వియత్నాంలో హిందూమతం

వియత్నాంలో హిందూమతాన్ని ప్రధానంగా చామ్ జాతి ప్రజలు ఆచరిస్తారు. [1] [2] ప్రస్తుతం ఉనికిలో ఉన్న రెండు భారత మూలాల్లేని స్థానిక హిందూ ప్రజల్లో బలమోన్ చామ్ శాఖ ఒకటి. [3] ప్రస్తుతం వియత్నాంలో దాదాపు 60,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [4]

చామ్ హిందువులు

మార్చు

వియత్నాంలోని చామ్‌లలో ఎక్కువ మంది (దీనిని తూర్పు చామ్ అని కూడా పిలుస్తారు) హిందువులు. కంబోడియను చామ్‌లు ఎక్కువగా ముస్లింలు. [5] హిందూ చామ్‌లను బాలమోన్ (బాని) చామ్ లేదా బాలమోన్ హిందూ అంటారు . [6] వారు శైవారాధనలో ఒక రూపాన్ని ఆచరిస్తారు. [7] చాలా మంది చామ్ హిందువులు క్షత్రియ వర్ణానికి చెందినవారు. [8] కానీ గణనీయమైన మైనారిటీ మైనారిటీ సంఖ్యలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. [9] వియత్నాంలో చాలా మంది చామ్‌లు నివసించే నిన్హ్ థువాన్ ప్రావిన్స్‌లో, చామ్ బాలమోన్ (హిందూ చామ్) సంఖ్య 32,000; నిన్హ్ థువాన్ లోని 22 గ్రామాలలో 15 హిందూ గ్రామాలు. [10] ప్రస్తుతం పో ఇను నుగర్, పో రోమ్, పో క్లాంగ్ గిరై, పో డాం అనే నాలుగు దేవాలయాల్లో పూజలు జరుగుతున్నాయి. మియూ పో నగర్, డేన్ థోథాప్ పో పటావ్, డేన్ పో కబ్రా కొన్ని ఇతర హిందూ దేవాలయాలు. [3]

చామ్ హిందువులు చనిపోయినప్పుడు, పవిత్ర వృషభమైన నంది, వారి ఆత్మను పవిత్ర భారత భూమికి తీసుకెళ్లడానికి వస్తుందని నమ్ముతారు. [11] చామ్ హిందువుల ప్రధాన పండుగ కేట్ పండుగ, [12] లేదా ఎంబాంగ్ కేట్. అక్టోబరు ప్రారంభంలో దీన్ని 3 రోజుల పాటు జరుపుకుంటారు. [13]

2009 జనాభా లెక్కల ప్రకారం వియత్నాంలో మొత్తం 56,427 మంది చామ్ హిందువులు ఉన్నారు. వీరిలో 40,695 మంది నింహ్ థువాన్‌లో ఉన్నారు. మరో 15,094 మంది బింహ్ థువాన్‌లో ఉన్నారు. [14] నిన్హ్ థువాన్, బిన్హ్ థువాన్ ప్రావిన్సుల జనాభాల్లో ఇది 22%, 4.8%. [14] 2017 నాటికి, యునైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్ సంస్థ వియత్నాంలో 70,000 చామ్ జాతి హిందువులు ఉన్నట్లు అంచనా వేసింది. [15]

పురాతన చామ్ హిందూ దేవాలయాలు

మార్చు
  • పో క్లోంగ్ గరై ఆలయం
  • పో నగర్
  • మాయ్ సోన్

భారతీయ హిందువులు

మార్చు
 
హో చి మిన్ సిటీలోని మారియమ్మన్ ఆలయం లోపలి భాగం.

హో చి మిన్ సిటీలో 4,000 మంది హిందువులు ఉన్నారు. వీరిలో చాలా మంది బని చామ్ హిందువులు కాగా, కొద్ది సంఖ్యలో మైనారిటీ భారతీయులున్నారు. [16] హో చి మిన్ సిటీ లోని తమిళ హిందువులకు అక్కడి మారియమ్మన్ దేవాలయం కేంద్ర బిందువు. దీన్ని చాలా మంది స్థానిక వియత్నామీస్, చైనీస్ లు కూడా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీనికి అద్భుత శక్తులున్నాయని నమ్ముతారు. [17]

సైగాన్ (హో చి మిన్ సిటీ) లో మూడు భారతీయ హిందూ దేవాలయాలు ఉన్నాయి - శ్రీ దండాయుథపాణి ఆలయం, తేన్ సుబ్రమణ్యం స్వామి ఆలయం, మారియమ్మన్ ఆలయం. [18]

జనాభా వివరాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
200956,427—    
201964,547+14.4%

2009 నాటి ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం, బాలమోన్ హిందువుల జనాభా 56,427. ఈ సంఖ్యలో 40,695 మంది నిన్హ్ థువాన్‌లోను, 15,094 మంది బిన్హ్ థువాన్‌లోనూ ఉన్నారు. ఇందులో తమిళ హిందువుల జనాభాను చేర్చలేదు. [14] అయితే, UK రాయబార కార్యాలయం అధికారిక అంచనా ప్రకారం వియత్నాంలో 1,500 మంది హిందువులు ఉన్నారు. వారు బహుశా తమిళ హిందువులు కావచ్చు. [19]

మూలాలు

మార్చు
  1. "Hindus of Vietnam - Hindu Human Rights Online News Magazine". www.hinduhumanrights.info. Archived from the original on 2021-10-05. Retrieved 2021-12-04.
  2. "Vietnam's ancient Hindu culture rediscovered". InDaily (in ఇంగ్లీష్). 2015-03-23. Retrieved 2020-09-14.
  3. 3.0 3.1 Parker, Vrndavan Brannon (April–June 2014). "Cultures: Vietnam's Champa Kingdom Marches on". Hinduism Today.
  4. http://tongdieutradanso.vn/uploads/data/6/files/files/2_%20Bieu%20so%20lieu%20va%20phu%20luc%20(duyet%20gui%20in).pdf
  5. "Cham - Introduction, Location, Language, Folklore, Religion, Major holidays, Rites of passage". www.everyculture.com.
  6. "The Cham: Descendants of Ancient Rulers of South China Sea Watch Maritime Dispute From Sidelines". National Geographic News. 18 June 2014.
  7. "Religion and expressive culture - Cham". www.everyculture.com.
  8. India's interaction with Southeast Asia, Volume 1, Part 3 By Govind Chandra Pande, Project of History of Indian Science, Philosophy, and Culture, Centre for Studies in Civilizations (Delhi, India) p.231,252
  9. "Vietnam". International Religious Freedom Report 2004. U.S. Department of State: Bureau of Democracy, Human Rights, and Labor. 2002-10-22. Retrieved 2010-05-19.
  10. Other place where they are found in hgher numbers is Bình Thuận Province. Champa and the archaeology of Mỹ Sơn (Vietnam) by Andrew Hardy, Mauro Cucarzi, Patrizia Zolese p.105
  11. Roy, Sandip. "Leaps of faith". @businessline.
  12. Reporter, W. H. N. (13 October 2018). "Exhibition on Vietnam Hindu Cham Brahman Community Opens". Archived from the original on 23 సెప్టెంబరు 2019. Retrieved 4 డిసెంబరు 2021.
  13. "Kate Festival". www.vietnamonline.com.
  14. 14.0 14.1 14.2 http://www.gso.gov.vn/Modules/Doc_Download.aspx?DocID=12724
  15. "International Religious Freedom Report for 2017: Vietnam". US State Department. Retrieved 2018-12-16.
  16. "Hindus of Vietnam - Hindu Human Rights Online News Magazine". Hindu Human Rights Online News Magazine. 19 October 2012. Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 4 డిసెంబరు 2021.
  17. Arachika Kapoor (2017-03-01). "Ho Chi Minh City Tourism holds roadshow in New Delhi | Media India Group". Mediaindia.eu. Archived from the original on 2018-12-15. Retrieved 2018-12-16.
  18. Powell, Michael (26 May 2017). "Three Hindu Temples in Saigon".
  19. "Vietnam: country policy and information notes". GOV.UK.