విజయలక్ష్మీ రవీంద్రనాథ్

విజయలక్ష్మీ రవీంద్రనాథ్ తండ్రి ఆమెకు విద్యలో ఉన్నతస్థితికి చేరడానికి అవసరమైన ప్రేరణ కలిగించాడు. అలాగే కఠినంగా శ్రమించడం, అత్యున్నత స్థితి కొరకు ప్రయత్నించడం, విశ్వనీయత విలువల గురించి ఆమెకు తెలియజేసాడు. ఆయనకు మహిళలు విద్యావంతులు కావాలన్న భావం బలంగా ఉండేది. ఆయన సంపదకంటే విద్య గొప్పదని భావించాడు.కుటుంబ సభ్యులు పెద్దలు ఆమెకు వివాహం చెయ్యమని వత్తిడి చేసిన తరుణంలో ఆమె తండ్రి ఆమెను ఉన్నత చదులు చదవమని ప్రోత్సహించాడు. ఆమె తల్లితండ్రులిద్దరూ ఆమె కెమెస్ట్రీ మాస్టర్ డిగ్రీ పొందేవరకు సహకరించారు.

విజయలక్ష్మీ రవీంద్రనాథ్
జననం1952
మరణంమే 15, 1985
వృత్తిమహిళా శాస్త్రవేత్త
జీవిత భాగస్వామిభర్త పేరు రవీంద్రనాథ్

రీసెర్చ్

మార్చు
 
విజయలక్ష్మీ రవీంద్రనాథ్

విజయలక్ష్మీ రవీంద్రనాథ్ చిన్న వయసులోనే స్కూలులో గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేది. అలాగే ప్రయోగాలను సవాలుగా చేసే సమయంలో జయాపజయాల కారణంగా ఒక్కోసారి ఆనదం మరొక్క సారి నిరాశకు గురైయ్యేది. తరువాతి కాలంలో ఆమె టీచరైన తరువాత తన విద్యార్థుల ఉన్నతి కోరుకుంటూ వారు శాస్త్రవేత్తలు కావాలని కోరుకుంటూ ఆనందపడేది. సైన్సు మీద ఆమెకున్న ఆసక్తి కారణంగా ఆమె " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంసెస్ "లో రీసెర్చ్ చేయడానికి చేరింది. అక్కడ ఆమె తన కాబోయే భర్త అయిన డాక్టర్ బి. రవీంద్రనాథ్‌ను కలుసుకున్నది. ఆయన కూడా శాస్త్రవేత్తే. ఆమె 1982లో (మద్రాసు) రిసెర్చ్ పూర్తిచేసింది. ఆయన విజయలక్ష్మీకి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా జీవితమంతా సహకరించాడు. ఆమె భర్త ఆమెకు నచ్చిన విషయాన్ని రాజీ పడకుండా చేయాలని చెప్పాడు. ఆమె భర్త సలహా ఇచ్చిన బలంతో వృత్తిరీత్యా అభివృద్ధి సాధించింది.విజయలక్ష్మీ రవీంద్రనాథ్ వ్రాసిన 11 థిసీస్ పేపర్లు అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురించాయి.

శ్రేయోభిలాషులు

మార్చు

విజయలక్ష్మీ రవీంద్రనాథ్ అభివృద్ధికి ఆమెకు ఆదర్శంగా నిలిచిన ఆమె పి.హెచ్.డి సూపర్‌వైజర్ డాక్టర్ రాఘవేంద్రరావు (మైసూరు సి.ఎఫ్.టి.ఆర్.ఐ), డాక్టర్ మైకేల్ బాయ్డ్ వంటి వారు అమెరికాలో ఎన్.ఐ.హెచ్ ఫెలోషిపి చేసేసమయంలో ఆమెకు మానసిక, భౌతికసాయం అందించారు. ఎన్.ఐ.ఎం.హెచ్.ఎ.ఎన్.ఎస్ లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆరంభకాల సైంటిఫిక్ కేరీర్ కొంత కఠినంగా సాగింది. అప్పుడామే రీసెర్చ్ సహాయనిధిని పొందడలో సమస్యలను ఎదుర్కొంటూ తనను తాను ఒంటరిగా భావిస్తున్న తరుణంలో డాక్టర్ బాయ్డ్ చాలా సహకరించాడు. ఆయన ఆమెకు గ్రాంటు రావడానికి సహకరించడమే కాక మానసిక శక్తి రావడానికి కూడా సహారించాడు. ఆయన విజయలక్ష్మీ రవీంద్రనాథ్ రీసెర్చ్‌కి సహకరించడమే కాక అంతర్జాతీయ సహచరులతో కలిసి పనిచేయడానికి అవసరమైన వేదిక ఏర్పడడానికి సహకరించాడు.

వృత్తిజీవితం

మార్చు

వృత్తిపరమైన ప్రయాణం సులభం కాదని ఆమె భావన. పూస్ట్ డాక్టోరేట్ చేసిన రెండు సంవత్సరాలు ఆమె తన కుటుంబానికి దూరం అయింది. తరువాత ఎన్.బి.బి.సి విస్తరణ సమయంలో కూడా ఢిల్లీ అరియు బెంగుళూరు మద్య దాదాపు పది సంవత్సరాలు తిరుగుతూ కుటుంబానికి కొంత దూరం అయింది. ఆ కాలం అంతా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషుల సహాయం ఆమెకు పూర్తిగా లభించింది. వివాహం అయిన ప్రారంభంలో మహిళా శాస్త్రవేత్తలకు తప్పక సహాయం అవసరం. కుటుంబం అభివృద్ధి చెందడం, పిల్లలను పెంపకం, ఆరంభదశలో శాస్త్రవేత్తగా నిలదొక్కుకునే సమయం ఒక్కటే కనుక అప్పుడు సహాయం తప్పనిసరి అన్నది ఆమె భావన. రెండు బాధ్యతల కారణంగా మహిళాశాస్త్రవేత్తలు తమ సహాధ్యాయులతో కలిసి పనిచేయడానికి తగినంత సమయం ఉండదు. అందువలన మహిళాశాస్త్రవేత్తలు సహకారపద్ధతిని అభివృద్ధిచేసుకోవడం అవసరమని ఆమె భావిస్తుంది. అలాగే ఆమె వృత్తి జీవితమంతా ఆమెకు మానసిక స్థైర్యాన్ని అందించిన

విజయలక్ష్మీ రవీంద్రనాథ్ తన 33వ సంవత్సరంలో కేన్సర్ వ్యాధితో మరణించింది.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.