ఈ వ్యాసం, రచయిత తన స్వంత ఆలోచనలను, అభిప్రాయాలనూ రాసుకున్నట్లుగా ఉంది. వ్యాస విషయం గురించిన విజ్ఞాన సర్వస్వ వ్యాసం లాగా లేదు.. దీన్ని విజ్ఞాన సర్వస్వపు శైలి లోకి తిరగరాసి, మెరుగుపరచండి.(నవంబరు 2023)
ఇక్కడకు దగ్గరలోనే ఉన్న గంగవరం కూడా ఒక మత్స్యకార గ్రామం.
విశాఖపట్నం చేపలరేవు నిర్మాణం ఇక్కడ ఉన్న సౌకర్యాల వలన, విశాఖపట్నం వద్ద నిర్మించారు. ఈ చేపల రేవు వేలాదిమంది, మత్స్యకారులకు, మరెందరికో ఉపాధి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న 600 మరపడవలకు కావలసిన డీజిలు, వేటకు వెళ్ళే ముందు పడవలలో నింపుకొనే ఐస్ (చేపలు పాడుకాకుండా ఉండటానికి), వారం, పదిరోజుల పాటు సముద్రంలో ఉండటానికి సిబ్బందికి కావలసిన కూరగాయలు, నూనె, పప్పులు, ఉప్పులు, బియ్యం, నీరు, కిరసనాయిలు, గాస్ వంటివి చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. అంత వాసి, వ్యాపార వర్గాలకు ఆనందమే. చేపలరేవులో ఉండేవారికి కావలసిన, ట్, టిఫిన్లు సరఫరా చేయాలి కాబట్టి వారకి కూడా ఉపాధి దొరుకుతుంది. అయితే వన్ టౌన్ వారు తరుచుగా ఈ చేపల వాసన వలన వచ్చే చెడు గాలి (వాతావరణ కాలుష్యమ్ గురించి ) ఆందోళన చేస్తుంటారు. అందుకని ఈ చేపల రేవుని భీమునిపట్నం (భిమిలి) రేవుకు మార్చాలని కోరుతున్నారు.
చేపలరేవు: ఇక్కడ నుంచి 600 మరపడవలు సముద్రంలో వేటకు వెళ్ళి, 15 రోజుల తరువాత విశాఖపట్నం చేపలరేవుకి తిరిగి వస్తాయి. చేపలు, పచ్చిరొయ్యలు పట్టుకొని, వాటిని ఎగుమరి చేస్తాయి. సాధారణంగా చేపలు పిల్లలు పెట్టే సమయంలో 45 రోజుల సమయం చేపలవేటను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తరువాత జాలరులు ఈ రేవునుంచి, చేపల వేటకు బయలు దేరుతారు. వేల కుటుంబాలు ఈ రేవుమీద, ఆధారపడి బ్రతుకుతున్నాయి. కొన్ని సమయాలలో, ముఖ్యంగా వాతావరణం సరిగా లేని సమయంలో, మరపడవలు ములిగి వేటకు వెళ్ళిన వారిలోకొందరు మరణించే సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి, కోలకత్తా, ఒరిస్స్తా, ముంబై ఎగుమతులు జరుగుతున్నాయి.
1 జూన్ 2010 నుంచి చేపలవేట ప్ర్రారంభమైంది. 45 రోజుల ముందునుంచి, చేపలవేటపై నీషేధం ఉంది. ఆ నిషేధం 31 మే 2010 తో పూర్తి అయ్యింది. 1 జూన్ 2010 నుంచి చేపలవేట అంత అనుకూలంగా లేదు. చేపలు, రొయ్యలు సరిగా పట్టుబడక మొదటిసారి, రెండవసారి వేటకు వెళ్ళిన వారికి పెట్టుబడులు రాలేదు. జూన్ రెండవ వారం నుంచి వాతావరనంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. వర్షాలు జోరుగా పడుతున్నాయి. అంతకుముందు వరకు ఎండల తీవ్రత ఉన్నా ఆ తరువాత వాతావరణం చల్లబడింది. దీంతో సముద్రంలోను వడి తీవ్రత తగ్గింది. కట్‌లెట్ రకం చేపలు బాగా దొరుకుతున్నాయి ఇవి కిలో 140 రుపాయలవరకు పలుకుదుండటంతో జాలరులు వీటిపఈనె ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. గత సీజన్‌లో ఇవి కిలో 105 రూపాయల వరకు పలికాయి. ఈ సారి వెల పెరిగింది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. వెల బాగుండటం, బాగా దొరుకుతుండటం వలన ఎక్కువమంది ఈ కట్్‌లెట్ రకంపై దృష్టి పెట్టారు. వేటకు వెళ్ళిన మర పడవలలో కొన్ని వారం రోజుల పాటు సముద్రంలో ఉంటాయి. మరికొన్ని 15 రోజుల వరకు మకాం వేస్తాయి. ఇలా వారంపాటు వేటకు వెళ్ళే పడవలకు 500 కిలోల వరకు చేపలు పడుతున్నాయి. రొయ్యలు కూడా ఓ మాదిరిగా పడుతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో రొయ్యల తక్కువగా దొరుకుతున్నాయి. ఈ రొయ్యలు బాగా ఎకువగా దొరికితే, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఎగుమతి అయ్యే రొయ్యల రకాలను బట్టి కిలో 260 రూపాయల నుంచి 650 రూపాయల వరకు ధరలు ఉన్నాయి. ఈ రకాల రొయ్యలు తక్కువగా దొరుకుతున్నాయి. దిని వల్ల చేపలే ఎక్కువగా పట్టుకోవాలనే ఉద్దేశంతో, చేపల వేట జరుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నా, వర్షాలు బాగా పెరిగి, తుఫాన్లు, అల్పపీడనం వంటివి వస్తే మళ్ళీ వేట ఆపవలసి వస్తుంది.వాటిని కూడా జాలరులు లెక్క వేసుకుంటున్నారు.
విశాఖపట్నం వచ్చినవారు ఈ చేపల రేవుని చూడవలసిందే. మరపడవలు చేపలవేట మురించుకుని రేవుకి చేరిన తరువాత జరిగే సందడి, ఆ పడవలోని చేపలను ఒడ్దుకు చేరవేయటం, వాటిని వేలం వేయటం, బజారులలోను, వీదులలోను అమ్మేవారు కొనుక్కునే తీరు మనం చూడవలసిందే. జాతీయ బహుమతి పొందిన మలయాళ సినిమా 'చెమ్మీన్ (రొయ్య) ] చిత్రంలో చూపించిన జాలరుల (గంగపుత్రుల) జీవన విధానం ఈ విశాఖపట్నం చేపలరేవులో చూడవచ్చును.