వీరశైవ మతం
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(ఏప్రిల్ 2017) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉపోద్ఘాతం
మార్చుశైవమతం భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామమాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.
వీరశైవ మత స్తాపకులు
మార్చుఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్థాపించడం జరిగింది.ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి.శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.
రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంథస్తం చేయటం జరిగింది. ఈ గ్రంథం అప్పటికే వీరాగమాది 28 గ్రంథాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు బోధించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.
రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ధ, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.
రేణుకాచార్యులవారు కొలనుపాకలోని శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు పురాణపరమైన ఆధారాలు:
రేణుకాచార్యుల వారు నల్గొండ జిల్లా కొలనుపాకలోని సోమేశ్వర లింగోద్భవులని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని సిద్దంతశిఖామనిలోని 4వ పటలములోని శ్లోకాలు వివరిస్తాయి.
అథ త్రిలింగ విషయే కొల్లిపాక్యభిధేపురే !
సోమేశ్వరమహాలింగాత్ ప్రాదురాసీత్ స రేణుకః !! (4-1)
ప్రదుర్భూతం తమాలోక్య శివలింగాత్ త్రిలింగజా: !
విస్మితాః ప్రాణినః సర్వే బభూవురతి తేజసమ్ !! (4-2)
2. రేణుకాచార్యులు కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించారని 28 శివాగమాలలో ఒకటైన స్వయంభువాగమం 9వ పటలంలో చెప్పబడింది. ఈ 9వ పటలంలో మొత్తం అయిదుగురు పంచాచార్యుల గురించి వివరంగా తెలుపబడి ఉంది, శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల చరిత్ర ఒకటైన వీరాగమంలో ఉంటుందిమరియు స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో కుడా రేణుకాచార్యుల గురించి వివరించబడి ఉంది.
శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే!
సోమేశ్వర లింగ జనన మావాసః కదళీపురే !! (స్వయంభువాగమం, చాప్టర్-9)
3. రేణుకస్యచతత్రైవ - తీర్థం సిద్ద సాధ్యాది |
తత్రస్నాత్వాభవేద్విప్రో -నిర్మలశ్చంద్రమా యధా ||
తా: రేణుక తీర్ధములో స్నానము చేయుట వలన పౌర్ణమి చంద్రునివలే పరిశుభ్రుడగును అని మహాభారతమున అరణ్య (వన) పర్వము 82వ అధ్యాయము 52వ శ్లోకమున చెప్పబడి ఉంది. ఈ రేణుక తీర్ధము కేదారకేత్రములో వెలసి ఉన్న ఉషామఠమునకు 2 (రెండు) మైళ్ళ దూరములో ఉంది.
4. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు ప్రతి యుగమున కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించి కృతయుగమున ఏకాక్షర శివాచర్యులు అని, త్రేతాయుగమున ఏకవక్త్ర శివాచార్యులు అని, ద్వాపరయుగమున రేణుకాచార్యులు అని, కలియుగమున రేవణారాధ్యులు అని ప్రసిద్ధి కాంచి ఉన్నారు. 5. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి వీరశైవ సిద్దాంతమును ఉపదేశించారు. 6. త్రేతాయుగమునందు మహా శివభక్తుడైన రావణుని సోదరుడైన విభీషణుడి ప్రార్థన మేరకు ఒకే ముహుర్తమున 3 కోట్ల శివ లింగములను లంకా నగరములో ప్రతిష్ఠించారు. 7. ద్వాపర యుగములో అనేక మహిమలను ప్రదర్సించడం రేణుక తీర్ధము లేక రేణుక సరోవరము అని సుక్షేత్రముగా ప్రసిద్ధి గాంచింది. కలియుగమున విక్రమాదిత్యుడు, చోళరాజులతో పాటు అనేక మంది రాజులను, చక్రవర్తులను అనుగ్రహించి వారికి శైవ సిద్దాంతమును బోధించి వేయి సంవత్సరములపాటు భారతావని అంతటా సంచరించి శివ ఙ్ఞానామృతాన్ని సర్వులకు ఉపదేశించి చివరికి తాము ఉద్భవించిన కొలనుపాక శ్రీ స్వయంభూ సోమేశ్వర లింగములో ఐక్యమై శివ స్సన్నిధ్యమును చేరిరి.
రేణుకాచార్యులవారు కొలనుపాకలోని స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు చారిత్రక ఆధారాలు:
1. రేణుకాచార్యులు ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంథస్తం చేయటం జరిగింది. ఈ గ్రంథం అప్పటికే వీరాగమాది 28 గ్రంథాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు బోధించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.
2. ఈ గ్రంథమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము. ఈ సిద్దాంత శిఖామణి గూర్చి తరువాత పలు గ్రంథాలలో ప్రస్తుతించటం జరిగింది. బ్రహ్మసూత్రములకు భాష్యము - శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు తన గ్రంథమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోన్నాడు, తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదహరించటం జరిగింది.
అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా: "పవిత్రంతే - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్” అని
"రేణుక భగవత్పాద చార్యేణాపి - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు. 3. శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములను ప్రమాణ యుక్తముగా ఉదహరించుట జరిగింది., తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను
బ్రహ్మ సూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదహరించుట జరిగింది..
4. ప్రసిద్ధ సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక", "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంథములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదహరించుట జరిగింది.
రేణుకాచార్యులు కొలనుపాక లింగోద్భవులని తెలిపిన కొన్ని గ్రంథాలు – రచయితలు: (ఈ వివరాలు శివశ్రీ రవికోటి మఠం వీరభద్రయ్య గారు రచించిన శ్రీక్షేత్ర కొలనుపాక వీరశైవ విభూతి రేవణసిద్దుడు" నుండి గ్రహించబడినవి) :
i. రేణుకావిజయం (ప్రథమ మంజరి: 27,37 శ్లోకాలు) - సిద్దనాథ శివాచార్య, సంస్కృతం ii. రేవణ సిద్దేశ్వర పురాణము (సంధి 2, పద్యము- 53) – బొమ్మరస, కన్నడము. iii. రేవణ సాంగత్య (సంధి-2 పద్య-21) – చన్నబసవ, కన్నడము. iv. రేవణ సిద్దేశ్వర రగళె (నిరత స్థలం - 57 వ పంక్తి) - మహాకవి హరీశ్వర, కన్నడము. v. కవికర్ణ రసాయనం (ప్రథప సర్గ-శ్లోకం-6) - మహాకవి షడక్షర దేవ, కన్నడము. vi. రేణుక విజయము (ప్రథమాశ్వాసం-పద్యము-49) - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, తెలుగు. vii. పంచబ్రహ్మొదయ భాష్యం (పుట-17) - సోసల చిక్క వీరనాధ్య, కన్నడము. viii. శివాధిక్య శిఖామణి (ప్రథమోపదేశమ్ – పుట- 2) - సోసల రేవణారాధ్య, కన్నడము.
కొలనుపాకలో అన్ని కులాల వారికీ రేణుకుల వారు మఠాలు కట్టించి దీక్షా సంస్కారాలు ఇవ్వటం జరిగింది. అవి నేడు చాలా వరకు కనుమరుగైపోగా కొన్ని మఠాలు మాత్రం శిథిలావస్థలో ఉన్నాయి. కొలనుపాకలో నేడు గల మఠాలు:
1. పెద్ద మఠము 2. కురుమ మఠము 3. కాపు మఠము 4. కోమటి మఠము 5. గౌండ్ల మఠము 6. చాకలి మఠము 7. మంగలి మఠము 8. పద్మశాలి మఠము 9. మేదరి మఠము 10. పెరుక మఠము 11. మాల మఠము 12. మీమ్మాఱు మఠము (వడ్రంగి, కంచరి, కమ్మరి, శిల్పి) 13. గొల్ల మఠము 14. ఒడ్డెర మఠము (దీనిని నక్క రామేశుని గుడి అనీ అంటారు) 15. సంగరి మఠము 16. తెనుగు మఠము 17. మేరె మఠము 18. గాండ్ల మఠము
కొలనుపాకలో రేణుకుల సంస్కరణల ప్రభావం నేటికీ ఉందని, అన్ని కులాలవారు పుట్టినపుడే లింగాలు ధరిస్తారని, ఈ ఊరిలో లింగవంతులైన మాలవాండ్లు మిగతా గ్రామాలలో మాదిరి ఊరి వెలుపల కాక ఊరు మధ్యలోనే నివసిస్తున్నారని శ్రీ ఉజ్జయిని జగద్గురువులు శ్రీ తరుళబాళు శివకుమార ఆచార్యులు తమ 1-1962 జనవరి నాటి కొలనుపాక క్షేత్ర పర్యటన వివవరాలను 19-4-1963 (సంచిక- 37) నాటి నవసందేశ కన్నడ పత్రికలో వివరించారు.
మత ప్రచారం
మార్చుఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ధ, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.
వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు.
మిగతా పీఠాలు:- ఉజ్జయిని-మరుళారాధ్య కేదారనాథ్-ఎకోరామారాధ్య శ్రీశైల-పండితారాధ్య కాశీ-విశ్వారాధ్యులు.
వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు.కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది.
పండిత త్రయం
మార్చుకులభేదాలను నిర్మూలించ పూనుకున్న వీరశైవ మతం ఆంధ్ర దేశములో అదుగుపెట్టే సమయానికి దేశములో మరొక రూపంలో శైవమతం అప్పుడే ప్రారంభం అయింది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో వీరశైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
శివలెంక మంచన
మార్చుపాల్కురికి సోమనాధుడు తన బసవపురణామునందు శివలెంక మంచన్నగారు కాశియందలి విశ్వేశ్వరలింగమునకు నిత్య త్రికాలముల యందు అర్పించుచున్నప్పుడు, తన పది వేళ్ళను అర్పించి మరల వానిని విశ్వేశ్వరుని వరప్రభావంబున బడయుచుండిన శివభక్తాగ్రేసురుండని వచించియున్నాడు.అంతేగాక శివలెంక మంచన కాశియందు శివుడొక్కడె ఉత్పత్తి, స్థితి, లయకారకుండని; ఆగమ శాస్త్రముల వలనను, శృతిస్మృతి పురాణాతిహాసముల వలనను, అన్యపతీయులతో వాదించి ప్రతిపాదించినట్లును, వాదమునందు వోడిన వితండవాదుల కోరికపై విష్ణువాలయమునుండి, విష్ణువును గొనిపోయి శివునికి నమస్కరింపజేసి, శివాధిక్యతను నిరూపించిన ప్రమధపుంగవుడని, సోమనాధుడు తెలిపినాడు. శివునియందలి ఇతని అనన్య భక్తియే గాక, శివభక్తులయెడ ఇతడి కింకర భావమువహించి యుండెననునది ఇతని పేరు లోని శివలెంక అను పదము వలన తెలియుచున్నది. కన్నడ సాహిత్యమునందు వీరి చరిత్ర ఇటులనే తెలుపబడింది.
మంచన్న గారి తాత, సోమశ భు దేశికుడు.గొప్ప పాండిత్య కలవాదడు. ఇతని తండ్రి సుపసిద్ధ విద్వాంసుడగు శంభుభట్టుడు. అతడు కామకాది శివాగమములను వృత్తముల యందు రచించి ప్రకాశింపజేసిన సకలాగసూచార్యుడు. ఇట్టి ఘన్ అనుభవము లభించిన వంశమునందు పుట్టిన, శివలెంక మంచన పరనాధులనోడించి గొప్ప పండితుడగుట స్వభావ సిద్ధమే! శివలెంక మంచన, బసవుని భక్తి ప్రభావములను, సదాచార సంపన్నతను, అనుభవ మంటపము ప్రసిద్ధిని విని, కల్యాణమునకు వచ్చి, బసవేశ్వరుని సందర్సించి, కొంతకాలమచట యుండి, అనుభవ మంటపులోని రోజు గోష్ఠులలో పాల్గొనేవాడు.కనుక ఇతను బసవుని సమకాలికుడు, 12 వ శతాబ్దమునకు చెందినవాడని తెలియుచున్నది.
శివలెంక మంచనగారి కుమారుడు ఉరిలింగదేవుడు. ఇతనును ప్రఖ్యాత వచనకర్త. ఇతడు నాందేడు జిల్లాలోని కందహారు పట్టణమునందు ఉండినాడని. ఒకనాడు ఇతను తన ఇష్టదైవమైన శివునియందు ధ్యానమదు నిమగ్నుడైయుండగా ఇతని కుటీరమునకు ఎవరో నిప్పుపెట్టగా ఇతడు చెలించక లింగనిష్ఠయందే యుండెననియు, ఇతనికెట్టి హానియు కలుగలేదనియు, చివర్కు నిప్పు నంటించిన దురాత్ములే పరాభవము పొందిరనియు ఒక ఇతిహాసము ఉంది.ఇతని శిష్యులలో ఉరిలింగ పెద్దియు నొక ఉజ్జ్వల శివశరణుడు, ఉత్తమ వచన కర్త.
శివలెంక మంచన కర్ణాటక, మహారాష్ట్ర, సంస్కృత, ఆంధ్ర భాషలయందు పండితుడై, శివానుభావజ్ఞాన సంపన్నుడై, లింగ భోగభోగులై, లింగాంగ సామరస్యానుభావుడై కన్నడ భాషలో తాను వ్రాసిన వచనములు ఇప్పటికీ ప్రసిద్ధములై ఉన్నాయి.
లింగనామాత్యుడు
మార్చుపర్వతరాజు లింగనామత్యుడు శ్రీవత్స గోత్రజుడు. పండితారాధ్య శ్రీపాదాబ్జభృంగ అని చెప్పుటచే పండితారాధ్యుడు ఈతని గురువు అని తెల్యుచున్నది. పండితారాధ్యుని కాలము సా.శ..1170-72 అని పెక్కుమంది అభిప్రాయము. లింగనామాత్యుడు వ్రాసిన వీరశైవ గ్రంథము వీరమాహేశ్వరాచార సంగ్రహం.ఇది ద్విపదలో వ్రాయబడింది.ఇందులో తాళ పత్రములు 4 ఆశ్వాసముల వరకే లభించినవి. మొత్తంగా 8 ఆశ్వాసములు ఉండవచ్చునని పండితుల అభిప్రాయము. వీర శైవము లోని సంప్రదాయములలో మొదటిది జంగమ సంప్రదాయము. రెండవది ఆరాధ్య సంప్రదాయము. ఆరాధ్య సంప్రదాయమునకు మూల పురుషుడు పండితారాధ్యుడు. శివాగమములయందు స్థూల దృష్టితో సామాన్య, మిశ్ర, శుద్ధ, వీరశైవ అను నాలుగు విభాగములను, మరికొన్నింటిలో శైవ, పూర్వశైవ, మిశ్రశైవ, శుద్ధశైవ, శ్రౌతశైవ, మార్గశైవ, నిరాభార వీరశైవ అనెడి 10 భేదములు ఉన్నాయి. భస్మ, రుద్రాక్ష ధారణాది చిహ్నములు శివభక్తులకు విహితమైనవి. గురుదత్తమైన భస్మమును ధరించుట, శివలింగ మెచత కనబదినను ప్రదక్షిణ ప్రణామము ఆచరించుట శైవ లక్షణము. ఆణవ, కార్మిక, మాయామలము లను, దీక్షలచే మొనర్చి భౌతిక శరీరమును లింగ శరీరముగ చేసి ప్రాసాధించిన లింగమును కంఠమున గాని, భుజమునగాని, వక్షమునగాని ధరించుట, అర్చించుట పంచాక్షరీ మంత్రమునే మననము చేయుట, వర్ణాశ్రమ ధర్మముము ఆవ్యవస్థను లేదనుట వీరశైవ భక్తులు పాటించుదురు. లింగనామాత్యుడు కూడా తన కృతియందు లింగమహాత్మ్యమును పంచాక్షరీ మంత్ర మహాత్మ్యమును వివరించుచు తామస ప్రవృత్తిని ప్రదర్సించి ఉండుటచే వీరశైవుడని అంటారు. పండితారాధ్యుడు శిష్యుడు కావుట వలన ఇది ఇంకను రూఢి అయినది.
లోకములు, వార్ధులు, శైలములు, వృక్షములు, దేవతలు, దానవులు, యోగీంద్రులు, గరుధ, ఖేచర, యక్ష, గంధర్వ సిద్ధవరులు, విద్యాధరులు, కిన్నరలు పశుపక్షి మృగ దైత్య పన్నగులు రుద్ర స్వరూపమునే రూపింతురు. దేహమే చంద్రధరుని మందిరము. ప్రాణమే-శివుడు- అని చెప్పి లింగన తన వీరశైవత్వమును చాటెను.
పంచాక్షరితో సమానమైన మంత్రము లేదు. శివునిబోలు దైవము, గౌరిని బోలు వైదువలు, గంగతో సమానమైన నదులు, సాగరను బోలు సరసులు, మేరునగమునుబోలు పర్వతములు, వారణాసికి సరివచ్చు తీర్ధములు, శంకరుని భక్తికి సమానమైన భక్తి ఇంక లేవట. సకలవేదశాస్త్రాగమ పురాణముల సారంశమే పంచాక్షరీ మంత్రము. పంచమహాఘోర మహాపాపములాచరించినను జగత్రయమునే సంహరించినను పంచాక్షరీ మంత్ర దివ్య ప్రభావముచే విముక్తి కలుగునని వీరశైవుల నమ్మకము. దానినే లింగన వక్కాణించాడు కూడా!
మూలములు
మార్చు- 1969 భారతి మాస పత్రిక- వ్యాసము :వీరమాహేశ్వరాచారము.