వేణువై వచ్చాను భువనానికి
వేణువై వచ్చాను భువనానికి అనే ఈ పాట 1993 లో వచ్చిన మాతృదేవోభవ అనే చిత్రంలోనిది. వేదాంత ధోరణిలో సాగే ఈ పాటని వేటూరి సుందరరామ్మూర్తి గారు అత్యద్భుతంగా రచించారు. ఈ పాటకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది కె. ఎస్. చిత్ర, సంగీతం అందించింది ఎం. ఎం. కీరవాణి. ఈ సినిమా తెలియని వాళ్లు ఉండరు. అప్పట్లో ఒక సంచలన చిత్రంగా నిలిచింది ఈ సినిమా. నాజర్, మాధవి జంటగా నటించారు. మాధవి నటనకి పరాకాష్ట ఈ సినిమా. ఎంతో ఆవేదనను అనుభవించే పాత్రలో మాధవి ఇమిడిపోయి నటించి ప్రేక్షకుల చేత కన్నీటి వరదలు పారించింది ఈ సినిమాలో. ఒక కుటుంబం లోని అనుబంధాలు, బాధలు, విధి వారితో ఆడుకునే కథే ఈ సినిమా. ఈ సినిమా చూసి ఏడుపు రాని వారు ఉంటే వారికి కన్నీటి గ్రంధులు పని చేయనట్టే.. అని అనుకోవచ్చు.
పాట నేపథ్యంసవరించు
ఈ సినిమాలో ఈ పాట ఏ సన్నివేశం లో వస్తుందంటే... సంగీత ఉపాధ్యాయురాలయిన మాధవి, పిల్లలకి అన్నమాచార్య గీతాల్ని గురించి వివరిస్తుంది. భక్తి, రక్తి, ముక్తి, విరక్తి అన్నీటినీ తన కీర్తనలలో నింపిన అన్నమాచార్య తన ఆఖరి రోజుల్లో వేదనతో స్వామికి ఇలా విన్నవించుకున్నారట. "స్వామీ.. బ్రతుకు సంధ్యలోకి మళ్లిపోతుంది. ఇహలోకంలో నీకు సేవ చేసుకునే అదృష్టానికి దూరమైపోతున్నాను" అని. ఆ అన్నమాచార్య కీర్తనకి స్పందించిన ఒక మహాకవి హృదయం తన కవితా పదపుష్పాలతో ఇలా పరిమళించింది. అని మాధవి పిల్లలకి చెప్పి ఈ పాట పాడుతుంది. ఆ మహాకవి మన వేటూరి గారన్నమాట. ఈ పాట దృశ్యీకరణ కూడా చాలా బావుంటుంది.
కీరవాణి గారు స్వరపరిచిన ఆణిముత్యాల్లో ఈ సినిమా పాటలకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.
పాటలోని సాహిత్యంసవరించు
This file is a candidate for speedy deletion. It may be deleted after మంగళవారము, 24 డిసెంబర్ 2013.
పల్లవి
వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!
వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!
మమతలన్నీ మౌనగానం... వాంఛలన్నీ వాయులీనం...!
వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి...!
మాతృదేవోభవ ..! పితృదేవోభవ..! ఆచార్యదేవోభవ..!
పురస్కారాలుసవరించు
- వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా మనస్విని పురస్కారం - 1994.