విల్లా బేట్రిస్ బ్రౌన్ (1906 జనవరి 22జూలై 18, 1992) అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త.[1] అమెరికాలో పైలెట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి ఆఫ్రికా-అమెరికా జాతికి చెందిన మహిళ విల్లా బ్రౌన్.[2] అంతే కాక యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కు వెళ్ళిన మొదటి అఫ్రికా-అమెరికా మహిళ కూడా ఆమే.  యు.ఎస్ సివిల్ ఎయిర్ పెట్రోల్ కు అధికారి అయిన మొదటి ఆఫ్రికా-అమెరికన్ మహిళ కూడా విల్లా అవడం విశేషం. పైలెట్ లైసెన్స్, మెకానిక్ లైసెన్స్ రెండూ కలిగిన మొట్టమొదటి అమెరికన్ మహిళ విల్లా.[3] సైన్యంలోనూ, విమానాల్లోనూ లింగ, జాతి సమానత్వాల కోసం జీవితాంతం పోరాడారు ఆమె. విల్లా న్యాయవాద వృత్తిలో ఉంటూ  జీవితమంతా ఈ వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో కేసులు వాదించారు. యుఎస్ ఆర్మీ ఎయిర్ కార్ప్ ను అనుసంధించాలని ప్రభుత్వంతో లాబీ చేయడమే కాక, ఆఫ్రికన్ అమెరికన్స్ ను సివిలియన్ పైలెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (సిపిటిపి) లో చేరేందుకు అనుమతించాలని ఆమె కోరారు. కార్నెలియస్ కాఫీ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ ను కార్నెలియస్ కాఫీతో కలసి స్థాపించారు ఆమె. ఈ సంస్థ అమెరికాలోని మొట్టమొదటి ప్రైవేట్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ. ఈ సంస్థకు ఆఫ్రికన్ అమెరికన్స్ యజమానులు, వారే దాన్ని నడిపిస్తారు కూడా. ఈ సంస్థ ద్వారా ఆమె కొన్ని వందల మంది పైలెట్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సంస్థలో టైన్ అయిన కొంతమంది పైలెట్లు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ప్రఖ్యాతులైన ఈ ఆఫ్రికన్ అమెరికన్ జాతి పైలెట్లను సుకేగీ ఎయిర్ మెన్ గా పిలుస్తారు.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Brown, Willa". American National Biography. Oxford University Press.
  2. Davis, Edmond. "Brown, Willa B. (1906–1992)". The Black Past. Retrieved 2016-02-09.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Kelli Grant. "Our History | 99s in Aviation History | Women in Aviation".

వెలుపలి లంకెలు

మార్చు