విఠల్‌రావు దేశపాండే
విఠల్‌రావు దేశపాండే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.
విఠల్‌రావు దేశపాండే | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1962 – 1967 | |||
నియోజకవర్గం | ఆదిలాబాద్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 ఫిబ్రవరి 1932 ఆదిలాబాద్, ఆదిలాబాదు జిల్లా , తెలంగాణ రాష్ట్రం , భారతదేశం | ||
మరణం | 28 జులై 2016 హైదరాబాద్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుమన్‌బాయి దేశ్‌పాండే | ||
సంతానం | డాక్టర్ దేవిదాస్ దేశ్‌పాండే, వినోద్‌కుమార్ దేశ్‌పాండే, విశ్వాస్ దేశ్‌పాండే, సతీష్ దేశ్‌పాండే |
జననం
మార్చువిఠల్రావు దేశపాండే 1932 ఫిబ్రవరి 1 తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఆదిలాబాద్‌లో జన్మించాడు.[1]
రాజకీయ జీవితం
మార్చువిఠల్రావు దేశపాండే 1957 నుంచి 1962 వరకు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1962లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ అభ్యర్థి కె.రామకృష్ణ పై గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
ఆయన 1968లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విఠల్‌రావు దేశపాండే 1968 నుంచి 1972 వరకు ఆంధ్రప్రదేశ్ షుగర్‌బోర్డు చైర్మన్‌గా, 1972 నుంచి 1978 వరకు డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి, 1978 నుంచి 1981 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు.
మరణం
మార్చువిఠల్రావు దేశపాండే అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 28 జూలై 2016న మరణించాడు. ఆయనకు నలుగురు కుమారులు రి డాక్టర్ దేవిదాస్ దేశ్‌పాండే, వినోద్‌కుమార్ దేశ్‌పాండే, విశ్వాస్ దేశ్‌పాండే, సతీష్ దేశ్‌పాండే ఉన్నారు.[2]
మూలాలు
మార్చు- ↑ Andhrabhoomi (28 July 2016). "మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావ్ దేశ్‌పాండే కన్నుమూత". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Sakshi (28 July 2016). "విఠల్‌రావు దేశ్‌పాండే ఇకలేరు." Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.