వృశ్చికరాశి వారి గుణగణాలు

మార్చు

వృశ్చికరాశి వారుల్క్క్ల్క్ల్జ్గ్గ్ రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సెకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితములో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒక సారి మార్చుకునే మనస్తత్వము వీరికి లేదు. జీవితములో మంచి స్థితికి రావడానికి ఇది కారణము ఔతుంది. జీవితములో ఎదగక పోవడానికి ఇదే కారణము. మంచితనము, పట్టుదల అధికముగా ఉండడానికి ఇదే కారణము. వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితములో మంచికి దారి తీస్తాయి. సహోదర, సహోదరీ వర్గము ఎదుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరిపట్ల చుపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు ఔతారు. బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితములో మంచి మలుపుకు దారి తీస్తాయి. మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచి పోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడము వలన జీవితములో చక్కని మలుపుకు దారి తీస్తాయి. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవిత కాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ్ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారణముగా అభివృద్ధి కుంటువడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజాసంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులవుతో వైరము, స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్యపెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చెయ్యడము నష్టాన్ని కలిగిస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ విషయము ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబసభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగి పోతుంది.

వృశ్చికరాశి కొన్ని జ్యోతిష విషయాలు

మార్చు

రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది. ఈ రాశి రాశ్యధిపతి కుజుడు. ఈ రాశి సమ రాశి, శుభరాశి, స్త్రీరాశి, సరి రాశి, స్త్రీరాశి, స్థిర స్వభావరాశి, జలరాశి, కీటకరాశిగాను వ్యవహరిస్తారు. తత్వం జలతత్వం, సమయం పగటి సమయం, శబ్దం నిశ్శబ్దం, పరిమాణం దీర్ఘం, జాతి బ్రాహ్మణ, జీవులు కీటకములు, దిక్కు ఉత్తర దిక్కు, పాద జలతత్వం, సంతానం అధికం, ప్రకృతి కఫం, కాలపురుషుని శరీరాంగం మర్మ స్థానం, వర్ణం బంగారు వర్ణం. ఈ రాశిలో చంద్రుడు నీచను పొందుతాడు.

  • ఈ రాశి 210 డిగ్రీల నుండి 240 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది.
  • ఈ రాశిలో 3వ డిగ్రీలో చంద్రుడు నీఛను పొందుతాడు.
  • నిరయన రవి ఈరాశిలో నవంబరు పదిహేనున ప్రవేశిస్తాడు.
  • ఈ రాశి విద్యుత్ కేంద్రాలు, శ్మశానాలు, ఇంటిలోని ఖాళీ ప్రాంతములను సూచిస్తుంది. విషము, విముతో కూడిన మందులు, పాములు పట్టువారి సూచిస్తుంది.
  • ఈ రాశి వేరుశనగ, దుంపకూరలు లాంటి భూ అంతర్భాగాన పండే పంటలను సూచిస్తుంది.
  • పాములు, పుట్టలు, విషకీటకములు,
  • ఈ రాశి గుణగణాలు తగాదాలకు సంసిద్ధత, కోపము, గూఢమైన కార్యాచరణ, పరస్త్రీ వ్యామోహం, ఇతరులను ద్వేషించుట, ఇతరుల కార్యములను చెడగొట్టుట, ధైర్యము కల వారుగా ఉంటారు. వీరిని సంతోషపెట్టుట కష్టం.
  • ఈ రాశి వారికి మూడు, అయిదు, పదిహేను, ఇరవై అయిదు సంవత్సరాలలో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.
  • ఈ రాశి వారికి సుఖరోగములు, తెల్లపు విడుదల, మూలశంఖ, మూత్రకోశంలో రాళ్ళు, విషప్రయోగము వలన కలుగు వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు.
  • ఈ రాశికి సంబంధించిన ప్రదేశాలు జాతీయంగా భువనేశ్వర్, చల్ బాస, బంకురా, ధన్ బాద్, దేవ్ ఘర్, హజరిబా, గయ, జహానా బాద్, జెంషెడ్ పూర్, కటక్, కోణార్క, ఖాగల్ పూర్, ఖగారియా, మేదినీ పూర్, ముజఫర్ పూర్, మహాజనీ, నవాడ్, పాట్నా, పురోలియా, పూరి, రూర్కెలా, రాంఛి మొదలైన ప్రదేశాలను సూచిస్తుంది.
  • ఈ రాశి అంతర్జాతీయంగా అల్జీరియా, బార్బరీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, జుడేయా, లిబియా, మారిటానియా, మొరాకో, మెస్సినా, నార్వే, సార్డీనియా మొదలైన ప్రదేశాలను సూచిస్తుంది.

వనరులు

మార్చు