వెంకటేశ్ అయ్యర్

వెంకటేశ్‌ అయ్యర్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం తరపున ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్‌ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఆయన న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు.[4] వెంకటేశ్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఐపీఎల్‌-2022 వేలంలో కేకేఆర్‌ ఫ్రాంఛైజీ రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది.[5] ఆయన 2022 జనవరిలో దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యాడు.[6]

వెంకటేశ్ అయ్యర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెంకటేష్ రాజశేఖరన్ అయ్యర్
పుట్టిన తేదీ (1994-12-25) 1994 డిసెంబరు 25 (వయసు 30)
ఇండోర్, మధ్య ప్రదేశ్, భారతదేశం
ఎత్తు6 ఫీట్ 4 ఇంచ్[1][2]
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగుకుడిచేతి వాటం మీడియం బౌలర్‌
పాత్రఆల్‌రౌండర్‌
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 93)2021 17 నవంబర్ [3] - న్యూజిలాండ్‌ తో
చివరి T20I2021 21 నవంబర్ - న్యూజిలాండ్‌ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015 - ప్రస్తుతంమధ్య ప్రదేశ్
2021కోల్‌కతా నైట్‌రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ అంతర్జాతీయ టీ20 ఫస్ట్ లిస్ట్ ఎ దేశవాళీ టీ20
మ్యాచ్‌లు 3 10 27 56
చేసిన పరుగులు 36 545 1046 1285
బ్యాటింగు సగటు 18.00 36.33 49.80 37.79
100లు/50లు 0/0 0/6 3/4 0/7
అత్యుత్తమ స్కోరు 20 93 198 88 నాట్ అవుట్*
వేసిన బంతులు 18 786 525 624
వికెట్లు 1 7 16 30
బౌలింగు సగటు 12.00 48.57 30.43 23.63
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/12 3/46 3/55 2/2
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 16/– 25/–
మూలం: Cricinfo, 12 డిసెంబర్ 2021

క్రీడా జీవితం

మార్చు

వెంకటేశ్‌ అయ్యర్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం తరపున దేశవాళీ క్రికెట్‌లో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 2021 మార్చిలో లిస్ట్ -ఏ క్రికెట్ లో భాగంగా మధ్యప్రదేశ్, పంజాబ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో 146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 198 పరుగులు చేసి లిస్ట్ -ఏ కెరీర్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న 197 పరుగుల రికార్డును చెరిపేశాడు.[7] ఆయన ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్‌ - 2021లో 10 మ్యాచ్‌లలో నాలుగు అర్ధ సెంచరీలు నమోదు చేసి మొత్తం 370 పరుగులు చేసి ఐపీఎల్‌ ముగిసిన తర్వాత శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌కు, న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు, 2022లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికయ్యాడు.[8][9]

వెంకటేశ్‌ అయ్యర్‌ పలు ఉత్తమ ప్రదర్శనలు

మార్చు
  • ఐపీఎల్‌ 2021 సీజన్‌: 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు, 3 వికెట్లు
  • సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ: 5 మ్యాచ్‌లు 155 పరుగులు.. 5 వికెట్లు
  • ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ టి20 సిరీస్‌: 3 మ్యాచ్‌ల్లో 36 పరుగులు.. 1 వికెట్‌
  • విజయ్‌ హజారే ట్రోఫీ: ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 348 పరుగులు.. 6 వికెట్లు

వివాహం

మార్చు

వెంకటేశ్ అయ్యర్ 2024 జూన్ 2న శ్రుతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్నాడు.[10][11]

మూలాలు

మార్చు
  1. "A studious rise: the making of Venkatesh Iyer". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 14 November 2021.
  2. Acharya, Shayan (10 November 2021). "Venkatesh Iyer 'not setting any targets' after India call-up". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 14 November 2021.
  3. 10TV (17 November 2021). "టీమిండియా బౌలింగ్, వెంకటేశ్ అయ్యర్ ఎంట్రీ" (in telugu). Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Eenadu (11 November 2021). "ఈ రోజు నా కల నిజమైంది వెంకటేశ్‌ అయ్యర్‌". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  5. TV9 Telugu (1 December 2021). "గతంలో 20 లక్షలు..ఇప్పుడు 8 కోట్లు.. ఐపీఎల్‌ రిటెన్షన్‌లో జాక్‌పాట్‌ కొట్టిన వెంకటేష్‌ అయ్యర్‌." Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. V6 Velugu (15 January 2022). "సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా జట్టు" (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2022. Retrieved 16 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. TV9 Telugu (2 March 2021). "దుమ్మురేపిన డొమెస్టిక్ ప్లేయర్.. వార్నర్ రికార్డు బ్రేక్.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్..!". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Sakshi (12 December 2021). "దక్షిణాఫ్రికా టూర్‌కు వన్డే జట్టులోకి వెంకటేశ్‌ అయ్యర్‌!". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  9. Prajasakti (2 January 2022). "నా దృష్టి అంతా దక్షిణాఫ్రికా పర్యటనపైనే : వెంకటేశ్‌ అయ్యర్‌". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  10. EENADU (2 June 2024). "ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ వెంకటేశ్‌ అయ్యర్". Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
  11. V6 Velugu (2 June 2024). "పెళ్లి చేసుకున్న క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్.. ఎవరీ శ్రుతి రంగనాథన్..?". Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024. {{cite news}}: zero width space character in |title= at position 36 (help)CS1 maint: numeric names: authors list (link)