వేగె నాగేశ్వరరావు
వేగె నాగేశ్వరరావు (ఆంగ్లం: Vege Nageswara Rao) (ఫిబ్రవరి 27, 1932 - 1997) సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
వీరు కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా (ప్రస్తుతం ఉంగుటూరు మండలం) పెద్ద అవుటపల్లి గ్రామంలో వేగె తాతయ్య, వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తిచేసి గన్నవరం హైస్కూలులో చదివారు. ఇటలీలోని పాదువా యూనివర్సిటీలో మెడిసిన్ అండ్ సర్జరీలో ఎం.డి. చేశారు.
వీరు విదేశాలలో మంచి కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బహుభాషా వైదుష్యంతో ఇంగ్లీషు, ఇటాలియన్ భాషలలో చదువరుల హృదయాలకు హత్తుకునే ఎన్నో చక్కని కవితా కళాఖండాలను సృష్టించారు. వీరి రచనలు న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురితమై యూరోపియన్ పాఠకులకు పరిచయమయ్యారు. వీరి 'పీస్ అండ్ లవ్' అనే ఆంగ్ల పద్యాల పుస్తకానికి బెర్ట్రాండ్ రస్సెల్ ముందు మాటగా కవితల్ని ప్రశంశించాడు.
వీరు 1997లో స్విట్జర్లాండులో గుండె పోటుతో పరమపదించారు.
రచనలు
మార్చు- Pace e Vita (1963)
- Life and Love (1965)
- Santi Priya (1966)
- The Light of Ashoka (1970)
- Peace and Love (1981)
- Templi Trascurati (1983)
- The Best of Vege (1992)
- 100 Opinions of Great Men on Life (1992)
మూలాలు
మార్చు- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.