విజయ్ శేఖర్ శర్మ

విజయ్ శేఖర్ శర్మ (జ. జూన్ 7, 1978) భారతీయ వ్యాపారవేత్త. ఇతను 1997 లో వన్97 కమ్యూనికేషన్స్ అనే పేరుతో ఒక సంస్థ ప్రారంభించాడు. దీని తరఫున 2010 లో పేటిఎం అనే డిజిటల్ చెల్లింపుల సంస్థను ప్రారంభించాడు.[1][2][3][4]

విజయ్ శేఖర్ శర్మ
2019 లో విజయ్ శేఖర్ శర్మ
జననం (1978-06-07) 1978 జూన్ 7 (వయసు 46)
ఆలీఘర్, ఉత్తరప్రదేశ్
విద్యాసంస్థఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (బిటెక్)
వృత్తివ్యాపారవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పేటిఎం వ్యవస్థాపక సియీవో
జీవిత భాగస్వామి
మృదుల పరాశర్
(m. 2005)
పిల్లలు1
పురస్కారాలుయశ్ భారతి

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

విజయ్ శేఖర్ శర్మ జూన్ 7, 1978 న ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జన్మించాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయుడు సులోమ్ ప్రకాష్, గృహిణి ఆశా శర్మ దంపతుల నలుగురు సంతానంలో మూడవవాడు.[5][6] అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న పట్టణం నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు.[7] అతను ఒక బాలమేధావి గా పేరు పొందాడు. 15 సంవత్సరాల వయస్సులో కళాశాల విద్య పూర్తి చేసి 19 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ) నుండి B.Tech డిగ్రీతో ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యాడు.[8][9][10]

మూలాలు

మార్చు
  1. "Vijay Shekhar Sharma reappointed as MD & CEO of Paytm till Dec 2027". Economic Times.
  2. Jog, Natasha (20 August 2015). "Began College at 15, Has Billion-Dollar Firm at 37". NDTV.com.
  3. "Vijay Shekhar Sharma". weforum.
  4. "Began College at 15, Has Billion-Dollar Firm at 37". NDTV.
  5. "Vijay Shekhar Sharma Biography: Birth, Age, Family, Education, Career, Net Worth, Awards and More". Jagranjosh.
  6. Tiwari, Mahesh. "Vijay Shekhar Sharma". newstrend.news. Newstrend. Retrieved 29 June 2021.
  7. "How PayTM's Vijay Shekhar Sharma chased his dream instead of a degree". Scroll.
  8. "Interesting facts of PayTM founder Vijay Shekhar Sharma". Businessinsider.
  9. "Began College at 15, Has Billion-Dollar Firm at 37". NDTV.com. Retrieved 2016-02-02.
  10. Sinha, Suveen (August 20, 2016). "How PayTM's Vijay Shekhar Sharma chased his dream instead of a degree". Scroll.in.