విస్లావా సింబోర్స్‌కా
విస్లోవా సింబోర్స్‌కా (ఆంగ్లం: Maria Wisława Anna Szymborska) (2 జూలై 1923 – 1 ఫిబ్రవరి 2012) పోలెండ్కు చెందిన కవయిత్రి, అనువాదకురాలు. ఈమెకు 1996 లో సాహిత్యానికి సంబంధించిన నోబెల్ బహుమతి లభించింది. ఈమెను కవిత్వంలో మొజార్ట్ ఆఫ్ పోయిట్రీ ("Mozart of Poetry") గా వర్ణించారు.[1][2]
Wisława Szymborska-Włodek | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Prowent, పోలెండ్ | 1923 జూలై 2
మరణం | 2012 ఫిబ్రవరి 1 Kraków, పోలెండ్ | (వయసు 88)
వృత్తి |
|
జాతీయత | Polish |
ప్రభావం | Czesław Miłosz |
పురస్కారాలు |
|
జీవిత భాగస్వామి | Adam Włodek (1948–1954; divorced) |
జీవిత సంగ్రహం
మార్చువిస్లావా 1923 జూలై 2 వ తేదీన పోలెండ్ లోని బ్నిన్ లో జన్మించింది. ఈమె క్రోకో లోని జెగిలోనియన్ విశ్వవిద్యాలయంలో పోలిష్ సాహిత్యం, సామాజిక శాస్త్రాలను అభ్యసించారు. 1953లో క్రోకో సాహిత్య వారపత్రిక జిలీ లిటరేకీలో కవితా విభాగానికి సంపాదకురాలయ్యారు.
ఆమె రచించిన వాటిలో లాటోగో జిజేభీ (దట్స్ వై ఉయ్ ఆర్ అలైవ్) -1952, పిటైనియా డజ్‌వానె సోబీ (క్వశ్చనింగ్ వన్‌సెల్ఫ్) -1954, వొలెనీ దొయేతి (కాలిగ్ ఆడట్ టూ యేతి) - 1957, సోల్ (సాల్ట్) - 1962, స్టొ పొసీబ్ (ఎ హండ్రెడ్ వాయిసెస్) - 1967 మొదలైన కవితా సంగ్రహాలు ప్రచురించబడ్డాయి. ఈమె కవితలు ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చెక్, హంగేరియన్, డచ్, ఇంగ్లీషు మొదలైన అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె కవితలు సర్వత్రా మన్ననలు అందుకున్నాయి. వీరి మొట్టమొదటి కవితా సంకలనాలు రెండూ స్టాలిన్ యుగాన్ని, రాజకీయ నిరాడంబరతను దర్శింపజేస్తాయి.
మరనం
మార్చువిస్లావా 1 ఫిబ్రవరి 2012 తేదీన 88 ఏళ్ళ వయసులో క్రోకో లోని తన ఇంటిలో నిద్రిస్తుండగా దివంగతులయ్యారు.[3] ఆమె చివరిరోజులలో కూడా కొత్త కవితల గురించి పనిచేశారు; అవి 2012 లో ప్రచురించబడ్డాయి.[4]
మూలాలు
మార్చు- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;reuters_death
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;france24_death
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Dates of birth and death for Wisława Szymborska". Rmf24.pl. Retrieved 3 February 2012.
- ↑ "Poland Nobel poetry laureate Wislawa Szymborska dies". BBC News. 1 February 2012. Retrieved 1 February 2012.
బయటి లింకులు
మార్చు- Wislawa Szymborska: Including biography and Nobel speech – NobelPrize.org
- Poems of Wislawa Szymborska
- Wislawa Szymborska poems in English
- More translated Wislawa Szymborska poems
- Wislawa Szymborska's "True Love" in Poem for Rent project.
- Wisława Szymborska at Encyclopædia Britannica
- About Tomasz Stańko's jazz album inspired by poems of Wisława Szymborska
- Wisława Szymborska at Culture.pl