ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు వినియోగం
(విద్యుత్తు వాడకం (వినియోగం) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న గృహ విద్యుత్ వినిమయం
మార్చు- రాష్ట్రంలో విద్యుత్ వాడకం అన్ని కేటగిరీల్లో అంచనాలకు మించి పెరగడంతో విద్యుత్ రంగ సంస్థల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాది భారీ వర్షాల వల్ల జల విద్యుత్ ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి కావడంతో 2010-11 సంవత్సరంతో పాటు, వేసవి కాలంలో తక్కువ స్థాయి విద్యుత్ కోతలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గట్టెక్కింది. ఆశించిన స్థాయిలో ఈ ఏడాది వర్షాలు కురవకపోతే జల విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్తుని ఉత్పత్తిని చేయవు. దీంతో తప్పనిసరిగా విద్యుత్తును ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలు, కేంద్ర గ్రిడ్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని విద్యుత్ నిపుణులు ఆలోచిస్తున్నారు.
- 2011-12 సంవత్సరంలో రాష్ట్ర అవసరాలకు 84,286 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
- పీక్ డిమాండ్‌లో 12,910 మెగావాట్ల విద్యుత్ వినిమయమవుతుంది.
- 2016-17లో 98,996 మిలియన్ యూనిట్లు లేదా 15,695 మెగావాట్ల విద్యుత్ ఖర్చవుతుందని డిస్కాంలు అంచనా.
- గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం జూలై 1వ తేదీన విద్యుత్ పీక్ డిమాండ్ సమయంలో 24 శాతం హెచ్చుగా వాడారు.
- గత ఏడాది 7,979 మెగావాట్ల విద్యుత్ వినిమయం కాగా, ఈ ఏడాది 9,900 మెగావాట్ల విద్యుత్ ఖర్చు అయ్యింది.
- గృహ విద్యుత్ రంగంలో గత పది సంవత్సరాల్లో వాడకం 3 శాతం నుంచి 12.60 శాతానికి పెరిగింది.
- 1999-2000 నుంచి 2004-05 సంవత్సరాల మధ్య ఈ కేటగిరీలో 7.3 శాతం,
- 2005-06 నుంచి 2009-10 మధ్య 10.96 శాతం వాడకం పెరిగింది.
- గత పది సంవత్సరాల్లో గృహ విద్యుత్ వాడకం పెరిగిన విధానాన్ని లెక్కలోకి తీసుకుని అంచనావేస్తే 2011-12 నుంచి 2016-17 మధ్య గృహవిద్యుత్ వాడకం డిమాండ్ 9.5 శాతం ఉంటుందని అనుకుంటున్నారు.
- 2011-12 సంవత్సరంలో గృహ విద్యుత్ రంగంలో విద్యుత్ వాడకం 17,280 మిలియన్ యూనిట్లు ఉంటుందని డిస్కాంలు అంచనా.
- 2016-17 నాటికి ఈ డిమాండ్ 27,203 మిలియన్ యూనిట్లకు పెరుగుతుంది. రాష్ట్రంలో గృహ విద్యుత్ వాడకం పెరిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- 1999-2000లో గృహ విద్యుత్ రంగంలో కేవలం 5,486 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చయింది.
- 2002-03లో 6,980 ఎంయు, 2004-05లో 7,789 మిలియన్ యూనిట్లు , 2007-08లో 10,384 మిలియన్ యూనిట్లు , 2009-10లో 13,102 మిలియన్ యూనిట్లు , 2010-11లో 14,500 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం జరిగింది.
- 2009-10, 2010-11 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వాడకంలో 22 శాతం విద్యుత్ గృహ రంగంలో వాడకం అయ్యింది.
- 2014 సంవత్సరం నాటికి రాష్ట్రంలో నూటికి నూరు శాతం విద్యుద్ధీకరణ పనులను పూర్తి చేసే దిశగా డిస్కాంలు, ట్రాన్స్‌కోల లక్ష్యం.
- 2009-10లో 185.80 లక్షల ఇళ్ళకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
- 2011లో 191.10 లక్షల ఇళ్ళు, 2017 నాటికి 204.20 లక్షల ఇళ్ళు విద్యుత్ ను వాడతాయి అని అంచనా.
- 2000-10 సంవత్సరంలో గృహ రంగంలో సగటు విద్యుత్ వాడకం ఏడాదికి 845 కిలోవాట్స్ నమోదైంది.
- 2011-12లో 896 కిలోవాట్లు, 2016-17 నాటికి 1039 కిలో వాట్లకు చేరుతుందని విద్యుత్ సంస్థల అంచనా.
- ఇక విద్యుత్ రంగంలో ట్రాన్స్‌మిషన్ (పంపిణీ), డిస్ట్రిబ్యూషన్ (సరఫరా) నష్టాల గురించి కూడా విద్యుత్ సంస్థలు ప్రణాళికను రూపొందించుకున్నాయి.
- 2009-10లో పంపిణీ నష్టాలు 4.65 శాతం, డిస్ట్రిబ్యూషన్ (సరఫరా) నష్టాలు 13.80 శాతం నమోదయ్యాయి.
- ఇందులో సాంకేతిక, వాణిజ్య నష్టాలను చేర్చారు. దీని ప్రకారం ఈ ఏడాది అంటే 2011-12లో 17.40 శాతం, 2012-13లో 16.40 శాతం, 2013-14లో 15.60 శాతం, 2015-16లో 15.20 శాతం, 2016-17లో 15 శాతం పంపిణీ నష్టాలు వస్తాయని అంచనా వేశారు.
- కాగా ట్రాన్స్‌మిషన్ (పంపిణీ), డిస్ట్రిబ్యూషన్ (సరఫరా) నష్టాలను తగ్గించేందుకు వీలుగా ట్రాన్స్‌కో పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్‌మిషన్ (సరఫరా) లైన్ల నిర్మాణాన్ని చేపట్టడంతో రానున్న రోజుల్లో దేశం మొత్తం మీద పంపిణీ నష్టాలు తక్కువ స్థాయిలో నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరే అవకాశాలున్నాయి.
ఆధారాలు
మార్చు- ఆంధ్ర భూమి దినపత్రిక 10 జూలై 2011.
- చూడు విశాఖపట్నం వ్యాసంలో (విద్యుత్ శక్తి) [1]