వికీబుక్స్ స్వేచ్ఛానకలుహక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి. ఇది 2004 ఆగస్టు 13న ప్రారంభమైంది. వికీ ప్రాజెక్టులన్నిటిలోఅతితక్కువ వ్యాసపేజీలు ఉన్నాయి. దీనిలో ఉబుంటు వాడుకరి మార్గదర్శిని పూర్తికాబడిన పుస్తకం. దీనిలో ఉబుంటుతో తెలుగులో టైపు చేయడం దగ్గరనుండి, ఉత్తరములు వ్రాయుట, ప్రదర్శన పత్రములు చేయుట, వివిధ రకాల ధ్వని, దృశ్య శ్రవణ మాధ్యమములను నడుపుట, వాడబడే విహరిణులు లాంటివన్నీ ఎలా చేయవచ్చో వివరించటమైనది. ఇంకా వంట పుస్తకం ప్రారంభించబడింది. వికీసోర్స్ లో ఉండవలసిన కొన్ని వ్యాసాలు పొరపాటున వికీబుక్స్ లో సృష్టించబడినవి. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పాఠ్యపుస్తకాలు సమష్టిగా వృద్ధిచేయటం. ఏప్రిల్ 2010 అలెక్సా లెక్కల ప్రకారం ప్రపంచంలోని జాలస్థలులన్నిటిలో 2,462వ స్థానములోఉన్నది.

తెలుగు వికీబుక్స్ మొదటి పేజీ