విషయ వ్యక్తీకరణ

ఏదైనా విషయాన్ని, లేక భావాన్ని రాత పూర్వకంగా కాని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఆసక్తికరంగా, సమగ్రంగా తెలియచేసే పరిజ్ఞానమే విషయ వ్యక్తీకరణ (Documentation ).[1]దీని ఉపయోగాలు

 • విద్యను శిక్షణను అందించటం.
 • వివిధ సామాజికాంశాలు అర్ధం చేసుకోవడం.
 • పథకం స్థితిగతులు మూల్యాంకనం చేయడం
 • వ్యూహరచనచేయడం.

విషయ వ్యక్తీకరణ సరిగా చేయటానికి కొన్ని మెళకువల గురించి తెలుసుకుందాం.

ఎందుకు ఎవరికోసం, లాంటి ప్రశ్నలుసవరించు

విషయ వ్యక్తీకరణ ఎందుకు, ఎవరి కోసం లాంటి ప్రశ్నలు వేసికొంటే, స్పష్టత లభించి, ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది.

కావలసిన నైపుణ్యాలుసవరించు

 • ఆలోచించడం
 • మాట్లాడడం
 • చదవటం
 • పరిశీలించటం
 • విశ్లేషించటం

అలోచన సాధనాలుసవరించు

స్వేచ్ఛగా రాయటంసవరించు

వ్యాకరణ విషయాలు పట్టించుకోకుండా మన ఆలోచనలను కాగితం పైన పెట్టటమే స్వేచ్ఛగా రాయటం (Free writing) అనే ప్రక్రియ. ఇది సులభంగా చేయటానికి చిట్కాలు

 • దీనికొక పుస్తకం కేటాయించండి.
 • నిర్దిష్ట సమయం కేటాయించండి. సాధారణంగా 15 నిముషాలు.
 • అలోచన, రాయటం నిరంతరాయంగా చేయండి.
 • తప్పులు, అసంబద్ధ ఆలోచనలను పట్టించుకోకండి.


ఆలోచనా పటంసవరించు

 
విషయ వ్యక్తీకరణకు పాక్షిక ఆలోచనా పటం

ఎంపిక చేసిన విషయానికి సంబంధించిన అంశాలు వాటి మధ్య వుండే సంబంధాలు రేఖా బొమ్మ రూపంలో తయారు చేయడమే ఆలోచనా పటం. (Mind Map) ఇది వాడితే అంశాల సమగ్రత, ప్రాధాన్యత, వరుస క్రమము నిర్ణయించడం సులభం అవుతుంది. ఒక కాగితం తీసుకోండి. వృత్తం గీయండి దానిలో ఎంపిక చేసిన విషయం రాసి. దానికి సంబంధించిన అంశం ఆలోచించండి. దానినుండి ఒక గీత గీచి, మరల ఒక వృత్తం గీచి దానిలో సంబంధించిన అంశం రాయండి. అలా ఆలోచనలు, గీతలు, వృత్తాలు, రాతలు చేస్తూ పోతే, ఆలోచనా పటం తయారవుతుంది. తరువాత మార్పులు , చేర్పులు , తొలగింపులు చేస్తే విషయ వ్యక్తీకరణకి స్పష్టత ఏర్పడుతుంది. ఆ తరువాత, ఈ అంశాలను విపులీకరిస్తే మంచి వ్యాస రూపం లేక దృశ్య శ్రవణ మాధ్యమ రూపం తయారవుతుంది. దీనిని ఒంటరిగా, లేక జట్టుగా చేయవచ్చు. జట్టుగా చేసేటప్పుడు క్రింది సూచనలు పాటించండి.

 • అభిప్రాయాలను ఖండించకండి.
 • అందరి అభిప్రాయాలను ప్రోత్సహించండి, ఆలోచనా పటంలో చేర్చండి.
 • మంచి, చెడు నిర్ణయాలు చేయవద్దు.
 • ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా, ఎక్కడా, ఏది, ఎప్పుడు లాంటి ప్రశ్నలతో ఆలోచనల పరిధిని పెంచండి.

విపులీకరణ, మెరుగుసవరించు

దీనిలో ముఖ్యాంశాలు.

 • చిత్తు ప్రతిని తయారు చేయుట
 • దీనిపై ఒకరిద్దరి అభిప్రాయాలు తీసుకోండి.
 • మెరుగు చేయండి.
 • మన లక్ష్యమైన వ్యక్తులకు అందేటట్లు చేయండి.

మరిన్ని సలహాలుసవరించు

భాష, వాక్య నిర్మాణంసవరించు

 • భాష సరళంగా అంటే అందరికి అర్ధమయ్యేలా వుండాలి.
 • క్లిష్ట పదాలు, పారిభాషిక పదాలు వాడవలసివస్తే, మొదట వాటిని సరళభాషలో వివరించండి.
 • చిన్న చిన్న వాక్యాలు వాడండి,
 • అచ్చు తప్పులు లేకుండా సరి చేయండి.
 • ఆసక్తికరంగా చేయటానికి సామెతలు, నుడికారాలు వాడండి.

బొమ్మలు వాడటంసవరించు

కొన్ని పేజీలలో చెప్పే విషయాన్ని ఒక్క బొమ్మ ద్వారా సులభంగా తెలియచెప్పవచ్చు. నిరక్ష్యరాస్యులు కూడా అర్ధం చేసుకోగలుగుతారు. బొమ్మ వ్యక్తుల హావభావాలను, స్థితిగతులను అద్దం పట్టేదిగా వుండాలి.

ఇవీచూడండిసవరించు

వనరులుసవరించు

 1. డాక్యుమెంటేషన్ పైన ప్రాథమికాంశాలు. భారత ప్రగతి ద్వారం. Archived from the original on 2011-06-17.
 • నండూరి రామమోహన రావు. తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు.