వెలి

(వెలివేయటం నుండి దారిమార్పు చెందింది)

కులపెద్దలు చెప్పినట్లు వినలేదని కులంలోంచి వెలివెయ్యటం. సంఘబహిష్కారం చెయ్యటం. వెలిబడ్డ వాళ్ళతో మాట్లడకపోవటం, సహాయనిరాకరణ.కొన్ని గ్రామాలలో కుటుంబాలను వెలివేయడం సర్వసాధారణం.. కులపెద్దల ఆగ డాలను ప్రశ్నిస్తే ఎవరికైనా అదే గతి. నలుగురు కుల పెద్దలు చెప్పిందే వేదం. వారిలో సారాయి, కోడిపందేలు, పేకాటలు కూడా గ్రామంలో కలహాలకు, కలుషిత వాతావరణానికి దో హదం చేస్తున్నాయి.కుల పెద్దలు ఏదైనా విషయంపై తమతో ఏకీభవించనివారిని, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పని వారిని, వెలివేయబడిన వారిశుభకార్యానికి వెళ్ళినవారిని, పోటిదారులకు వచ్చేలాభాన్ని తామే కాజేయాలనే దురాలోచనతో కులపెద్దలు వెలివేస్తారు.వెలి ఒక అనైతిక చర్య .హుకుం జారీ చేసే కులపెద్దల అహంకారానికి నిదర్శనం.వెలివేసిన కుటుంబాలను ఆహ్వానిస్తే తాము రామంటూ కులపె ద్దలు వాదనకు దిగుతారు.తమ మాటలు పెడచె విన పెట్టారంటూ కక్ష కట్టిన కుల పెద్దలు గ్రామస్థులు ఎవరూ హాజరు కాకుండా మూర్కంగా అడ్డుకొంటారు.సభ్య సమాజం తలదించుకునేలా కులపెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించే విపరీత ధోరణి వెలి.జరిమానాగా వెలివేయబడినవారు తప్పు కట్టి తిరిగి కులంలో చేరుతారు.కట్టించుకున్న తప్పు మొత్తంతో తాగి తందనాలాడి కులపెద్దలు జల్సా చేస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=వెలి&oldid=2951640" నుండి వెలికితీశారు