వికీపీడియా:శిక్షణ శిబిరం/ప్రభుత్వ తెలుగు అధ్యాపకులకు తెవికీ శిక్షణ/ఉభయగోదావరి జిల్లాలు

కార్యక్రమ నేపథ్యం మార్చు

ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ రెండవ సెమిస్టర్ తెలుగు పాఠ్యపుస్తకంలో ఐదవ పాఠమైన "తెలుగు - సాంకేతిక"లో తెలుగు వికీపీడియా గురించి ముఖ్యమైన భాగం ఉంది. దీనితో పాటు యూనీకోడ్, తెలుగు బ్లాగులు వంటివీ ఉన్నాయి. తెలుగు అధ్యాపకులకు తెలుగు వికీపీడియా గురించి ప్రధానంగా నేర్పిస్తే వారు పిల్లలకు మెరుగ్గా బోధించగలరనీ, ఆసక్తి ఉన్నవారు తెలుగు వికీపీడియాలో రాయగలరని, తద్వారా తెవికీలో భాష గురించి అవగాహన కలిగిన సభ్యులు పెరుగుతారని ఆశిస్తూ సీఐఎస్-ఎ2కె కార్యక్రమం రూపొందించింది. ఈ కార్యక్రమంలో మొదట, ప్రయోగాత్మకంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల తెలుగు అధ్యాపకుల కోసం సీఐఎస్-ఎ2కె, డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం వద్ద పెంటపాడులోని కళాశాలలో నిర్వహించారు.

వివరాలు మార్చు

  • నిర్వాహకులు: సీఐఎస్-ఎ2కె, డిఆర్జీ డిగ్రీ కళాశాల.
    • ఈ రెండు సంస్థల తరఫున సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ పవన్ సంతోష్‌, డిఆర్జి కళాశాల తెలుగు అధ్యాపకులు సుంకర గోపాలయ్య, రామచంద్రుడు, ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వరరావు కార్యక్రమ నిర్వహణలో కృషిచేశారు.
    • కార్యక్రమ రూపకల్పన, రీసోర్స్ పర్సన్: పవన్ సంతోష్‌; పరిశీలకులు: తెలుగు వికీమీడియన్ నోముల ప్రభాకర్ గౌడ్

పాల్గొన్నవారు మార్చు

  • డిఆర్జి కళాశాల తెలుగు అధ్యాపకులు సుంకర గోపాలయ్య, రామచంద్రుడు, ప్రిన్సిపాల్ ఎన్.వెంకటేశ్వరరావు కార్యక్రమ నిర్వహణలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి రెండు జిల్లాల తెలుగు పండితులను రప్పించడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తెలుగు వికీపీడియా మీద వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము అని ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అటువంటి పాఠశాలల హెడ్మాస్టర్ లను వారి ద్వారా అక్కడి తెలుగు పండితులను ఈ వర్క్ షాప్ కు రావడానికి ఎండలు మండిపోతావున్న తప్పకుండా వర్క్ షాప్ లో వికీపీడియా గురించి వారికి ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మీరు తప్పకుండా వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది అని తెర వెనక చాలా తతగం జరిగే చాలామంది రావడానికి కారణం దీనికి సుంకర గోపాలయ్య వారి సహచరులు చాలా బాగా కృషిచేశారు.
  • కార్యక్రమ రూపకల్పన, రీసోర్స్ పర్సన్: పవన్ సంతోష్‌ గారు రెండు రోజులు కూడా వన్ మెన్ ఆర్మీ లాగా కార్యక్రమం మొత్తం మీద వేసుకొని విజయవంతం చేశారు.

నివేదిక మార్చు

కార్యక్రమ సరళి మార్చు

తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ 50 అడుగుల దూరం లోనే అతిథులకు ఏర్పాట్లు ఉన్న హోటల్ గదులు తీసుకోవడం కార్యక్రమ రూపకల్పన, రీసోర్స్ పర్సన్: పవన్ సంతోష్‌ గారు రెండు రోజులు కూడా సుంకర గోపాలయ్య గారితో కలిసి ప్రతి వ్యక్తి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని అడుగడుగునా ప్రయాణ వివరాలను గమ్యస్థానం చేరగానే బస చేయవలసిన ప్రదేశాలకు దారి తెన్నులు సలహాలను సూచనలను ఇస్తూ సురక్షితంగా చేరడానికి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షణ చేశారు. ముందుగా గమ్యస్థానం చేరిన వారిని తర్వాత గమ్యస్థానాలకు వస్తున్న వారిని సహాయంగా భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. వేసవి కాలంలో జరిగే వర్క్ షాప్ కాబట్టి ఉక్కపోత సమస్య లేకుండా హోటల్ గదులందు ఏ సి ఉన్న గదులను అతిధులకు కేటాయించి ఇద్దరికీ ఒక గది చొప్పున కేటాయింపు విషయంలో సౌకర్యం కూడా చాలా బాగా చేశారు. పక్కనే భోజన సౌకర్యం ఉన్న ప్రదేశం, పట్టణంలో మధ్య ప్రదేశం ఏ విధమైన షాపింగ్ చేసుకోవాలి అన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశం. ఇది అంతా ఒక ఎత్తు అయితే రెండో పాయింటు వర్క్ షాప్ జరిగే కార్యక్రమం తాడేపల్లిగూడెం నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పెంటపాడు డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాట్లు వచ్చిన ప్రతివారికి రెండు రోజులు ప్రతి గంటకు చాయ్ బిస్కెట్లు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు శంకర గోపాలయ్య గారు, రామచంద్రుడు గారు తీసుకున్న శ్రద్ధ వేసవి ఇబ్బంది లేకుండా క్లాస్ రూమ్ కూడా ఏసీ సౌకర్యం ఉన్న హాలు వేసవి ఎండ తీవ్రత ఆ రెండు రోజులు చాలా ఎక్కువగా ఉంది, అయినా సరే ఆ రెండు రోజులు కరెంటు కోత పెంటపాడు రూరల్ ప్రాంతం కావడంతో రోజుకు రెండు గంటలకు చొప్పున పోయిన కూడా జనరేటర్ సౌకర్యం పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇవి సౌకర్యాల గురించి ...

వర్క్ షాప్ జరిగిన తీరు... అందులో పాల్గొన్న ఉపాధ్యాయులు ఉభయగోదావరి జిల్లాల వారు కావడంతో అక్కడ కూడా వ్యంగ్యం , హాస్యం కలగలిపి ప్రతి మాటకు గారు మర్యాద పదాన్ని వీడకుండా కార్యక్రమంలో రెండు రోజులు చాలా సరదాగా గడిచి పోయినట్లు తెలియకుండానే సమయం ముగిసింది. మొదటిరోజు పరిచయాలతో ప్రారంభమైంది, పవన్ సంతోష్ గారు వికీపీడియా అంటే ఏమిటి తెలుగు వికీపీడియా ప్రయాణం, విశాఖపట్నంలో 20 వసంతాల పండుగ గురించి చెప్పి అనంతరం వర్క్ షాప్ లో పాల్గొన్న వారి అందరితోనూ తెలుగు వికీపీడియాలో నమోదు కార్యక్రమం రిజిస్ట్రేషన్ ప్రారంభించి పూర్తి చేశారు. అనంతరం భోజన సమయం ... చక్కనైన వంటకాలతో స్వీట్స్, పాలు రకాల కూరలు పచ్చళ్లతో కడుపునిండా భోజనం కార్యక్రమం పూర్తిచేసుకుని మళ్లీ వర్క్ షాప్ లో పవన్ సంతోష్ గారు వికీపీడియాలో కవుల కళాకారుల వ్యాసాల గురించి వ్యాసాలు రాసే సరళి గురించి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, తెలుగు పండితులు, తెలుగు లెక్చలర్లు, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తెలుగు మీద గంటలకు చిన్నపిల్లల మాదిరి కూర్చొని శ్రద్ధగా వింటుంటే వారికి ఉన్న తెలుగు మీద అభిమానం చాలా ఆశ్చర్యం కలిగించింది. అలా మొదటి రోజు కార్యక్రమం పూర్తి అయింది.

రెండవ రోజు వర్క్ షాప్ కూడా ఉల్లాసంగానే గడిచింది, రెండవ రోజు మరికొంతమంది ఉపాధ్యాయులు కొత్తగా వచ్చారు. వారికి కొత్తగా ఖాతా సృష్టించి వికీపీడియాలో వ్యాసాలను ఎలా వెతకాలి, ఎలాంటి వ్యాసాలు రాయాలి. ఒక వ్యాసానికి ఉండవలసిన హంగులు ఏమిటి, వికీపీడియాలో మంచి వ్యాసం అంటే ఏమిటి ఇలాంటి అంశాల మీద సదస్సులో పాల్గొన్న వారి అనుమానాలు తీరుస్తూ ప్రతి అంశం మీద సుదీర్ఘంగా సాగిన కార్యక్రమం మధ్యాహ్నం భోజనం వరకు పూర్తి అయింది. గోదావరి వంటకాలు రెండో రోజు కూడా అలరించాయి, బిర్యానీతోపాటు మొదటి రోజు వంటకాల మాదిరి కంటే అద్భుతంగానే భోజనం కార్యక్రమం ముగిసింది. అనంతరం వర్క్ షాప్ లో పవన్ సంతోష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాలలో వికీపీడియా గురించి, కంప్యూటర్ యూనిక్ కోడ్ గురించి సవివరంగా చెప్పారు. తెలుగు వికీపీడియాకు ఎవరు ఏ విధమైన సేవ చేయాలి అనుకుంటున్నారు అనే అంశం మీద పది మందికి ఒక టేబుల్ మాదిరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఒక టేబుల్ కు పవన్ సంతోష్ గారు, మరో టేబుల్ కు సుంకర గోపాలయ్య గారు, మరో టేబుల్ కు రామచంద్రుడు గారు అదేవిధంగా నేను కూడా ఒక టేబుల్ ప్రాతినిధ్యం వహించాం. అందులో ఈ రెండు రోజుల కార్యక్రమంలో కవులు కళాకారుల గురించి మీకు నచ్చిన కవి గురించి మీరైతే మీ శైలిలో వ్యాసం ఎలా ఉండాలి అనే అంశం మీద చర్చ పేజీలో వికీపీడియాలో ఉండే ప్రతి వ్యాసానికి ఉండే చర్చ పేజీలోనే వ్యాసంలో ఉన్న లోటుపాట్లను రాయమని చెప్పాము చాలామంది కొన్ని వ్యాసాల మీద వారి యొక్క అభిప్రాయాలను చర్చ పేజీలో రాశారు. దానిపైన కూడా కొంత చర్చ జరిగింది. ఈలోగా చదువరి గారు ఆ చర్చ పేజీలలో కొందరు రాసిన అభిప్రాయాలకు జవాబు వెంటనే ఇవ్వడంతో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అప్పటికి సమయం సాయంత్రం నాలుగున్నర గంటలు పవన్ సంతోష్ గారు వికీపీడియాలో ఇంకా చదువరి గారితో పాటు ఇంకా ఎవరెవరు ఏ ఏ రకమైన వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. అధికారులు ఎవరూ అడ్మిన్స్ ఎవరు అనే అంశం మీద నన్ను మాట్లాడమని చెప్పారు, అధికారులు అర్జున్ రావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రవిచంద్ర గారి గురించి చెప్పాను. అడ్మిన్స్ యేర్ర రామారావు గారి గురించి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రతి గ్రామంలో వారి కృషి గురించి, ప్రణయ్ రాజ్ గారి రోజుకో వ్యాసం గురించి, బత్తిని వినయ్ కుమార్ గారి రోజుకు పది వ్యాసాల గురించి, పాల్లగిరి రామకృష్ణారెడ్డి గారి నూనెల మీద పరిశోధన గురించి, శ్రీకాకుళం వాస్తవ్యులు వెంకటరమణ గారి సైన్స్ వ్యాసాల గురించి, త్రిపుల్ ఐటీలో పలివేల కశ్యప్ గారి వేలాది మందికి క్లాసులు చెప్పిన విధానం గురించి మరికొందరి గురించి కూడా చెప్పాను. వికీపీడియా గురించి టెక్నికల్ గా మొదటి పేజీ గురించి ఇటీవల మార్పుల గురించి కూడా కొన్ని విషయాలను వివరించాను. ఇక ఒక్కొక్కరికి వర్క్ షాప్ మీద అనుభూతిని వివరించమని పవన్ సంతోష్ గారు మాట్లాడవలసిందిగా కోరగా ఆసక్తి కలవారు చాలామంది వారి అభిప్రాయాలు ఏపీలో పాఠ్యాంశం ఉండడంతో వికీపీడియా గురించి, యూనిక్ కోడ్ గురించి చాలా విషయాలు ఈ వర్క్ షాప్ సందర్శించినందువలన తెలుసుకున్నామని మాట్లాడిన ప్రతివారు సంతోషం వ్యక్తం చేశారు. వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేయడం చేయడం జరిగింది. అనంతరం పవన్ సంతోష్ గారిని శాలువతో సన్మానం చేశారు, నన్ను కూడా సన్మానించారు. గ్రూప్ ఫోటోలు దిగడం, ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఆప్యాయంగా వీడ్కోలు పలకడం తో రెండు రోజుల వర్క్ షాప్ ముగిసింది.

పరిశీలన మార్చు

కార్యక్రమానికి రెండు రోజులు ప్రత్యక్షంగా హాజరైన తెలుగు వికీమీడియన్ నోముల ప్రభాకర్ గౌడ్ పరిశీలన ఇది:

సర్టిఫికెట్ కోర్స్ మార్చు

వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కొంతమంది హాజరు కాని వారికి ఈ రెండు రోజుల వర్క్ షాప్ కు హాజరైన వారికి కూడా కలిపి ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సు ఆదివారాలు మధ్యాహ్నం సమయంలో కొన్ని రోజులు వికీపీడియా టెక్నికల్ నాలెడ్జ్ ముఖ్యమైన అంశలు వివరించడానికి క్లాసులు చెప్పవలసిన అవసరం ఉంది అని గుర్తించారు. ఈ వేసవి సెలవుల్లో ఈ కోర్స్ పూర్తి అవుతుంది.