వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు
వికీపీడియా శైలికి సంబంధించి ఎన్నో మార్గదర్శకాలు, విధానాల పరమైన నిర్ణయాలు పలు చర్చల్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ నిర్వాహకుల సౌకర్యార్థం ఒకచోట చేర్చడానికి ఈ పేజీ ఉద్దేశింపబడింది.
సామాన్య శకం
మార్చుసా.శ., సా.శ.పూ. అన్నవి సామాన్యశకం, సామాన్య శకపూర్వం అన్న పదాలకు పొడి అక్షరాలుగా వాడడం అలవాటు చేసుకోవాలి
- క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం పదాల పొడి అక్షరాలైన క్రీ.పూ., క్రీ.శ.ల వాడకం తెలుగు వికీపీడియాలో అలవాటుగా ఉండేది. ఈ పొడి పదాల వాడకం తగ్గించి, క్రీ.పూ. బదులుగా సా.శ.పూ, క్రీ.శ. బదులుగా, సా.శ. అన్న వాటి అలవాటు పెంచాలి. ఐతే క్రీ.పూ., క్రీ.శ. అని రాయడం పూర్తిగా శైలికి విరుద్ధం కాదు. వ్యాసంలో సామాన్య శకంతో క్రీస్తు శకం మార్చడం మొదలుపెడితే మొత్తం వ్యాసం అంతా మార్చగలరు.
- ఆంగ్ల పొడి అక్షరాలైన బీ.సీ., ఎ.డి. కానీ, సీ.ఈ., బీ.సీ.ఈ., కానీ నేరుగా ఆంగ్ల లిపిలో కానీ, తెలుగు అక్షరాల్లో వాడడం కానీ శైలి విరుద్ధం.