వృక్ష రేఖాగణితం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వృక్ష రేఖాగణితంను ఇంగ్లీషులో డెండ్రోమెట్రీ (Dendrometry) అంటారు. వృక్షశాస్త్రంలో ఇది ఒక శాఖ. ఈ వృక్ష రేఖాగణితం చెట్టు యొక్క విభిన్న కొలతలను అనగా చెట్టు యొక్క అడ్డుకొలత, పరిమాణం, రూపం, వయసు, మొత్తం విలువ, బెండు యొక్క మందం ఇంకా తదితర వివరాలను ఒక పట్టిక రూపంలో తయారు చేస్తుంది. ఒక చెట్టు ప్రతి సంవత్సరం ఎంత ఎత్తు పెరుగుతుందో ఏ వయసులో ఎంత ఎత్తు పెరిగిందో మాను లోపల చెక్క ఏ విధంగా మార్పులు చెందుతుందో ప్రతిది విశదంగా పరిశీలించి చెట్టు గుణగణాలను దాని వైఖరిని జరిగిన మార్పులను ఈ వృక్ష రేఖాగణితం తెలియజేస్తుంది.
తరచుగా వృక్షం నుండి సంపాదించే కొలతలు ముఖ్యమైనవి, అవసరమైనవి.
- ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత Diameter at Breast Height (DBH)
- చెట్టు యొక్క ఎత్తు
- భూమికి సమాంతరంగా అడ్డంగా పెరిగే చెట్టు కొమ్మల వివిధ కొలతలు