వీరకంకణం

(వీర కంకణం నుండి దారిమార్పు చెందింది)

వీరకంకణం 1957, మే 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. మోడరన్ థియేటర్స్ పతాకంపై 1950లో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మంత్రి కుమారి’ని 1957లో ‘వీరకంకణం’గా తెలుగులో టి.ఆర్.సుందరం నిర్మించారు. ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, జమున, రేలంగి, గిరిజ, రమాదేవి, పేకేటి శివరాం, ఇ.వి.సరోజ, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు లు నటించారు.[1]

వీరకంకణం
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.ఆర్.రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
కృష్ణకుమారి
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ మోడరన్ థియేటర్స్
భాష తెలుగు

కథ సవరించు

మల్లె దేశపు మహారాజు వెంగళరాయ దేవుడు (రమణారెడ్డి) ఆ దేశానికి మంత్రి సత్యకీర్తి (కె.వి.ఎస్.శర్మ), రాజగురువు (గుమ్మడి)లపై ఆధారపడి పరిపాలన చేస్తుంటాడు. రాకుమారి రజని (కృష్ణకుమారి), మంత్రి కుమార్తె పార్వతి (జమున) స్నేహితులు. సేనాపతి వీరమోహన్ (ఎన్.టి.రామారావు). వీరమోహన్, రజని ప్రేమించుకుంటారు. వీరమోహన్ చేతిలో భంగపడిన రాజగురువు కుమారుడు చంద్రసేనుడు (జగ్గయ్య) రాజ్యం చివర కొండల్లో చేరి బందిపోటు దొంగతనాలు చేస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు. రాకుమారిపై ఆశపడి, మంత్రి కుమారిని ప్రేమించినట్లు వంచిస్తాడు. సేనాని వీరమోహన్ చేతిలో బంధింపబడి, మరణశిక్షకు బలి అవుతున్న చంద్రసేనుని పార్వతి అబద్ధపు సాక్ష్యంతో రక్షిస్తుంది. వీరమోహన్ రాజ్యబహిష్కరణకు గురవుతాడు. రాకుమారి అతని వెంటే వెళుతుంది. చంద్రసేనుని పెళ్లాడిన పార్వతి, పెళ్లి తరువాత అతడు మారతాడని ఆశిస్తుంది. కాని చంద్రసేనుడు రజనిని బంధించి వశం చేసుకోబోగా, మారువేషంలో వెళ్లి అతన్ని ఎదిరించి, రాకుమారిని రక్షిస్తుంది. పార్వతిని అంతం చేయాలనుకుని, కుట్రతో చంద్రసేనుడు మలయ పర్వతాలకు తీసుకువెళతాడు. అతని, అతని తండ్రియొక్క కుట్రను తెలుసుకున్న పార్వతి, తెలివిగా చంద్రసేనుడి పర్వతంపైనుంచి త్రోసివేస్తుంది. రాకుమారి కోసం, అంతఃపురం ప్రవేశించి శిక్షకు గురవుతున్న వీరమోహన్‌ను విడిపించి మహారాజుకు సభాసదులకు చంద్రసేనుడు, రాజగురువుల కుట్రను వెల్లడిస్తుంది.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

 • కథ, మాటలు, పాటలు- ఆరుద్ర
 • కూర్పు- యల్. బాలు
 • ఫొటోగ్రఫి- జి.ఆర్. నందన్
 • సంగీతం- సుసర్ల దక్షిణామూర్తి
 • పోరాటాలు- ఫంటు, సోము
 • నృత్యం- వి.పి.బలరాం, ఎ.కె.చోప్రా, చిన్ని సంపత్
 • కళ- ఎ.జె.డొమ్మిక్, సి.కె.జాన్
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఆర్.రావు

పాటలు సవరించు

 1. కట్టండి వీర కంకణం, కంకణం - ఎ.ఎం.రాజా, జిక్కి బృందం
 2. అంతా బలే రాంచిలకా - పిఠాపురం నాగేశ్వరరావు బృందం
 3. అందాల రాణి ఎందుకోగాని - ఎ.ఎం.రాజా, రావు బాలసరస్వతీ దేవి
 4. ఇంటికి పోతాను నేను ఇకపై రాను - స్వర్ణలత, పిఠాపురం
 5. సిగ్గులు చిగురించెనే బుగ్గలు ఎరుపెక్కెనే - రావు బాలసరస్వతీ దే
 6. ఇక వాయించకోరుూ మురళీ - పి.లీల బృందం
 7. సొగసరి కులుకు సొంపారు బెళుకు - జిక్కి
 8. ఆత్మబలి చేసినావు - పి.లీల
 9. తేలి తేలి నా మనసు తెలియకనే - ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, రచన: ఆరుద్ర
 10. రావే రావే పోవు స్థలం మతి చేరువయే - ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, రచన: ఆరుద్ర

మూలాలు సవరించు

 1. ఆంధ్రభూమి, ఫ్లాష్ బ్యాక్ @ 50 (1 April 2018). "వీరకంకణం". సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి. Archived from the original on 4 జూన్ 2018. Retrieved 16 May 2018.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వీరకంకణం&oldid=3963905" నుండి వెలికితీశారు