విదితా వైద్యా తల్లితండ్రులు డాక్టర్లు. ఆమె తండ్రి డాక్టర్ అశోక్ వైద్యా క్లినికల్ ఫార్మాసిస్ట్. ఆమె తల్లి రమా వైద్యా ప్రొడక్టివ్ ఎండోక్రినాలజిస్ట్. అమే తల్లితండ్రులు 70 సంవత్సరాల వయసులో కూడా వృత్తి మీద ఉన్న ఆరాధనతో అవిశ్రాంతంగా పనిచేసారు. ఆమె తాత ఆయన సోదరుడు ప్రఖ్యాతి కలిగిన గుజరాతీ నవలా రచయితలు, కవులు. కుటుంబ పరిస్థితులు విదితా వైద్యాను ప్రభావితం చేసాయి.

విదితా వైద్యా
వృత్తిమహిళా శాస్త్రవేత్త
విదితా వైద్యా

ప్రోత్సాహం మార్చు

విదితా వైద్యా తల్లితండ్రులు ఆమెను ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకొమ్మని సలహా ఇచ్చారు. అయినప్పటికీ ఆమె గొంగళి పురుగు గూడు కట్టుకోవడం చూసి అది ఎలా గూడుకట్టుకుంటుంది, అది గూడు కట్టుకోవడానికి ఎంత పొడవైన దారం కావాలి అని ప్రశ్నించినప్పుడు ఆమె తల్లి తండ్రులు ఆమెలో నాలుగేళ్ళ వయసులోనే శాస్త్రవేత్తను చూసారు. ఆమె బాల్యంలో తల్లితండ్రులతో ముంబయి లోని గోర్గాన్ లోని " సి.ఐ.బి.ఎ రీసెర్చ్ సెంటర్ " కాంపస్‌లో తిరుగుతున్నప్పుడు మార్గమద్యంలో ఇంజెక్ట్స్, పక్షులు, పూలు, ఒక్కోసారి నక్కలు, పాములు కనిపించేవి. ఈ వాతావరణం విదితా వైద్యకు సైన్స్ మీద ఆసక్తిని కలిగించింది. విదితా వైద్యా తల్లితండ్రుల నుండి బయాలజీ అంటే ఆరాధన పెంచుకున్నది. 70-80లలో ముంబయిలోని సిబా-జియాగీ రీసెర్చ్ కాంపస్‌లో తెలివైన అనికితభావంతో పనిచేసే ప్రాథమిక పరిశోధకుల కొరకు ఒక క్రిటికల్ మాస్ కాత్యక్రమం ఏర్పాటు చేసిది. కాంపస్ సహజసౌందర్య వాతావరణం, పచ్చదనం, పాత ప్రపనపు బంగళాలు తరువాత అక్కడ సహాధ్యాయులతో జరిపిన సైంటిఫిక్ చర్చలు ఆమెను ఎంగానో ప్రభావితం చేసాయి.

అంకుల్ మార్చు

విదితా వైద్యా చిన్న వయసులో యు.ఎస్.లో ఉన్న ఆమె అంకుల్ (బాబాయి/పెదతండ్రి) మాలిక్యూల్ బయాలజిస్ట్ డాక్టర్ అఖిల్ వైద్యా ఆయన తరవుగా విద్యా ఇంటికి వచ్చేవాడు. అలాగే ఆయన చాలా పుస్తకాలను కూడా తీసుకువస్తూ ఉండేవాడు. ఆమె 13 సంవత్సరాల వయసులో ఉండగా రిచర్డ్ రెస్టక్ వ్రాసిన " ది బ్రెయిన్ " అనే పుస్తకాన్ని ఆమె అంకుల్ బహుమతిగా ఇచ్చాడు. ఆపుస్తకంలో చీమలు, ఈగలు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయి. పిల్లులు అవి నివసించిన గృహంతో ఎలా అనుబంధం ఏర్పరచుకుంటాయి. ఇంకా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తరువాత ఆమె దృఢంగా న్యూరోసైన్స్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్నది.

అంకుల్ ప్రోత్సాహం మార్చు

విదితా వైద్యా స్కూలు చదువు ముగించిన తరువాత మెడికల్ స్కూలులో చేరే అవకాశం వచ్చినా ఆమె ముంబయిలోని " క్సేవియర్ కాలేజి "లో లైఫ్ సైన్సు ప్రధానాంశంగా డిగ్రీ చదువును ఎంచుకున్నది. క్సేవియర్ కాలేజి అధ్యాపకులు విద్యార్థులు సమస్యలు పరిష్కరించడానికి, ప్రయోగాలు చేయడానికి అలాగే బేసిక్ లైఫ్ సైన్స్ ను సరదాగా అధ్యయనం చేయడామినికి అవసరమైన సహకారం అందించారు. ఒకసారి వేసవి శలవులలో ఆమెకు అంకుల్ యు.ఎస్. లోని ఫిలడెల్ఫియాలో ఉన్న ప్రయోశాలలో అంకులుతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అప్పుడా సైన్స్ , ప్రయోగశాల వాతావరణం మీద కలిగిన ఆకర్షణ జీవితకాలం కొనసాగింది.

యు.యస్ యేల్ మార్చు

ఆమె ఇంటర్ మీడియట్ పూర్యిచేసిన తరువాత ఆమె ఇండియాను వదిలి 1992లో యు.ఎస్.లోని యేల్ నగరంలో ఉన్న న్యూరోసైన్సు అధ్యయనం చెయ్యడానికి ప్రయాణమయింది. అక్కడ ఆమెకు ప్రొఫెసర్ రోనాల్డ్ డ్యూమన్ ఆమెకు సలహాదారుడుగా, మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా , టీచరుగా ఉన్నాడు. అప్పుడే ఆమెకు న్యూరో సైన్స్ అంటే అదనంగా మక్కువ ఏర్పడింది. అందులోనూ న్యూరాలజీ ఆఫ్ మూడ్ అంటే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

ప్రవేశ పరీక్ష మార్చు

యు.ఎస్ లో డిగ్రీ కాలేజి పూర్తిచేసిన తరువాత రిసెర్చ్ చేయాలంటే క్వాలిఫైయుంగ్ ఎగ్జాం వ్రాయాలి. అందులో విజయవంతంగా ఉతీర్ణత సాధిస్తేనే రీసెర్చ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆమెకు క్వాలిఫైయింగ్ ఎగ్జాంస్ నిర్వహణలో ప్రొఫెసర్ ఆమీని కలుసుకునే అవకాశం లభించింది. ఆమెను చూసి విదితా వైద్య విజయవంతమైన మహిళాశాస్త్రవేత్త మార్గదర్శిగా, స్నేహితురాలిగా, తల్లిగా, భార్యగా ఎన్ని విభిన్న పాత్రలు పోషించాలో నేర్చుకున్నది. విదితా వైద్యకు యేల్ నగరంలో ఇలా విభిన్న బాధ్యతలను సమర్ధాంతంగా పోషిస్తున్న పలువురు మహిళను చూసే అవకాశం లభించింది. ఆమెకు జీవితంలో విభిన్న బాధ్యతలు వహించడానికి యేల్ అనుభవం ఒక పాఠం అయింది. క్వాలిఫైయుంగ్ ఎగ్జాంలో ఉత్తీర్ణత సాధించిన తరువాత ఆమీ నుండి అభినందనల కార్డును అందుకున్నది.

వివాహం మార్చు

విదితా వైద్యా డిగ్రీ చదివే సమయంలో ఆమె కాబోయే భర్త అజిత్‌ను కలుసుకున్నది. ఆమె జీవితంలో ప్రాముఖ్యత వహించిన ఇతరులకంటే అజిత్ ప్రత్యేకత ఉంది. ఆయనకు సైన్స్‌తో సంబంధం లేదు. ఆయన వాణిజ్యరంగంలో పనిచేస్తుండేవాడు. అయినా వారి కేరీర్ నిమిత్తం వారిరిరువురు చాలాకాలం విడివిడిగా ఉన్నారు. తరువాత వారిద్దరూ కొంతకాలం యు, కెలో ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీలో పోస్ట్‌డాక్టరేట్ చేసిన తరువాత 2000లో ఇండియాకు తిరిగి వచ్చారు. ముంబయి లోని " టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిఒసెర్చ్ "లో 8 సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆమె స్వతంత్రంగా పరిశోధనలు చేపట్టింది.టి.ఐ.ఎఫ్.ఆర్ లో 8 సంవత్సరాల కాలం పని చేచే సమయంలో ఆమె పలు శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం లభించింది. అలాగే వారి నుండి వైవిధ్యమైన పలు అంశాలను నేర్చుకున్నది. లాబ్ నిర్మాణం, అనిమల్ హౌస్ ఏర్పాటు, నిధుల కొరకు అభ్యర్థించడం, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించడం ఆమెకు ఆనందం కలిగించింది. టి.ఐ.ఎఫ్.ఆర్ ఇచ్చిన సైంటిఫిక్ స్వతంత్రం మద్దతు మరువలేనివన్నది ఆమె భావన. విదితా వైద్యా కుమార్తె పేరు అలినా. విదితా వైద్యాకు కేరీర్‌లో ముందుకు సాగడానికి ఆమె అత్తమామలు అందించిన సహకారం గొప్పదనది ఆమె భావన.

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.