వికీపీడియా:వ్యక్తుల పేర్లు

గమనిక:వ్యాసం అభివృద్ధిలో ఉన్నది. 

వికీపీడియా:శైలిలో ఇదివరకు వ్రాసి ఉన్న భాగం


వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.

  • బాగా ఎక్కువగా వాడుకలోనున్న పేరును వాడాలి. ఉదాహరణకు విజయవాడను బెజవాడ అని కూడా అంటారు. కానీ, విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది కనుక అదే వాడాలి.
  • ఒక్కోసారి రెండు పేర్లు కూడా బాగా వ్యాప్తిలో ఉండవచ్చు; ఆ సందర్భాల్లో ఏది వాడాలనే విషయమై సందిగ్ధత రావచ్చు. ఉదాహరణకు, నందమూరి తారక రామారావు విషయంలో, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే రెండు పేర్లూ ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అప్పుడు ఒక పేరుతో పేజీ సృష్టించి, దానిని లక్ష్యంగా చేసుకుని రెండవ పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించాలి.
  • పేర్ల చివర ఉండే సాంప్రదాయక/కుల సూచికలు: పేర్లకు చివర ఉండే రావు, రెడ్డి, శాస్త్రి, మాదిగ, నాయుడు, చౌదరి పేర్లను వ్యక్తి పేరుతో కలిపి రాయాలా లేక విడిగా రాయాలా అనే విషయమై కింది విధానం పాటించాలి.
    • వ్యక్తి పేరు, కులసూచికను కలిపి రాయాలి, ఉదాహరణకు: రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి.
    • ఇంటి పేర్లను ఎల్లప్పుడూ విడిగానే రాయాలి.

గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.

  • పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)



ఈ విధానాన్ని పునఃపరిశీలించడానికి వీలుకోసం క్రింది భాగం వ్రాయబడుతున్నది. ఇది ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే!


వ్యక్తుల పేర్ల గురించి గమనించవలసిన విషయాలు:


వ్యాసం పేరు, వ్యాసంలో వాడే పేరు

మార్చు

పూర్తి పేరు, వాడుకలో ఉన్న పేరు

మార్చు

ఇంటి పేరు

మార్చు

కుల, వర్గ సూచికలు

మార్చు

గౌరవ, విద్యా సూచికలు

మార్చు

పొడి అక్షరాలు

మార్చు

సందేహం వస్తే

మార్చు

అభిప్రాయ భేదాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు