వెంకటాపురం 2017 సినిమా
(వెంకటాపురం (2017 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
వెంకటాపురం 2017లో విడుదలైన తెలుగు సినిమా. గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ బ్యానర్‌పై తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకత్వం వహించాడు. రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 12 మే 2017న విడుదలైంది.[1]
వెంకటాపురం | |
---|---|
దర్శకత్వం | వేణు మదికంటి |
నిర్మాత | తూము ఫణికుమార్ శ్రేయస్ శ్రీనివాస్ |
తారాగణం | రాహుల్ మహిమా అజయ్ ఘోష్ |
ఛాయాగ్రహణం | సాయిప్రకాష్ ఉమ్మడిసింగు |
కూర్పు | మధు |
సంగీతం | అచ్చు |
నిర్మాణ సంస్థలు | గుడ్ సినిమా గ్రూప్ బాహుమన్య ఆర్ట్స్ |
విడుదల తేదీ | 12 మే 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుపిజ్జా షాప్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే ఆనంద్(రాహుల్) తన అపార్ట్మెంట్ కు కొత్తగా వచ్చిన చైత్ర (మహిమా మక్వాన్)తో ప్రేమలో పడతాడు. ఆనంద్ జీవితంలోకి వచ్చిన చైత్ర హత్యకు గురవుతుంది. వీరిద్దరి జీవితంలో అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఏమిటి ? చైత్రను హత్య చేసిందెవరు ? ఈ మర్డర్ మిస్టరీ ని పోలీస్ ఆఫీసర్ అజయ్ (అజయ్) ఎలా ఛేదించాడు ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- రాహుల్
- మహిమా మక్వానా
- అజయ్ ఘోష్
- అజయ్ కుమార్
- కాశి విశ్వనాధ్
- జోగి నాయుడు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్
- నిర్మాతలు: తూము ఫణికుమార్, శ్రేయస్ శ్రీనివాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మదికంటి
- సంగీతం: అచ్చు
- సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
- ఎడిటర్: మధు
- ఫైట్స్: రియల్ సతీష్
- కోరియోగ్రఫీ: విగ్నేశ్వర్
- ఆర్ట్ డైరెక్టర్: మోహన్
పాటలు
మార్చుపాట | గాయకులు | రచయిత |
---|---|---|
ఎగిరే | కేక ఘోషల్, యజిన్ నిజార్ | వనమాలి |
ఓ మాయ | బెన్నీ దయాల్ | అనంత శ్రీరామ్ |
కొక్కొరొకో | సత్య యామిని, శృతి, రఘురాం, శ్రీ కృష్ణ, దీపు | అనంత శ్రీరామ్ |
తానెవరో | అచ్చు | అనంత శ్రీరామ్ |
కాలం | ధనుంజయ్, సాయి శిల్ప | అనంత శ్రీరామ్ |
తానెవరో | విజయ్ ఏసుదాస్ | అనంత శ్రీరామ్ |
మూలాలు
మార్చు- ↑ Telugu Great Andhra. "సినిమా రివ్యూ: వెంకటాపురం". telugu.greatandhra.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
- ↑ The Hindu (12 May 2017). "Venkatapuram: A dish served cold" (in Indian English). Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.