విక్రమాదిత్యుడు

విక్రమాదిత్యుడు ప్రాచీన భారతీయ సాహిత్యంలో పేర్కొనబడిన ఒక చక్రవర్తి.[1][2][3] బేతాళ పంచవింశతి, భట్టి సింహాసనం మొదలైన సాంప్రదాయక కథలలో ఈయనను గురించి కథలు ఉంటాయి. చాలా మంది ఈయనను ఉజ్జయిని రాజధాని పాలకుడిగా అభివర్ణించారు (కొన్ని కథల్లో పాటలీపుత్ర లేదా ప్రతిష్ఠానం). "విక్రమాదిత్య" అనేది పురాతన, మధ్యయుగ భారతదేశంలోని అనేక మంది చక్రవర్తులచే స్వీకరించబడిన ఒక సాధారణ బిరుదు. విక్రమాదిత్య ఇతిహాసాలు వివిధ రాజుల (ముఖ్యంగా రెండవ చంద్రగుప్తుడు) వృత్తాంతాలను గురించి అయిఉండవచ్చు. జనాదరణ పొందిన సంప్రదాయం ప్రకారం, విక్రమాదిత్య శకులను ఓడించిన తర్వాత సా.శ.పూ 57 లో విక్రమ నామ శకాన్ని ప్రారంభించాడు. అతను ఒక చారిత్రక వ్యక్తి అని నమ్మే వారు అతనిని సా.శ.పూ మొదటి శతాబ్దం వాడని భావించారు. అయితే, ఈ శకం సా.శ తొమ్మిదవ శతాబ్దం తర్వాతనే "విక్రమ సంవత్సరం"గా గుర్తించబడింది.

మూలాలు

మార్చు
  1. Gopal, Ram (1984). Kālidāsa: His Art and Culture (in ఇంగ్లీష్). Concept Publishing Company. p. 15. Retrieved 2 June 2022.
  2. Reddy, Sheshalatha (15 October 2013). Mapping the Nation: An Anthology of Indian Poetry in English, 18701920 (in ఇంగ్లీష్). Anthem Press. p. 201. ISBN 978-1-78308-075-5. Retrieved 2 June 2022.
  3. Agrawal, Ashvini (1989). Rise and Fall of the Imperial Guptas (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publ. p. 174. ISBN 978-81-208-0592-7. Retrieved 2 June 2022. The assumption of the title Vikramaditya37 by Chandragupta II, has been responsible for confusing his name with the legendary founder of the Vikrama samvat of B.C. 58 in spite of the fact that ever since the discovery, in 1884, of the Mandasor stone inscription of the Guild of silk-weavers bearing dates 493 and 529 it has been established that the era which commenced in 57 B.C. was founded by the Malavas and dates from the time of the foundation of the Malava republic. The identification of the legendary king Vikramaditya of Ujjaini has been discussed at length by various scholars for a long time.