వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక
తెలుగులో సర్వ సాధారణంగా కనిపించే పదదోషాలను గుర్తించి, వాటికి సరైన పదాలను సూచించడం ఈ వ్యాస లక్ష్యం. వ్యాకరణ రూపాలలోని దోషాలు దీని పరిధిలోకి రావు. కేవలం పద స్వరూపంలో సాధారణంగా కనిపించే తప్పులకి మాత్రమే ఇది పరిమితం. ఇందులో పదాలని చేర్చే ముందు నిఘంటువులో[1] సరిచూడ్డం మంచిది.
ఈ దిగువన ఉన్న జాబితాలోని అచ్చుతప్పులను బాటు ద్వారా యాంత్రికంగా వికీపీడియా మొత్తం దిద్దించబడుతుంది. కాబట్టి ఈ దిగువ పట్టికలో ఉన్న విధంగానే మీరు చేర్చాలనుకున్న అచ్చుతప్పులు చేర్చండి. కొత్త అచ్చుతప్పులను చేర్చటానికి అనుసరించవలసిన పద్ధతి ఈ దిగువన గమనించండి.
# తప్పు - ఒప్పు
తప్పొప్పుల పట్టిక
మార్చుతప్పు/శైలికి విరుద్ధం | ఒప్పు/శైలికి అనుగుణం |
---|---|
ఆశక్తి, ఆశక్తులు | ఆసక్తి, ఆసక్తులు |
భాద్యత | బాధ్యత |
చేధించు | ఛేదించు |
కధ | కథ |
శాఖాహారము | శాకాహారము |
భాష్పము | బాష్పము |
ఆస్థి | ఆస్తి |
భాందవ్యము | బాంధవ్యము |
అస్థిత్వము | అస్తిత్వము |
అర్జనుడు | అర్జునుడు |
ధనుంజయుడు | ధనంజయుడు |
మహత్యము | మాహాత్మ్యము |
రాయభారము | రాయబారము |
భాద | బాధ |
ధృఢము | దృఢము |
అబద్దం | అబద్ధం |
భాద్యత | బాధ్యత |
బేధం | భేదం |
రుషి | ఋషి |
వశిష్టుడు | వశిష్ఠుడు |
విబాగము | విభాగము |
దశరధుడు | దశరథుడు |
భందము, భంధము, బందము | బంధం |
అనుభందము, అనుభంధము, అనుబందము | అనుబంధం |
శాఖాహారం | శాకాహారం |
సమైఖ్య | సమైక్య |
స్మశానము, స్మశానం | శ్మశానం |
"కారణములను" (శైలి) | కారణాలను |
డబుల్ స్పేసు | సింగిల్ స్పేసు |
వ్యాకరణ చిహ్నాల ముందు ఖాళీ పెట్టడం, చిహ్నం తరువాత పెట్టకపోవడం (శైలి) | చిహ్నానికి ముందు ఖాళీ ఉండకూడదు, తరువాత ఉండాలి |