వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి చెయ్యటము. కొంతమంది చిన్న వయసులోని బాలికలను కన్యాశుల్కం మీద ఆశతో వృద్ధులకిచ్చి వివాహం జరిపించే వారు. అందువల్ల ఆ బాలికలు తొందరగా వితంతువులు అయ్యేవారు. అప్పటి సాంఘిక పరిస్థితుల ప్రకారం వారు వివక్షను ఎదుర్కొనే వారు. వారికి పునర్వివాహం చేయడం ద్వారా వారి జీవన విధానాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

వితంతు వివాహాల్ని ప్రోత్సహించిన కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రం

చరిత్ర మార్చు

బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాడిన రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీసహగమనానికి చట్టపరంగా అడ్డుకట్ట పడింది. అతని ఆశయాలు కొనసాగిస్తూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాల కోసం కృషి చేశాడు.[1]

ఆంధ్రదేశంలో వితంతు వివాహాలు మార్చు

ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి సంఘసంస్కర్తలు వితంతు వివాహాల్ని ప్రోత్సహించారు.[2] వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమే అని తన పరిశోధనల ద్వారా కందుకూరి నిరూపించాడు.[3] మొదటి వితంతు వివాహాన్ని కందుకూరి తన స్వగృహంలో 1881, డిసెంబరు 11 వ తేదీన బాలవితంతువు గౌరమ్మ, గోగులమూడి శ్రీరాములకు మధ్య జరిపించినట్లు రికార్డులు ఉన్నాయి.[4]

మూలాలు మార్చు

  1. "ఈశ్వరచంద్ర విద్యాసాగర్". West Bengal Council of Higher Secondary Education. Archived from the original on 12 Dec 2020. Retrieved 12 Dec 2020. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 అక్టోబరు 2020 suggested (help)
  2. "కందుకూరి వీరేశలింగం: సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు చేసిన సంస్కర్త". BBC News తెలుగు. Retrieved 2020-12-11.
  3. "చరిత్రను తిరగరాసిన తొలి వితంతు వివాహం". Sakshi. 2019-12-11. Retrieved 2020-12-11.
  4. "కందుకూరి ఉద్యమం ఎందరికో స్ఫూర్తి | Prajasakti". www.prajasakti.com. Retrieved 2020-12-11.