వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వైద్య శాస్త్రము

పెద్ద గారి సలహా

మార్చు

ఈ ప్రాజెక్టు ముఖ్యంగా తెలుగు వికీపీడియాలొ వైద్యానికి,జబ్బులకు, సంబంధించిన వ్యాసాలు గుర్తించి వాటిని తెలుగు వారికి అందచేయడం లక్ష్యం. ప్రతీ జాతికి ప్రాంతీయముగా కొన్ని వైద్యవిధానాలు ఉంటాయి. వాటి శాస్త్రీయతను ఏమాత్రము పరిశీలించకుండా కొట్టిపారేస్తుంది అల్లోపతి వైద్యం . అందులో ఒకటి బాలింత పత్యం . అల్లోపతివైద్యులు పత్యాలు అశాస్త్రీయమంటారు. పురుడు వచ్చిన తరువాత యాంటీబయటిక్ మందులు వాడినంత వరకు ఏమి తిన్నా అరిగి పోతుంది. ఆ మందులు ఆపేసిన తరువాత పత్యానికి అపత్యానికి తేడా తెలుస్తుంది. తెలుగు వారు సాంప్రదాయంగా బాలింతలకు(పాలిచ్చే తల్లులకు) చెప్పే ఆహారపద్దతులు పాటించక పోతే చంటిబిడ్డకు అజీర్తి చేస్తుంది. అపుడు చంటి బిడ్డను పిల్లల డాక్టరు చూసి ఏవో మందులిస్తాడు , కాని తల్లి తినే ఆహారం గురించి పట్టించుకోడు. --Pedda (చర్చ) 17:40, 13 ఏప్రిల్ 2013 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/వైద్య శాస్త్రము".