వి.రామసుబ్రమణియన్

భారతీయ న్యాయమూర్తి
(వి.రామసుబ్రమణియన్‌ నుండి దారిమార్పు చెందింది)

వి.రామసుబ్రమణియన్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.

వి.రామసుబ్రమణియన్‌
వి.రామసుబ్రమణియన్


సుప్రీం కోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
23 సెప్టెంబర్ 2019 – ప్రస్తుతం
సూచించిన వారు రంజయ్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
22 జూన్ 2019 – 22 సెప్టెంబర్ 2019
సూచించిన వారు రంజయ్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

పదవీ కాలం
27 ఏప్రిల్ 2016 – 21 జూన్ 2019
సూచించిన వారు టి.ఎస్. ఠాకూర్
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ

మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
31 జులై 2006 – 26 ఏప్రిల్ 2016
సూచించిన వారు యోగేష్ కుమార్ సభర్వాల్
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-06-30) 1958 జూన్ 30 (వయసు 66)
చెన్నై
పూర్వ విద్యార్థి రామకృష్ణ మిషన్ వివేకానంద కాలేజీ, మద్రాస్ లా కాలేజీ [1]

జననం, విద్యాభాస్యం

మార్చు

వీ రామసుబ్రమణ్యన్‌ తమిళనాడు రాష్ట్రం చైన్నైలో జన్మించాడు. ఆయన మద్రాస్‌ లా కాలేజీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1983 ఫిబ్రవరి 16లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం

మార్చు

వీ రామసుబ్రమణ్యన్‌ 1983లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ప్రారంభించి 23 సంవత్సరాలపాటు చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేశాడు. ఆయన 31 జూలై 2006లో మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదిగా నియమితుడై 2016 ఏప్రిల్ 26 వరకు పనిచేశాడు. ఆయన 2016 ఏప్రిల్ 27 నుండి 2019 జూన్ 21 వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా, 2019 జూన్ 22 నుండి 2019 సెప్టెంబరు 22 వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి [2] పనిచేసి 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2023 జూన్‌ 30వ తేదీ వరకు కొనసాగుతాడు.[3]

మూలాలు

మార్చు
  1. Telangana High Court (2019). "HONOURABLE SRI JUSTICE V.RAMASUBRAMANIAN". tshc.gov.in. Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
  2. Sakshi (22 June 2019). "హైకోర్టు సీజేగా జస్టిస్‌ రామసుబ్రమణియన్‌". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
  3. 10TV (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)