విద్యుత్ ఆదా దీపం యోజనా


విద్యుత్‌ ఆదా దీపం యోజనా (బచత్‌ లాంప్ యోజనా)

భారత దేశంలోగల మొత్తం విద్యుత్‌ అవసరాలలో కాంతి కొరకు అవసరమయ్యేది 20 శాతం విద్యుత్తు అని గణింప బడుతుంది. అధిక మొత్తంలో కాంతి కొరకు ముఖ్యంగా గృహావసరాలకు ఫిలమెంటు దీపాలు ఉపయోగ పడ్తున్నాయి. ఫిలమెంటు దీపాలలో 90 శాతం కన్నా ఎక్కువగా విద్యుచ్చక్తి, ఫిల మెంటును మండించడానికి వృధా అవుతుంది. కేవలం ఇవి 10 శాతం మాత్రమే వెలుగు నివ్వడానికి ఉపయోగపడ్తున్నాయి.

సమర్ధవంతంగా శక్తిని వినియోగించుకునే కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ దీపాలు (చక్కగా బిగించబడి, కూర్చబడిన ప్రతిదీప్తి దీపాలు-సిఎఫ్‌ఎల్‌) ఫిలమెంట్‌ దీపాలకు ప్రత్యామ్నాయంగా ఉండి 1/5 వ వంతు విద్యుత్తును వినియోగించుకుని ఫిలమెంట్‌ దీపాలతో సమానంగా కాంతినిస్తాయి. మన దేశంలో సిఎఫ్‌ఎల్‌ పూర్తిగా వాణిజ్య విపణిలోనికి చొరబడింది. 2003 సంవత్సరంలో 20 మిలియన్ల వరకు ఉన్న అమ్మకాలు 2008 వ సం|| నాటికి 200 మిలియన్ల వరకు అమ్మకాలు పెరిగాయి. కాంతినిచ్చే దీపాల గణాంక సంఖ్య సూచికను బట్టి గృహావసరాలకు కేవలం 5 శాతం నుండి 10 శాతం వరకు మాత్రమే ఉంది. గృహాలకు వినియోగించడానికి సిఎఫ్‌ఎల్‌లు ఎక్కువ వాడకం లేకపోవడానికి ధరలో ఫిలమెంట్‌ దీపాలతో పోలిస్తే 8-10రెట్లు ఎక్కువగా ఉండడమే కారణమౌతున్నది.

నేడు భారత దేశంలో 400 మిలియన్ల దీపస్థానాలు (లైట్‌ పాయింట్స్‌) ఏర్పడడంలో ఫిలమెంటు దీప కాంతులతోనే ఉన్నాయనేది అంచనా వేసారు. ఆయా ఫిలమెంట్‌ దీపాల స్థానంలో కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ దీపాలను ఏర్పరిస్తే 10,000 మెగావోల్టుల పైగా విద్యుత్‌ ఆదా అవుతుంది.

బచత్‌ లాంప్ యోజన ఉద్దేశం ప్రకారం ఎక్కువ పరిమాణంలో ఫిలమెంట్‌ దీపాల స్థానంలో గృహావసరాలకొరకు కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ దీపాలను ఏర్పరచడం. గృహావసరాల కొరకు సిఎఫ్‌ఎల్‌ నుఅందించడానికి ఫిలమెంట్‌ దీపాల ధరతో సమానంగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తున్నారు. క్యోటో ప్రోటోకాల్‌ యొక్క క్లీన్‌ డెవలెప్‌మెంట్‌ మెకానిజమ్‌ (సిడిఎమ్‌) వాణిజ్య ధరకు గృహావసరాలకు ఉపయోగించే ఫ్లోరసెంట్‌ దీపాల ధరల మధ్య భేదాన్ని పూడుస్తుంది . విద్యుత్‌ ఆదా దీపం యోజన (బచత్‌ లాంప్ యోజన ఫిబ్రవరి 2009వ సంవత్సరంలో ప్రారంభించబడింది.

బచత్‌ లాంప్ యోజన భారత ప్రభుత్వం పబ్లిక్‌ - ప్రవేటు భాగస్వామ్యంలో (డిజైన్‌) ను చేసింది. ప్రవేటు సెక్టారు (ప్రభుత్వేతర విభాగం) సిఎఫ్‌ఎల్‌ సరఫరాదారులు, రాష్ట్ర స్థాయి విద్యుత్‌ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌) కంపెనీల ద్వారా (డిస్కామ్స్‌ - డిఐఎస్‌ సిఒ ఎమ్‌). సిఎఫ్‌ఎల్‌ సరఫరాదారులు ఉన్నత, నాణ్యమైన కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ దీపాలను గృహాల కొరకు ఒక్కొక్క దీపానికి 15 రూపాయల చొప్పున నియుక్తమైన ప్రోజెక్ట్‌ (డిజిగ్నేటెడ్‌ ప్రోజెక్ట్‌) ప్రాంతంలో డిస్కామ్స్‌ - డిఐఎస్‌ సిఒ ఎమ్‌ నిర్వహణలో అమ్మడం జరుగుతుంది. సి ఎఫ్‌ ఎల్‌ సరఫరాదారులు డిస్కామ్‌ ద్వారా మిక్కిలి ఓర్మితో చేసిన ప్రయత్నంతో సిఎఫ్‌ఎల్‌ సరఫరాదారులు జాబితాతో బిఎఫ్‌ఎఫ్‌ పట్టికతో ఎంపిక చేసారు. ఈ పథకం క్రింద కేవలం 60, 100 వాట్ల ఫిలమెంట్‌ దీపాలకు బదులు 11-15వాట్లు, 20-25 వాట్ల సిఎఫ్‌ఎల్‌లను ఏర్పరచడం జరుగుతుంది. బ్లాక్‌ ఎక్జిక్యూటివ్‌ ఇంజనీరు (బిఇఇ) ప్రాజెక్ట్‌ ప్రాంతంలో విద్యుత్‌ ఆదా విధానమును పర్యవేక్షిస్తారు.

ప్రతీ పంపిణీ కంపెని (డిస్‌ కామ్‌) ప్రాంతంలో దాదాపు 50లక్షల సిఎఫ్‌ఎల్‌ లను ఫిలమెంట్‌ దీపాలకు బదులుగా ఏర్పరచాలని ఆశిస్తున్నారు.