వెంకటాపురం 2017 సినిమా

వెంకటాపురం 2017లో విడుదలైన తెలుగు సినిమా. గుడ్‌ సినిమా గ్రూప్‌, బాహుమన్య ఆర్ట్స్‌ బ్యాన‌ర్‌పై తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకత్వం వహించాడు. రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 12 మే 2017న విడుదలైంది.[1]

వెంకటాపురం
దర్శకత్వంవేణు మదికంటి
నిర్మాతతూము ఫణికుమార్‌
శ్రేయస్‌ శ్రీనివాస్‌
తారాగణంరాహుల్
మహిమా
అజయ్ ఘోష్
ఛాయాగ్రహణంసాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు
కూర్పుమధు
సంగీతంఅచ్చు
నిర్మాణ
సంస్థలు
గుడ్‌ సినిమా గ్రూప్‌
బాహుమన్య ఆర్ట్స్‌
విడుదల తేదీ
12 మే 2017 (2017-05-12)
దేశం భారతదేశం
భాషతెలుగు

పిజ్జా షాప్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే ఆనంద్(రాహుల్) తన అపార్ట్మెంట్ కు కొత్తగా వచ్చిన చైత్ర (మహిమా మక్వాన్)తో ప్రేమలో పడతాడు. ఆనంద్ జీవితంలోకి వచ్చిన చైత్ర హత్యకు గురవుతుంది. వీరిద్దరి జీవితంలో అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఏమిటి ? చైత్రను హత్య చేసిందెవరు ? ఈ మర్డర్ మిస్టరీ ని పోలీస్ ఆఫీసర్ అజయ్ (అజయ్) ఎలా ఛేదించాడు ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్లు: గుడ్‌ సినిమా గ్రూప్‌, బాహుమన్య ఆర్ట్స్‌
  • నిర్మాతలు: తూము ఫణికుమార్‌, శ్రేయస్‌ శ్రీనివాస్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మదికంటి
  • సంగీతం: అచ్చు
  • సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు
  • ఎడిటర్: మధు
  • ఫైట్స్: రియల్ సతీష్
  • కోరియోగ్రఫీ: విగ్నేశ్వర్
  • ఆర్ట్ డైరెక్టర్: మోహన్

పాటలు

మార్చు
పాట గాయకులు రచయిత
ఎగిరే కేక ఘోషల్, యజిన్ నిజార్ వనమాలి
ఓ మాయ బెన్నీ దయాల్ అనంత శ్రీరామ్
కొక్కొరొకో సత్య యామిని, శృతి, రఘురాం, శ్రీ కృష్ణ, దీపు అనంత శ్రీరామ్
తానెవరో అచ్చు అనంత శ్రీరామ్
కాలం ధనుంజయ్, సాయి శిల్ప అనంత శ్రీరామ్
తానెవరో విజయ్ ఏసుదాస్ అనంత శ్రీరామ్

మూలాలు

మార్చు
  1. Telugu Great Andhra. "సినిమా రివ్యూ: వెంకటాపురం". telugu.greatandhra.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  2. The Hindu (12 May 2017). "Venkatapuram: A dish served cold" (in Indian English). Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.

బయటి లింకులు

మార్చు