వి.శివరామకృష్ణారావు

వడ్డమాని శివరామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బద్వేలు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వి.శివరామకృష్ణారావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989 - 1994
ముందు బిజివేముల వీరారెడ్డి
తరువాత బిజివేముల వీరారెడ్డి
నియోజకవర్గం బద్వేలు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 - 1983
ముందు బిజివేముల వీరారెడ్డి
తరువాత బిజివేముల వీరారెడ్డి
నియోజకవర్గం బద్వేలు

వ్యక్తిగత వివరాలు

జననం 1954
బద్వేలు
వృత్తి రాజకీయ నాయకుడు, సన్యాసి

శివరామకృష్ణారావు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులై 3 ఏప్రిల్ 2021న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్‌లో స్వామి సత్వవిదానంద సరస్వతి ఆధ్వర్యంలో సన్యాసం స్వీకరించి తన పేరును శివరామానంద సరస్వతిగా మార్చుకున్నాడు.[1][2]

రాజకీయ జీవితం మార్చు

డాక్టర్ వి.శివరామకృష్ణారావు 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 1978లో జనతా పార్టీ నుండి బద్వేలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1983, 1985, 1994, 1999లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,  చివరిసారిగా 2001 ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి కమలమ్మ చేతిలో 58 వేల ఓట్లతో ఓడిపోయాడు.[3]

మూలాలు మార్చు

  1. 10TV Telugu (2 April 2021). "అప్పుడు ఎమ్మెల్యేగా…ఇప్పుడు సన్యాసిగా… ఎవరాయన!…ఏమిటా కథ!…" (in Telugu). Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (3 April 2021). "సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
  3. Prabha News (2 April 2021). "సన్యాసం స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.