విలియం హెన్రీపెర్కిన్
సర్ విలియం హెన్రీ పెర్కిన్, (FRS) (1838 మార్చి 12 – 1907 జూలై 14) ఒక ఇంగ్లీషు రసాయన శాస్త్రవేత్త. అతడు తన 18 వ ఏట అనిలీన్ అద్దకాన్ని, మావోయిన్ ని కనుగొన్నాడు. చిన్న తనం నుంచే నూతన విషయాలపై అమితమైన జిజ్ఞాస కలిగిన పెర్కిన్ కి పరికరాలు, రంగులు వగైరాలు అతని ఆట వస్తువులుగా ఉండేవి. సిటీ ఆఫ్ లండన్ స్కూల్లో చదువుతున్న పెర్కిన్ ప్రతిభని గుర్తించిన ధామస్ హాల్ అనే ఇన్‌స్ట్రక్టర్ అతన్ని రాయల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ లో చేరమని ప్రోత్సహించాడు. పట్టుమని పదిహేడేళ్లు రాకముందే ఆగస్టు విల్ హెల్మ్ ఫొన్ హొఫ్ మాన్ అనే జర్మనీ సైంటిస్ట్ కి అసిస్టెంట్ అయ్యాడు పెర్కిన్. ఉష్ణ మండల వ్యాధుల చికిత్సకు గానూ అప్పుడప్పుడే వ్యాప్తి లోకి వస్తున్న క్వినైన్ తో కొత్త ప్రయోగాలు చెయ్యమన హొఫ్ మాన్ పెర్కిన్ కి చెప్పాడు. 1856 వ సంవత్సరంలో ఆస్టర్ పండుగ రోజుల్లో పెర్కిన్ ఇంట్లోనే కూర్చుని అనిలైన్ ని ఆక్సిడైజ్ చేసి క్వినైన్ తయారు చేయటానికి ప్రయత్నించాడు.
సర్ విలియం హెన్రీ పెర్కిన్ | |
---|---|
జననం | మార్చి 12 , 1838 |
మరణం | జూలై 14 , 1907 |
రంగములు | రసాయన శాస్త్రము |
ప్రసిద్ధి | అనిలీన్ అద్దకం రంగు. మావైన్, పెర్కిన్ త్రిభుజం |
ప్రభావితం చేసినవారు | August Wilhelm von Hofmann |
ముఖ్యమైన పురస్కారాలు | Royal Medal, Davy Medal, Perkin Medal |
మూలాలు
మార్చు