వెల్లూవా కోరోత్ విస్మయ

భారతీయ క్రీడాకారిణి

వెల్లూవా కోరోత్ విస్మయ (జననం 14 మే 1997) 400 మీటర్ల స్ప్రింట్‌లో నైపుణ్యం కలిగిన భారతీయ క్రీడాకారిణి. 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన భారత మహిళల 4 × 400 మీటర్ల రిలే జట్టులో ఆమె పాల్గొన్నారు.  2019 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 4 x 400 మీటర్ల రిలేలో రజతం, మిశ్రమ 4 x 400 మీటర్ల రిలేలో రజతం గెలుచుకుంది. దోహాలో జరిగిన 2019 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో విస్మయ భారత మిక్స్‌డ్ రిలే జట్టులో భాగంగా ఉన్నారు. ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించి 2021 లో చోటు దక్కించుకుంది. 2019 అక్టోబర్‌లో జరిగిన 59 వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్లలో బంగారు పతకం సాధించింది.[2]

వి. కె. విస్మయ
వ్యక్తిగత సమాచారము
పూర్తిపేరువెల్లూవా కోరోత్ విస్మయ
జననం (1997-05-14) 1997 మే 14 (వయసు 27)
శ్రీకందపురం, కన్నూర్ జిల్లా, కేరళ [1]
క్రీడ
దేశం భారతదేశం
క్రీడట్రాక్ అండ్ ఫీల్డ్
సంఘటన(లు)400 మీటర్లు
విజయాలు, బిరుదులు
వ్యక్తిగత ఉత్తమ విజయాలు
400 m - 52.12 (2019)

వ్యక్తిగత జీవితం

మార్చు

వికె విస్మయ 1997 లో కేరళలోని కన్నూర్ జిల్లాలో జన్మించింది. ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు ఆమె ఇంజనీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  కానీ ఆమె అథ్లెట్‌గా శిక్షణ పొందుతున్న తన సోదరి విజిషా అడుగుజాడల్లోకి వెళ్లి అథ్లెటిక్స్ వైపు వెళ్లారు.

సెయింట్ జార్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్ కోతమంగళంలో 11 వ తరగతి (2013) చదువుతున్నప్పుడు, సౌత్ జోన్ పాఠశాల టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించారు. చదువులో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించే విస్మయకు అగ్రశ్రేణి అథ్లెట్లను తయారు చేస్తుందన్న పేరున్న అజంప్షన్ కాలేజీలో సీటు ఖాయమయ్యింది. విస్మయ 2014 లో తన రాష్ట్ర స్థాయిలో రెండు రజత పతకాలు సాధించినప్పటికీ,ఆ క్రీడను తన కెరియర్‌గా కొనసాగించాలని అనుకోలేదు. తన భవిష్యత్తు విషయంలో డోలయామానంలో పడింది. కానీ అజంప్షన్ కాలేజీలో స్పోర్ట్స్ డైరక్టర్ అలాగే ఆమె కోచ్‌లు ఆమె అథ్లెటిక్స్‌ను తన కెరియర్‌గా ఎంచుకోవడంలో ఒప్పించారు. విస్మయ తండ్రి ఎలక్ట్రీషియన్, ఆమె తల్లి హౌస్ మేనేజర్.  వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. తన కెరియర్‌ను ఎంపిక చేసుకునే సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకున్న విస్మయ ఇంజనీరింగ్‌ను వదులుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించింది. అథ్లెటిక్స్‌నే తమ భవిష్యత్తుగా ఎంపిక చేసుకున్న తమ ఇద్దరు బిడ్డలకు మద్దతు ఇవ్వడం అంత సులభం కానప్పటికీ వారి తల్లిదండ్రులు మాత్రం ఎక్కడా వెనకడగుకు వేయలేదు. మనస్పూర్తిగా ఇద్దరికీ మద్దతిచ్చారు.విస్మయ తన కెరియర్‌ను హర్డిల్ స్ప్రింటర్‌గా ప్రారంభించినప్పటికీ , గాయం కారణంగా ఆమె తన ట్రాక్‌ను మార్చుకోవాల్సి వచ్చింది,  ఆపై  మిడిల్-డిస్టెన్స్ రన్నర్‌గా శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. తాను చదువుకునే పాఠశాలలో సింథటిక్  ట్రాక్‌లు, అత్యాధునిక జిమ్ సౌకర్యాలు లేవు. వర్షాకాలంలో వస్తే బురదలోనే శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది.[3]

వృత్తిపరమైన విజయాలు

మార్చు

ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ ఛాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి 200 మీటర్ల రేసులో బంగారు పతకం సాధించిన వికె విస్మయ జీవితంలో 2018లో మలుపు తిరిగింది. అక్కడ ఆమె 400 మీటర్లలో విభాగంలో కూడా రజత పతకాన్ని కూడా గెలుచుకుంది.[2] అప్పటి నుంచి ప్రజలు ఆమెను గుర్తించడం ప్రారంభిం. ఇంటర్ యూనివర్శిటీ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పతకాలు సాధించిన తరువాత, ఆమె జాతీయ శిబిరానికి ఎంపికయ్యింది.  అక్కడ ఆమెకు అత్యంత ఆధునిక శిక్షణా సదుపాయాలు అలాగే అత్యుత్తమ కోచ్‌ల మద్దతు లభించింది. జకార్తాలో 2018లో జరిగిన ఆసియా క్రీడలు ఆమె కెరియర్‌ను మలుపు తిప్పాయని చెప్పవచ్చు. 4X400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టులో ఆమె కూడా సభ్యురాలు. విస్మయ, ముహమ్మద్ అనాస్, నోహ్ నిర్మల్ టామ్ , జిస్నా మాథ్యూలతో కలసి  4 × 400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో పోటీ పడ్డారు. దోహాలో జరిగిన 2019 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, వారు ఫైనల్‌కు అర్హత సాధించి 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకుంది. ఆ తరువాత 2019లో చెక్ రిపబ్లిక్‌లో జరిగిన అథ్లెటిక్ మీటింగ్‌లో 400 మీటర్ల రేసును కేవలం 52.12 సెకెన్లలోనే పూర్తి చేసి స్వర్ణం సాధించింది.[4]

మూలాలు

మార్చు
  1. "VELLUVA KOROTH Vismaya". Asian Games 2018 Jakarta Palembang. Archived from the original on 31 ఆగస్టు 2018. Retrieved 30 August 2018.
  2. 2.0 2.1 "What A Run! Indian Sprinter VK Vismaya Wins 400m Gold In Czech Republic". IndiaTimes (in Indian English). 2019-08-29. Retrieved 2021-02-20.
  3. "Interview: VK Vismaya, accidental runner who held off a world champ to seal 4X400 Asian Games relay gold". The New Indian Express. Retrieved 2021-02-20.
  4. "Vismaya wins gold with new personal best in Czech Republic". The Indian Express (in ఇంగ్లీష్). 2019-08-28. Retrieved 2021-02-20.