వితంతు వివాహం
వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి చెయ్యటము. కొంతమంది చిన్న వయసులోని బాలికలను కన్యాశుల్కం మీద ఆశతో వృద్ధులకిచ్చి వివాహం జరిపించే వారు. అందువల్ల ఆ బాలికలు తొందరగా వితంతువులు అయ్యేవారు. అప్పటి సాంఘిక పరిస్థితుల ప్రకారం వారు వివక్షను ఎదుర్కొనే వారు. వారికి పునర్వివాహం చేయడం ద్వారా వారి జీవన విధానాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
చరిత్ర
మార్చుబ్రహ్మ సమాజాన్ని స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాడిన రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీసహగమనానికి చట్టపరంగా అడ్డుకట్ట పడింది. అతని ఆశయాలు కొనసాగిస్తూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాల కోసం కృషి చేశాడు.[1]
ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు
మార్చుఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి సంఘసంస్కర్తలు వితంతు వివాహాల్ని ప్రోత్సహించారు.[2] వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమే అని తన పరిశోధనల ద్వారా కందుకూరి నిరూపించాడు.[3] మొదటి వితంతు వివాహాన్ని కందుకూరి తన స్వగృహంలో 1881, డిసెంబరు 11 వ తేదీన బాలవితంతువు గౌరమ్మ, గోగులమూడి శ్రీరాములకు మధ్య జరిపించినట్లు రికార్డులు ఉన్నాయి.[4]
మూలాలు
మార్చు- ↑ "ఈశ్వరచంద్ర విద్యాసాగర్". West Bengal Council of Higher Secondary Education. Archived from the original on 2020-10-29. Retrieved 12 Dec 2020.
- ↑ "కందుకూరి వీరేశలింగం: సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు చేసిన సంస్కర్త". BBC News తెలుగు. Retrieved 2020-12-11.
- ↑ "చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం". Sakshi. 2019-12-11. Retrieved 2020-12-11.
- ↑ "కందుకూరి ఉద్యమం ఎందరికో స్ఫూర్తి | Prajasakti". www.prajasakti.com. Retrieved 2020-12-11.