప్ కు మారాలి ఆప్పుడు వ్యాసం సృష్టించటానికి ఎరుపు రంగులో లింక్ కనిపిస్తుంది.